ఆదిరాజు వెంకటేశ్వరరావు (Adiraju Venkateshwararao)

Share
పేరు (ఆంగ్లం)Adiraju Venkateshwararao
పేరు (తెలుగు)ఆదిరాజు వెంకటేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1938
మరణం06/14/2018
పుట్టిన ఊరుఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, పండితాపురం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుతెలంగాణ పోరాటం, హంతకులు ఎవరు,
మహానాయకుడు మర్రిచెన్నారెడ్డి,
ఆంధ్రా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు-కొన్ని గుణపాఠాలు, నక్సలిజం-పెరిగిపోతున్న అరాచకాలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆదిరాజు వెంకటేశ్వరరావు
సంగ్రహ నమూనా రచన

ఆదిరాజు వెంకటేశ్వరరావు

ఆదిరాజు వెంకటేశ్వరరావు తొలితరం (1969) తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ పాత్రికేయుడు, రచయిత, ప్రజాతంత్ర వ్యవస్థాపకుల్లో ఒకరు. 1969 ఉద్యమ సమయంలో 21 రోజులు జైలుకెళ్లిన ఏకైక పాత్రికేయుడు.
వెంకటేశ్వరరావు 1938లో ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, పండితాపురంలోని రైతు కుటుంబంలో జన్మించాడు. పలు తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేయడమేకాకుండా. జనతా, రాజధాని (1981-83) పత్రికలను నడిపాడు. 1969 తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్నప్పుడు 21 రోజుల పాటు ముషీరాబాద్ జైలులో ఉన్న వెంకటేశ్వరరావు రాసిన ‘‘పీపుల్స్‌ స్ట్రగుల్‌’’ అనే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. మలిదశ ఉద్యమాన్ని కూడా అక్షరబద్ధం చేశాడు. దేశమంతటా తిరిగి వివిధాంశాలపై వ్యాసాలు రాయడమేకాకుండా అమెరికా, బ్రిటన్‌, స్విట్జర్లాండ్ దేశాల్లో కూడా ఆయన పర్యటించడంతోపాటు ఐక్యరాజ్య సమితి భద్రతామండలి, ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలపై కూడా వార్తలను రాశాడు. పాత్రికేయునిగా హైదరాబాద్‌, ఢిల్లీలో పని చేసిన ఆదిరాజు రాసే ఉత్తరాలకు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తిరిగి రిప్లై ఇచ్చేవారు.

———–

You may also like...