పేరు (ఆంగ్లం) | K.G.Kannabiraan |
పేరు (తెలుగు) | కె.జి.కన్నబిరాన్ |
కలం పేరు | – |
తల్లిపేరు | పంకజం |
తండ్రి పేరు | కందడై గోపాలస్వామి అయ్యంగార్ |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/09/1929 |
మరణం | 12/10/2010 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ద వేజెస్ ఆఫ్ ఇంపునిటీ-పవర్,జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కె.జి.కన్నబిరాన్ |
సంగ్రహ నమూనా రచన | – |
కె.జి.కన్నబిరాన్
కె.జి.కన్నబిరాన్
కె.జి.కన్నబిరాన్ (కన్నాభిరాన్ గా సుపరిచితులు) పౌరహక్కుల ఉద్యమనేత మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది.ఆయన “పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్” సంస్థకు సహ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు.
ఆయన నవంబరు 9 1929 న తమిళనాడు లోని మధురైలో కందడై గోపాలస్వామి అయ్యంగార్ మరియు పంకజం దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి వైద్యులు.కన్నబిరాన్ పూర్వీకులు తమిళులు. తరతరాలుగా ఆయన కుటుంబీకులు నెల్లూరులో జీవిస్తున్నారు. కన్నబిరాన్ విద్యాభ్యాసం నెల్లూరులో చేసారు. ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం మరియు న్యాయశాస్త్రాలలో పట్టభద్రులైనారు. ఆయన మద్రాస్ బార్ కౌన్సిల్ లో చేరి 1953 నుండి న్యాయవాద వృత్తిని ఆయన మామయ్య అయిన రాజప్ప అనే వకీలి వద్ద చేపట్టారు.మొదటిరోజుల్లో ఆర్థికమైన ఇబ్బందులు చాలా పడి చివరికి న్యాయవాదిగా హైదరాబాదులో నిలదొక్కుకొన్నారు. 1970ప్రాంతాల్లో హైదరాబాదులో న్యాయవాదులు కొంతమంది కూడి రాష్ట్రంలో జరుగుతున్న నిర్బంధకాండలకు వ్యతిరేకంగా పనిచేయడానికి నక్సలైట్ డిఫెన్స్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసి, దానికి కన్నబిరాన్‌గార్ని అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. వీరందరూ కలిసి పార్వతీపురం, హైదరాబాద్ కుట్రకేసుల్లో డిఫెన్స్ న్యాయవాదులుగా వ్యవహరించసాగారు. అప్పుడు మొదలైన పౌరహక్కుల ఉద్యమం ఈరోజు ఉన్న స్థితికి రావటానికి ముఖ్యుల్లో ఒకరు శ్రీ కన్నబిరాన్. ఎమర్జెన్సీ రోజుల్లో డిటెన్యూలుగా ఉన్నవారి తరపున వాదించటానికి మిగిలిన ఒకే లాయరు శ్రీ కన్నబిరాన్. ఎమర్జెన్సీ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంఘం (AP Civil Liberties Committee, APCLC) కు పదిహేనేళ్ళు అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు అన్ని పౌరహక్కుల సంస్థలతోనూ, కార్యకర్తలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. పి.యు.సి.ఎల్ దేశ స్థాయి కార్యవర్గ సభ్యులు.
పోలీసులు తప్పుడుకేసులు పెట్టినప్పుడు ఆయన ఎంతో చాకచక్యంగా వాటిలోని లొసుగుల్ని బయటపెట్టేవారు. కన్నబిరాన్‌గారి జీవితమంతా రూల్ ఆఫ్ లాని నిష్పాక్షికంగా అమలుచేయటం గురించే. ఒకవేళ ఆ ‘లా’యే న్యాయంగా లేకపోతే దాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో సరిచేయటం గురించే.
———–