పేరు (ఆంగ్లం) | Kottapalli Ghanashyamala Prasadarao |
పేరు (తెలుగు) | కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | అన్నపూర్ణ |
తండ్రి పేరు | వెంకట అప్పారావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/07/1937 |
మరణం | 12/29/2016 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | జీవించే దేవాలయం, దేవాలయాలపై బొమ్మలు , పరమపద సోపానాలు, భారత్‌లో విగ్రహారాధన ప్రారంభవికాసాలు, భారత మాతృస్తవమ్ (సంస్కృతం),ప్రజాపోరాటం, జీవధార (ఖండకావ్యం), మాతృపదమంజీరాలు (దేశభక్తి గీతాలు) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | ఆర్షవిజ్ఞానవిశారద, అవధానకళానిధి |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు |
సంగ్రహ నమూనా రచన | – |
కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు
కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, అవధాని, బహుభాషా కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు బహు గ్రంథ రచయిత.
ఈయన 1937, నవంబరు 7న కృష్ణాజిల్లా కైకలూరు గ్రామంలో అన్నపూర్ణ, వెంకట అప్పారావు దంపతులకు జన్మించారు. ఈయన మచిలీపట్నం హైందవోన్నత పాఠశాల, హిందూ కళాశాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యలను చదివారు. గుడివాడ ఎ.ఎన్.ఆర్. కళాశాలలో ఆంగ్ల సాహిత్యం అభిమాన విషయంగా బి.ఎ. చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1962లో సంస్కృతంలో ఎం.ఎ., అగస్త్య పండితుని బాలభారతము అనే విషయంపై పోచంపల్లి శ్రీరామమూర్తి పర్యవేక్షణలో పరిశోధన గావించి 1984లో పి.హెచ్.డి చేశారు. తూర్పుగోదావరి జిల్లా, అమలాపురంలోని ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా 1965లో చేరి, ప్రాచ్యభాషా విభాగానికి అధిపతిగా ఎదిగారు. ఈయన సంస్కృత, తెలుగు, ఆంగ్ల భాషలలో రచనలు చేశారు. హిందీ, ఆంగ్ల భాషలనుండి పలు గ్రంథాలను తెలుగులోనికి తర్జుమా చేశారు. ఈయన అష్టావధానం, నేత్రావధానం మొదలైన సాహిత్య ప్రక్రియలలో కృషిచేశారు. ఈయన మంచి చిత్రకారులు కూడా. ఎన్నో తైలవర్ణచిత్రాలు ఈయనకి పేరును తెచ్చిపెట్టాయి. ఈయన అనేక సెమినార్లలో తెలుగు, సంస్కృతాలలో పత్రసమర్పణ చేశారు. ఆకాశవాణిలో సంస్కృతాంధ్రభాషలలో కవిత్వం, దేశభక్తి గేయాలు, నాటికలు ప్రసారం చేశారు. ఈయన పలు స్టేజి, రేడియో నాటకాలలో నటించారు. సంస్కారభారతి సంస్థకు అఖిలభారత కార్యదర్శిగా పనిచేశారు
———–