పేరు (ఆంగ్లం) | Guduri Seetaram |
పేరు (తెలుగు) | గూడూరి సీతారాం |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 07/18/1936 |
మరణం | 09/25/2011 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నారిగాని బతుకు, పెళ్లి ప్రేమ, మారాజు, రంగడు, రాజమ్మ రాజరికం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గూడూరి సీతారాం |
సంగ్రహ నమూనా రచన | – |
గూడూరి సీతారాం
గూడూరి సీతారాం తెలంగాణలోని తొలితరం కథారచయిత. తెలంగాణ యాసలో, భాషలో కథలు రాసిన సీతారాం 1953-1965 వరకు సుమారు 80 కథల వరకు రాశాడు.
గూడూరి సీతారాం 1936, జూలై 18న కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల దగ్గరలోని హనుమాజీపేట్ లో జన్మించాడు.
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి కి బాల్యమిత్రుడైన సీతారాం 1960, జనవరి 1న మొదటి కథను రాశాడు. తను నిజ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, తాను అనుభవించిన జీవితం, ఫ్యూడల్ భూస్వాముల దౌర్జన్యాలు, పల్లె బతుకు, గ్రామ పెత్తందార్ల పెద్దరికం, రజాకార్ల సంఘటనలు మొదలైనవి సీతారాం రచనలు చేయడానికి దోహదం చేశాయి.[2]
అప్పటికాలంలో గ్రాంధిక భాషలో పుస్తకాలు ఎక్కవగా ఉండేవి. వ్యవహారిక భాషలో దొరకడం తక్కువ. దాంతో, నిత్య జీవితంలో ఉపయోగించే భాషలో రచనలు చేస్తే అందరికీ అర్థమవుతుందన్న ఉద్దేశ్యంతో ఆ మాండలికంలో రచనలు చేశాడు. అనేక గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు.
———–