తాడిగిరి పోతరాజు (Tadigiri Potaraju)

Share
పేరు (ఆంగ్లం)Tadigiri Potaraju
పేరు (తెలుగు)తాడిగిరి పోతరాజు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ05/02/1937
మరణం01/09/2015
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅతను ఇకలేడు, అమ్మ, ఆరోహక గీతం, ఆశల వాన, ఇంకా తెల్లవారలేదు, ఉదయించని ఉదయం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతాడిగిరి పోతరాజు
సంగ్రహ నమూనా రచన

తాడిగిరి పోతరాజు

తాడిగిరి పోతరాజు తొలితరం విప్లవ కథారచయిత.ఇతడు 1937 మే 2వ తేదీన సారమ్మ, రాయపరాజు దంపతులకు జన్మించాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ దగ్గరలోని ఎల్కతుర్తిమండలం కోతుల నడుమ ఇతని స్వగ్రామం. పోతరాజుకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఇతడు భారతి, విద్యుల్లత, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, స్వాతి, రచన, విశాలాంధ్ర, జ్యోతి, విపుల, నవ్య, చుక్కాని, పుస్తకం, యువ, చినుకు, ప్రతిభ, సృజన పత్రికల్లో కథలు రాశాడు. పలు కథలకు బహుమతులు అందుకున్నాడు. విప్లవ రచయితల సంఘం (విరసం), ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్‌సి) లో ఈయన కొంతకాలం పనిచేశాడు. అత్యవసర పరిస్థితి కాలంలో ఇతడు జైలుకు వెళ్లాడు. కరీంనగర్, హుజూరాబాద్‌లలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేసి 1995లో ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశాడు. 1969 తెలంగాణ ఉద్యమంలోను, 1970 నక్సల్బరీ పోరాటంలోను, 1975 ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోను ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.[2] 1958 నుంచి ఇతడు కథారచన చేస్తున్నాడు. 1962లో ఇతని నవలిక పావురాలు భారతి పత్రికలో అచ్చయింది. ఇతడు రచించిన గాజుకిటికీ కథ ప్రముఖ కథారచయిత త్రిపుర ప్రశాలు పొందింది. పోతరాజు మట్టిబొమ్మలు అనే నవల కూడా రాశాడు. 2010లో ఇతని కథాసంకలనం కేటిల్ విడుదలైంది. ఇతడు 2015, జనవరి 9వ తేదీ కరీంనగర్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు

———–

You may also like...