పేరు (ఆంగ్లం) | Dawood Inaganti |
పేరు (తెలుగు) | దావూద్ ఇనగంటి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 02/20/1928 |
మరణం | 01/10/2018 |
పుట్టిన ఊరు | ప్రకాశం జిల్లా నాగులపాలెం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నూర్ బాషీయుల చరిత్ర-సంస్కృతి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | దావూద్ ఇనగంటి |
సంగ్రహ నమూనా రచన | – |
దావూద్ ఇనగంటి
దావూద్ ఇనగంటి తెలుగు రచయిత. పర్చూరు మండలం నాగులపాలెం గ్రామంలో 1928 ఫిబ్రవరి 20 న మదార్ బీ, కాశిమ్ సాహెబు లకు జన్మించారు.ఆయన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగు, ఆంగ్ల భాషల్లో వివిధ పత్రికలకు వ్యాసాలు వ్రాశారు. వక్ప్ ఆస్తుల పరిరక్షణ, సద్వినియోగం గురించి వీరు వ్రాసిన ఆంగ్ల వ్యాసం రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ ప్రశంసలందుకుంది. తెలుగు భాషాప్రియుడు, నూర్ భాషీయుల చరిత్రకారుడు.
వీరి రచనలో ముఖ్యమైనది నూర్ భాషీయుల చరిత్ర-సంస్కృతి (2001). లక్ష్యం: అన్నిరంగాలలో అసమానతలు తొలిగిపోవాలి.ఇనగంటి దావూద్ గారు 27.3.2011 న పదిశతకాలు రాసిన షేక్ అలీ గారికి తెలుగు భాష పై ఉన్న అపారమైన అభిమానంతో ఒక లేఖ రాశారు.ఇలా ఇద్దరు తెలుగు ముస్లిములు తెలుగు భాష కనుమరుగు, చెవిమరుగు కాకుండా కాపాడవలసిన బాధ్యత తమమీదనే ఉందని చెప్పుకోవటం విశేషం. తెలుగుమీద మక్కువ ఎక్కువగా ఉన్న ఈ ఇద్దరు సాయిబులు ఆదర్శనీయులు.G.A. Rahim Ips IG గారి నాన్నగారు గగ్గటూరి అబ్దుల్ ఖాదర్ దూదేకుల, పింజారీ, లద్దాఫ్ కులాల పేరును నూర్ బాషాగా మార్పించటంకోసం చాలా కష్టపడ్డారని ఇనగంటి దావూద్ గారు రాసిన “నూర్ బాషీయుల చరిత్ర-సంస్కృతి” పుస్తకంలో చదివాను.పింజారీ వెధవ’ అనే కారుకూతలను తమ సీరియళ్ళలో తొలగిస్తూ దూరదర్శన్ ప్రోగ్రామ్స్ కంట్రోలర్ వెంకటేశ్వర్లు గారు 18.2.1987న ఐ.పి షా గారికి క్షమాపణ ఉత్తరాన్ని రాశారు.డా. దాశరథి రంగాచార్య ఇనగంటి దావూద్ గారి ఉత్తరానికి స్పందించి తన ‘అమృతంగమయ’ సీరియల్ లో “ఈ పదం తొలగిస్తున్నాను క్షమాపణ కోరుతున్నాను” అంటూ పెంజరము అంటే ‘బంగారు హరిదళము’అని అర్ధం చెప్పారు (వార్త ఆదివారం 2.2.2003).అయినా పెంజరానికీ పింజారీకి ఎలాంటి సంబంధం లేదనీ, మానవులంతా ఒక్కటే, లోకమే వారి కుటుంబం, ఒకరు మరొకరికంటే అధికుడై జన్మించాడనే మాట అర్ధరహితం అని దావూద్ గారు వాదించారు.దావూద్ గారి వాదనను చివరికి రంగాచార్యగారు ఒప్పుకున్నారు.పింజారీ అనే పదాన్ని తొలగించారు.ఇకమీదట వాడనని క్షమాపణ చెప్పారు.తెలుగుఅకాడమీ వారి తెలుగు-తెలుగు నిఘంటువులో పింజారీ అంటే ఒకవిధమైన తిట్టు అనే అర్ధం ఇచ్చారు.అది ఎలా తిట్టుపదమో చెప్పాల్సిందిగా ఇనగంటి దావూద్ గారు నిగ్గదీస్తే పునర్ముద్రణలో ఈ తప్పును సవరించుకుంటామని ఆవులమంజులత గారు 28.8.2003 న సమాధానమిచ్చారు.
———–