మధుర కృష్ణమూర్తిశాస్త్రి (Madhura Krishnamurthy Sastry)

Share
పేరు (ఆంగ్లం)Madhura Krishnamurthy Sastry
పేరు (తెలుగు)మధుర కృష్ణమూర్తిశాస్త్రి
కలం పేరు
తల్లిపేరుశచీదేవమ్మ
తండ్రి పేరువెంకయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ02/28/1928
మరణం
పుట్టిన ఊరుపశ్చిమ గోదావరి తణుకు సమీపంలోని ముక్కామల గ్రామం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువాస్తు, జ్యోతిష, ధర్మశాస్త్రాలపై సుమారు 20 వరకు ప్రామాణిక గ్రంథాలను రచించారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుమహామహోపాధ్యాయ
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమధుర కృష్ణమూర్తిశాస్త్రి
సంగ్రహ నమూనా రచన

మధుర కృష్ణమూర్తిశాస్త్రి

మధుర కృష్ణమూర్తిశాస్త్రి ప్రముఖ జ్యోతిష, వాస్తు పండితుడు. జ్యోతిష, వాస్తు శాస్త్రాలపై దేశ, విదేశాలలో ఎన్నో ఉపన్యాసాలను ఇచ్చిన పండితుడు. ఆయన మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.
ఈయన పశ్చిమ గోదావరి తణుకు సమీపంలోని ముక్కామల గ్రామంలో వెంకయ్య, శచీదేవమ్మ దంపతులకు 1928 ఫిబ్రవరి 28 వ తేదీన జన్మించాడు. ఆంగ్ల చదువులు 8వ తరగతి వరకు చదివిన మధుర భారతీయ శాస్త్రగ్రంథాలను ఉద్దండుల వద్ద అధ్యయనం చేశారు. పిఠాపురానికి చెందిన పీశుపాటి విశ్వేశ్వర శాస్త్రి వద్ద పంచకావ్యాలు, వ్యాకరణంలో కౌముది వరకు, వాజపేయాజుల వెంకట సుబ్రహ్మణ్య సోమయాజుల వద్ద రుగ్వేద స్మార్తం, సంస్కృత నాటకాలంకారాది సాహిత్యం, జాతక, ముహూర్త, వాస్తుశాస్త్రాలను అధ్యయనం చేశారు. శ్రీపాద వెంకట రమణ దైవజ్ఞశర్మ వద్ద జ్యోతిషరంగంలో సిద్ధాంత భాగం, పంచాంగ రచన, ధర్మశాస్త్రాల అధ్యయనం కొనసాగించారు. తన మేనమామ, పీసపాటి పాలశంకరం, కుమార్తె మహాలక్ష్మితో వివాహంమేనమామల యింట ముక్కామల, తణుకు తాలూకా, పశ్చిమ గోదావరిజిల్లాలో జరిగింది. చాలాకాలం నుంచి జ్యోతిష విజ్ఞాన పత్రిక అనే త్రైమాసిక పత్రికను నడుపుతూ, జ్యోతిష, వాస్తుశాస్త్రాలకు విస్తృతప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన రెండవ కుమారుడు ఈ పత్రిక సంపాదక బాధ్యతను నిర్వహించేవారు.
ఆయన 1960 ప్రాంతాల్లో రాజమహేంద్రవరానికి తరలివచ్చి వాస్తు, జ్యోతిష, ధర్మశాస్త్రాలపై సుమారు 20 వరకు ప్రామాణిక గ్రంథాలను రచించారు. జ్యోతిష విజ్ఞాన పత్రిక అనే త్రైమాసిక పత్రికను నిర్వహించేవారు. 1989లో విశ్వవిజ్ఞాన ప్రతిష్ఠానం అనే సంస్థను స్థాపించి శాస్త్ర, విజ్ఞాన రంగాలకు చెందిన పరిశోధనలను ప్రోత్సహించేవారు. రూ.లక్షల వ్యయంతో దేశవిదేశాల నుంచి అనేక శాస్త్రగ్రంథాలను కొనుగోలు చేసి, పదిలపరిచారు. ఈ గ్రంథాలనన్నిటినీ రాజమహేంద్రవరం లోని ఒక గ్రంథాలయానికి బహూకరించి, వాటి నిర్వహణ నిమిత్తం సుమారు ఇరవై లక్షల రూపాయలను కూడా యిచ్చిన వదాన్యుడీయన.

———–

You may also like...