పేరు (ఆంగ్లం) | Guntupalli Radhakrishnamurthy |
పేరు (తెలుగు) | గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 03/20/1930 |
మరణం | – |
పుట్టిన ఊరు | కర్నూలు జిల్లా, నందవరం గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | నేత్రవైద్యుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నవలలు : గెలుపు, ప్రకాశము – ప్రేమ, చక్కని చుక్కలు ఇతర గ్రంథాలు : చందమామ యాత్ర, హాస్యకుసుమాలు, హక్కులు – విధు కథలు : కుబేరపుష్పకము, మనసు మలుపుల్లో, లాటరీచీటీ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి |
సంగ్రహ నమూనా రచన | – |
గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి
గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి కళాభిమాని, సాహిత్య పోషకుడు, రచయిత మరియు ప్రముఖ నేత్రవైద్యుడు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలోవైద్యవిజ్ఙానం శీర్షిక ద్వారా ఇతడు పాఠకులకు చిరపరిచితుడు. ఇతడు కర్నూలు జిల్లా, నందవరం గ్రామంలో 1930, మార్చి 25వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి గుంటుపల్లి శ్రీనివాసరావు కవి. అతడు రుక్మిణీ కళ్యాణము, జానకీ పరిణయము మొదలైన కావ్యాలను వ్రాశాడు. రాధాకృష్ణమూర్తి తన అన్న గుంటుపల్లి శ్రీరామమూర్తి వద్ద పెరిగి పెద్దయ్యాడు.
ఇతడు మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చదివి 1949లో బి.ఎస్.సి పట్టాను పొందాడు. తరువాత మద్రాసులోని వైద్యకళాశాలలో 1954లోఎం.బి.బి.ఎస్. డిగ్రీని, 1956లో ఆఫ్తాల్మాలజీలో డిప్లొమాను సంపాదించాడు. 1961లో ఎం.ఎస్. పట్టాను సాధించాడు. 1956లో ఆంధ్రప్రదేశ్ప్రభుత్వ వైద్యశాఖలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా ఉద్యోగం ప్రారంభించాడు. కర్నూలు, వరంగల్లు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీగా పనిచేశాడు. 1965లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి నేత్రవైద్యుడిగా బదిలీ అయ్యాడు. తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి అనంతపురంలో స్వంత నేత్రవైద్యశాలను స్థాపించి పేరు ప్రఖ్యాతులు పొందాడు.
ఇతడు మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి చదువుతున్నప్పుడే తెలుగు ఉపాధ్యాయుడు గరిమెళ్ల సత్యగోదావరిశర్మ వల్ల ఆంధ్రసాహిత్యం పట్ల మమకారం ఏర్పడింది. ఇతని తొలి రచన సుదినం 1946లో ఆంధ్రమహిళ మాసపత్రికలో అచ్చయ్యింది. అది మొదలు ఇతడు చిత్రగుప్త, నవజీవన, ఆనందవాణి, జయశ్రీ, కిన్నెర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర విద్యార్థి మొదలైన పత్రికలలో కథానిక[2]లు, వ్యాసాలు, నాటికలు, పద్యాలు, గేయాలు, శీర్షికలు వరుసగా ప్రకటించాడు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఇతడు నిర్వహించిన వైద్యవిజ్ఞానము, తెలుగు కలాలు శీర్షికలు పాఠకుల మెప్పును పొందాయి. “గుంటుపల్లి సూక్తి గురుడ వినర” అనే మకుటంతో 200 పద్యాలను వ్రాశాడు.
———–