పేరు (ఆంగ్లం) | Jammi Konetirao |
పేరు (తెలుగు) | జమ్మి కోనేటిరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | జమ్మి శకుంతల |
పుట్టినతేదీ | 03/01/1929 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పాడి పరిశ్రమ, జంతుపరిణామము, కోళ్ల పెంపకం, జంతు శాస్త్రం ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు, ఖగోళ శాస్త్రము – దాని చరిత్ర, విజ్ఞానసర్వస్వ ఖగోళ శాస్త్ర నిఘంటువు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | జమ్మి కోనేటిరావు |
సంగ్రహ నమూనా రచన | – |
జమ్మి కోనేటిరావు
జమ్మి కోనేటిరావు తెలుగులో విజ్ఞానశాస్త్ర విషయాలపై రచనలు చేసే అతికొద్ది మంది రచయితలలో ఒకడు. ఇతడు 1929, మార్చి 1వ తేదీన జన్మించాడు. ఇతడు విశాఖపట్టణంకు చెందినవాడు. వృత్తిరీత్యా జంతుశాస్త్ర అధ్యాపకుడు. తెలుగు సైన్సు రచయితల సంఘం[Science Writers Association in Telugu (SWATI) ]ను స్థాపించాడు. తరువాత ఈ సంస్థ న్యూఢిల్లీలోని ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్ (ISWA) కు అనుబంధంగా మారింది. అతని భార్య పేరుమీద జమ్మి శకుంతల అవార్డును నెలకొల్పి ప్రతియేటా ఒక సైన్సు రచయితకు జాతీయ సైన్స్ దినం రోజు ఆ అవార్డును ప్రదానం చేశాడు. ఈ అవార్డును పొందిన వారిలో కె.ఆర్.కె.మోహన్, మహీధర నళినీమోహన్, ఆర్.ఎల్.ఎన్.శాస్త్రి, బి.జి.వి.నరసింహారావు, సి.వి.సర్వేశ్వరశర్మ మొదలైనవారు ఉన్నారు. ఇతడు 80కి పైగా తెలుగులో శాస్త్ర సంబంధమైన గ్రంథాలు రచించాడు. 1954నుండి ఇతని రచనావ్యాసంగం మొదలై ఇప్పటి వరకు దాదాపు అన్ని ప్రముఖ ఇంగ్లీషు, తెలుగు దిన, వార, మాస, త్రైమాస పత్రికలలో వెయ్యికి పైగా వైజ్ఞానిక వ్యాసాలు వ్రాశాడు. వందకు పైగా రేడియో ప్రసంగాలు చేశాడు.
———–