కోవెల సుప్రసన్నాచార్య (Kovela Suprasannacharya)

Share
పేరు (ఆంగ్లం)Kovela Suprasannacharya
పేరు (తెలుగు)కోవెల సుప్రసన్నాచార్య
కలం పేరు
తల్లిపేరులక్ష్మీనరసమ్మ
తండ్రి పేరువెంకట నరసింహాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ03/17/1936
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుభావుకసీమ (సాహిత్య వ్యాససంపుటి), భావసంధ్య (వ్యాససంపుటి), దీపవృక్షం, అంతరంగం (పీఠికా సంకలనం), చందనశాఖి, ఏకశిలా సాహిత్య సౌందర్యము (ప్రసంగ వ్యాసాలు), కావ్యప్రమితి (వ్యాససంపుటి), దర్పణం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకోవెల సుప్రసన్నాచార్య
సంగ్రహ నమూనా రచన

కోవెల సుప్రసన్నాచార్య

కోవెల సుప్రసన్నాచార్య సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, కవి. ఇతడు యువనామ సంవత్సర ఫాల్గుణ కృష్ణ నవమి కి సరియైన 1936, మార్చి 17 వతేదీన వెంకట నరసింహాచార్యులు, లక్ష్మీనరసమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు.[1]ఇతడి పితామహుడు కోయిల్ కందాడై రంగాచార్యులు, మాతామహుడు ఠంయ్యాల లక్ష్మీనృసింహాచార్యులు ఇతనికి సాహిత్య గురువులు. 9 ఏళ్ల వయసులోనే ఇతడు కందపద్యాలు వ్రాయడం ప్రారంభించాడు. వరంగల్లులోనిఎ.వి.వి.హైస్కూలులో ఉన్నతవిద్య చదివాడు. హైదరాబాదులో బి.ఎ.చేశాడు. 1959లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ.చేశాడు. రామరాజభూషణుని కృతులు అనే అంశంపై పరిశోధన చేసి 1962లో పి.హెచ్.డి పట్టా పొందాడు. ఎం.ఎ.పూర్తి చేశాక సిటీకాలేజీ, ఈవినింగ్ కాలేజీలలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా చేశాడు. 1961లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడ్‌హాక్ లెక్చరర్‌గా నియమించబడ్డాడు. 1962 నుండి కాకతీయ విశ్వవిద్యాలయం లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేశాడు. వరంగల్ ఈవినింగ్ కాలేజీకి ప్రిన్స్‌పాల్‌గా, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖకు హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌గా, డీన్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా సేవలను అందించాడు. ఇతని మార్గదర్శకత్వంలో 20 పి.హెచ్.డి, 16 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి. విశ్వనాథ సత్యనారాయణ, శ్ర్ అరవిందులు, భగవాన్ రమణ, సద్గురు శివానందమూర్తిల ప్రభావం ఈయన పై ఎక్కువగా ఉంది. ఈయన కుమారుడు సంతోష్ కుమార్ పాత్రికేయుడు. ఇతను రాసిన దేవరహస్యం గ్రంథం తెలుగు నాట ప్రాచుర్యం పొందిన పుస్తకం.
1954లో సాహితీబంధు బృందం అనే సంస్థను స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1957లో మిత్రమండలి స్థాపించాడు. 1958లో హైదరాబాదులో రసధుని అనే సంస్థను మొదలి నాగభూషణశర్మ, మాదిరాజు రంగారావులతో కలిసి ప్రారంభించాడు. 1960లో కులపతి సమితిని స్థాపించాడు. జాతీయ సాహిత్య పరిషత్తులో జీవిత సభ్యుడిగా, విశ్వనాథభారతి సంస్థలో జీవితసభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యుడిగా ఉన్నాడు. పోతన విజ్ఞాన సమితి కార్యదర్శిగా చేశాడు. 1973లో మొదటిసారి అవధానం చేశాడు. తరువాత కరీంనగర్, వేములవాడ, ములుగు, ఘన్‌పూర్, హనుమకొండ తదితర ప్రాంతాలలో సుమారు 60-70 అవధానాలు చేశాడు. గోలకొండపత్రిక, స్రవంతి, తెలుగుదేశం, ప్రభాస, జయంతి, ఆంధ్రప్ర్రభ, ఆంధ్రప్రదేశ్, భారతి, జనధర్మ, జ్యోతి, విమర్శిని, జాగృతి, మూసీ, సాధన మొదలైన పత్రికలలో ఇతని రచనలు ప్రచురింపబడ్డాయి.

———–

You may also like...