దుగ్గిరాల సోమేశ్వరరావు (Duggirala Someshwararao)

Share
పేరు (ఆంగ్లం)Duggirala Someshwararao
పేరు (తెలుగు)దుగ్గిరాల సోమేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరుసత్యవతి
తండ్రి పేరుగౌరిపతి శాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1932
మరణం
పుట్టిన ఊరునిడదవోలు తాలూకాలోని నందమూరు గ్రామం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదుగ్గిరాల సోమేశ్వరరావు
సంగ్రహ నమూనా రచన

దుగ్గిరాల సోమేశ్వరరావు

దుగ్గిరాల సోమేశ్వరరావు నాటక రచయిత, దర్శకుడు, కళాకారులు, సాంకేతిక నిపుణులు.

టెలీ కమ్యూనికేషన్స్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా 1990లో పదవీ విరమణ చేసిన దుగ్గిరాల సోమేశ్వరరావు నాటక కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కాకినాడ నిడదవోలులో మిత్ర నాటక బృందాలు విశాఖపట్నంలో విశాఖ నాటక కళామండలి పి అండ్ టి డిపార్ట్‌మెంట్ సాంస్కృతిక విభాగం అభ్యుదయ కళాసమితి కర్నూలు, ఎ.ఆర్.కృష్ణ గారి ఆధ్వర్యంలో హైదరాబాదు లో నిర్వహించిన అనేక సాంస్కృతిక సంస్థల్లో సభ్యుడుగా ఉంటూ అనేక నాటకాలు ప్రదర్శించి, ప్రదర్శింపజేశాడు. సాంస్కృతిక సంస్థల ద్వారా వివిధ హోదాల్లో సభ్యుడుగా కొనసాగుతూ ఎన్నో నాటకాల్లో అద్భుతమైన నటన కనపర్చాడు.

కన్యాశుల్కం లో కరకట శాస్త్రి, వీలునామాలో కామేశం, మృచ్ఛకటికమ్‌ లో శకారుడు, ప్రతాపరుద్రీయం లో యుగంధరుడు, మాలపల్లిలో వెంకట దాసు ఉరఫ్ జగ్గడు, తిరస్కృతిలో చంద్రశేఖర్ ఇలా అనేక గొప్ప, గొప్ప నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి నాటకాభిమానుల చేత శభాష్ అనిపించుకున్నాడు.

ఈయన నటనా ప్రతిభకు మెచ్చి వీరికి గత ఐదున్నర దశాబ్దాలలో విజయనగరం, బళ్ళారి రాఘవ పరిషత్ నాటక పోటీలలో ఉత్తమ నటుడు బహుమతి, 1965లో జరిగిన అంతరాష్ట్ర నాటకోత్సవాలలోను, దూరదర్శన్‌ లోను ప్రదర్శించిన మృచ్ఛకటిక నాటకంలో శకారుడు పాత్ర పోషణకు పత్రికా ప్రశంసలతోపాటు అప్పటి రాష్టప్రతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రత్యేక అభినందనలు అందుకున్నాడు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం కూడా వీరిని వరించింది. ఇంకా తూర్పు గోదావరి వారి నుండి 1999 సంవత్సరానికి రంగస్థల పురస్కారం, యువ కళావాహిని హైదరాబాదు వారినుండి 2000 సంవత్సరానికి గరికపాటి రాజారావు పురస్కారం, 2007 సంవత్సరానికి తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు, శ్రీనాథుడు నాటకానికి ఉత్తమ దర్శకుడిగా కాంస్య నంది ప్రదర్శనకు రజిత నంది, నగదు పురస్కారం మొదలైనవి వీయనకు లభించాయి.

చందోబంధమైన పద్య రచన ఈయన ప్రత్యేకత. ఈయన కవితా ప్రక్రియకు గౌతం రాజు హనుమంతరావు సాహితీ పురస్కారం అందుకున్నాడు. ప్రవాసాంధ నవ్య కళా పరిషత్ ఖరగ్‌పూర్ వారి అభినందన సత్కారం, ఆంధ్ర సారస్వత సమితి జాతీయ కవి పురస్కారం వంటి ఎన్నెన్నో పురస్కారాలు ఈయన్ని వరించాయి.

———–

You may also like...