వల్లంపాటి వెంకటసుబ్బయ్య (Vallampati Venkatasubbaiah)

Share
పేరు (ఆంగ్లం)Vallampati Venkatasubbaiah
పేరు (తెలుగు)వల్లంపాటి వెంకటసుబ్బయ్య
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ03/15/1937
మరణం01/02/2007
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునవలలు : ఇంద్ర ధనుస్సు – 1962, దూర తీరాలు – 1964, మమతలు – మంచుతెరలు – 1972, జానకి పెళ్ళి – 1974
కథలు : బండి కదిలింది, రానున్న శిశిరం, బంధాలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుతాపీ ధర్మారావు అవార్డు – 1993, కొండేపూడి సాహిత్య సత్కారం – 1995, తెలుగు యూనివర్శిటీ అవార్డు – 1997, గజ్జల మల్లారెడ్డి అవార్డు – 2000, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2000
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవల్లంపాటి వెంకటసుబ్బయ్య
సంగ్రహ నమూనా రచన

వల్లంపాటి వెంకటసుబ్బయ్య

వల్లంపాటి వెంకటసుబ్బయ్య ప్రముఖ సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
వల్లంపాటి 1937, మార్చి 15 న చిత్తూరు జిల్లా రొంపిచర్ల లో జన్మించాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి, ఇంగ్లీషులో ఎం.ఏ చేసి, తరువాత హైదరాబాదు లోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ నుంచి ఎం.లిట్‌ పొందాడు. మదనపల్లెబీసెంట్‌ థియేసాఫికల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసాడు.
వల్లంపాటి కథకుడిగా తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు. పరిష్కారం, మిథ్య మొదలైన కథానికలు 40 దాకా ప్రచురించాడు. ఆయన రాసిన ఇంధ్రధనస్సు, దూర తీరాలు నవలలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బహుమతులు పొందాయి. వల్లంపాటి సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధుడు. ఆయన రాసిన కథా శిల్పం, నవలాశిల్పం, విమర్శా శిల్పం పుస్తకాలు తెలుగు సాహిత్య విమర్శకు ప్రామాణికాలు. అనువాదకుడిగా కుడా ఆయన ప్రసిద్ధుడే. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలను అనువదించాడు. తస్లీమా నస్రీన్‌ రచించిన లజ్జ, బ్రిటిష్‌ రచయిత ఇ.హెచ్‌.కార్‌ రచించిన చరిత్ర అంటే ఏమిటి…? ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని.
ఆయన రాసిన కథాశిల్పం రచనకు 1999 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇదే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా ఎంపిక చేసి, సత్కరించింది.
యుపయోగపడవచ్చునని నా జాతకచక్రము నిందు బొందుపరుచుచున్నాను .

———–

You may also like...