ద్వివేదుల విశాలాక్షి (Dwivedula Visalakshi)

Share
పేరు (ఆంగ్లం)Dwivedula Visalakshi
పేరు (తెలుగు)ద్వివేదుల విశాలాక్షి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుడి.ఎన్.రావు
పుట్టినతేదీ08/15/1929
మరణం11/07/2014
పుట్టిన ఊరువిజయనగరం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలుఇంగ్లిష్‌, హిందీ
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువైకుంఠపాళి (నవల) -1965, వారధి (నవల), మారిన విలువలు (నవల)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికద్వివేదుల విశాలాక్షి
సంగ్రహ నమూనా రచన

ద్వివేదుల విశాలాక్షి

1929, ఆగస్టు 15న విజయనగరంలో జన్మించిన ద్వివేదుల విశాలాక్షి విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది.

తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగిన విశాలాక్షి అనేక కథలు, కవితలు, వ్యాసాలు, రేడియో నాటికలు రచించింది. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో పర్యటించి తన సాహిత్య వాణి వినిపించింది. 1960వ దశకంలో ఆమె రచించిన “వారధి” నవల రెండు కుటుంబాల కథగా వెండితెరకెక్కింది. 1974లో విడుదలైన వస్తాడే మా బావ చిత్రానికి మాటలు రాసి సినీరంగంతోనూ అనుంబంధాన్ని కొనసాగించింది. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ఆమె ‘వారధి’ నవలను 1973లో పలు భారతీయ భాషలలోకి అనువదించి ప్రచురించారు.తన పుస్తకాల హక్కులను విశాఖపట్నంలోని ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయానికి ఆమె వ్రాసి యిచ్చింది. ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు పొందారు.

———–

You may also like...