బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త (Bijinepalli Lakshmikanta Gupta)

Share
పేరు (ఆంగ్లం)Bijinepalli Lakshmikanta Gupta
పేరు (తెలుగు)బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ10/02/1929
మరణం07/24/2008
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపగడాల మాల, గాంధీ పథం, నవ్య జగత్తు, చంపకోత్పల సౌరభం, కాలమా నీ బలమెంత?
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త
సంగ్రహ నమూనా రచన

బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త

బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త మహబూబ్ నగర్ జిల్లా చెందిన తెలుగు కవి. ఈ కవి స్వస్థలం జిల్లాలోని బిజినపల్లి. ఇంటి పేరు బాదం, అయినా తన ఊరిపేరే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. సొంతూరులో గ్రంథాలయాన్ని స్థాపించాడు. నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో సైతం పాల్గొని, జైలు జీవితాన్ని అనుభవించాడు. జాతీయ విప్లవం, సామాజిక చైతన్యం, మానసిక పరివర్తనం వర్ధిల్లాలనేదే ఈ కవి ఆశయం, ఆకాంక్ష.
ఈ కవి, కవి కన్న ముందు గాయకుడు. మొదట్లో జి. నారాయణ రావు అనే తన మిత్రుడు రాసిన గేయాలను వివిధ సంధార్భాలలో, సమావేశాలలో పాడి వినిపించేవాడు. అలా కవిత్వ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లోని వైశ్య హాస్టల్‌లో చదువుకొనే సమయంలోనే తొలిసారి రచనా రంగంలోకి అడుగుపెట్టి …
వాసవీ కుమారులు రారండి!
వైశ్య సోదరులిక లేవండి.
వసుధలోన మీ వాసిని నిల్పగ, వడివడిగా త్యాగం చేయండి.
అంటూ కుల సోదరులకు మేలుకొల్పు గీతాన్ని వినిపించి కలమందుకొన్న ఈ కవి…తర్వాత తన జన్మభూమి పాలమూరును- నీవే దిక్కను వారల నీట ముంచక మంచి పాలముంచు మా పాలమూరు అని కీర్తిస్తూ, వీరభోగ్య వసుంధరా! పేరబరగు భారతాంబరో నేనెంత ప్రస్తుతింప! అని తన దేశాన్ని ప్రేమిస్తూ కవిత్వం రాశాడు.

———–

You may also like...