విడియాల చంద్రశేఖరరావు (Vidiyala Chandrashekhararao)

Share
పేరు (ఆంగ్లం)Vidiyala Chandrashekhararao
పేరు (తెలుగు)విడియాల చంద్రశేఖరరావు
కలం పేరు
తల్లిపేరునాగకోటేశ్వరమ్మ
తండ్రి పేరుకోటిలింగం
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1930
మరణం04/17/1985
పుట్టిన ఊరుకృష్ణాజిల్లా డోకిపర్రు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువదిన, ఇంటిదీపం, పంగనామాలు, త్రిశంకుస్వర్గం,
కాకారాయుళ్ళు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవిడియాల చంద్రశేఖరరావు
సంగ్రహ నమూనా రచన

విడియాల చంద్రశేఖరరావు

విడియాల చంద్రశేఖరరావు రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక, నవలా రచయిత మరియు వ్యాసకర్త. చంద్రశేఖరరావు 1930లో కోటిలింగం, నాగకోటేశ్వరమ్మ దంపతులకు కృష్ణాజిల్లా డోకిపర్రు జన్మించాడు. బందరు, తెనాలి లో చదువుకున్నాడు.
బాల్యం నుంచి చంద్రశేఖరరావుకు సాహిత్యం, కళలు అంటే ఇష్టం ఉండేది. తెనాలిలో చదివేరోజుల్లో మాధవపెద్ది వెంకట్రామయ్యప్రోత్సాహంతో నటనా విభాగంలో కొద్దికాలం కృషి చేశాడు. భూలోకంలో యమలోకం నాటకంలోని యముడు పాత్రతో మంచి గర్తింపు తెచ్చుకున్నాడు. రంగస్థల కళాకారుల జీవిత విశేషాలను పరిశోధించి నాటకరంగం శీర్షిక పేరుతో వివిధ పత్రికలలో వ్యాసాలు రాశాడు. చంద్రశేఖరరావు చేసిన ఈ కృషిని గుర్తించి ఆనాటి విద్యాశాఖామంత్రి మండలి వెంకటకృష్ణారావు ‘వ్యాసరచనా ప్రవీణ’ బిరుదునిచ్చి సత్కరించాడు. బందరు లో జీవిత బీమా ఉద్యోగ మిత్రులతో కలసి లలిత కళా సమితి అనే సంస్థను స్థాపించి పోటీలు నిర్వహించాడు. కళారంగ సేవ చేస్తున్న చంద్రశేఖరరావు ప్రతిభను గుర్తించి ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా నియమించింది.

———–

You may also like...