పేరు (ఆంగ్లం) | Koppula Hemadri |
పేరు (తెలుగు) | కొప్పుల హేమాద్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 09/13/1938 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆంధ్ర ప్రదేశ్ లో మందు మొక్కలు, ఔషథీ వృక్ష శాస్త్రము, గిరిజన మూలికా వైద్యం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కొప్పుల హేమాద్రి |
సంగ్రహ నమూనా రచన | – |
కొప్పుల హేమాద్రి
కొప్పుల హేమాద్రి వృక్ష శాస్త్ర పరిశోధకులు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తూర్పుకనుమల అడవుల్లో మాత్రమే కనిపించే నాగార్జున ఉల్లిగడ్డ అనే మొక్కను తొలిసారిగా 1982 లో కొప్పుల హేమాద్రి మరియు స్వహారి శశిభూషణరావు అను వృక్షశాస్త్రవేత్తలు కనుగొన్నారు.
కొప్పుల హేమాద్రి తూర్పు గోదావరి జిల్లా, గొల్లప్రోలు గ్రామంలో సెప్టెంబర్ 19, 1938 న జన్మించారు . ఈయన అనకాపల్లి లోని ఎ.ఎం.ఎ.ఎల్. కాలేజీ నుంచి బి.ఎస్.సి (కెమిస్ట్రీ) పట్టాను 1959 లో పుచ్చుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ బోంబేలో బి.ఎస్.సి ఆనర్స్ పూర్తి చేసారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (వెస్టర్న్ సర్కిల్) పూనాలో పరిశోధకునిగా ఉద్యోగంలో చేరారు. మొక్కలు వాటి జాతులు, వైవిధ్యాలు గురించి గాఢ అధ్యయనం చేస్తూ పరిశోధనలు ప్రారంభించారు. ఎం.ఎస్.సి అభ్యసిస్తూ పరిశోధన పత్రాలు సమర్పించేందుకు “ఫ్లోరా ఆఫ్ జన్నర్” ప్రాంతాలలో మొక్కల జాతులు మీద విశేష పరిశోధనలు చేసారు.
సహ్యాద్రి కొండల నడుమ ఉన్న దట్టమైన అటవీ ప్రాంతమే ఫ్లోరా ఆఫ్ జన్నర్. ఆ ప్రాంతాన్ని అణువణువునా పరిశోధించి 14 కొత్త మొక్కలను కనిపెట్టారు. శతాబ్దాల నుండి పరిశోధకులకు కానరాని, తెలియని ఆ మొక్కల వినియోగం, ప్రయోజనాల గురించి ప్రాచీన గ్రంథాలను సంప్రదించారు. తన పరిశోధన సారాంశాన్ని “బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా” సంస్థ డైరక్టరుకు పరిశీలన నిమిత్తం పంపగా, దానిని పి.హెచ్.డికి పంపించవలసినదిగా సలహా యిచ్చారు. దానిని ప్రపంచ ప్రఖ్యాత సంస్థ “రిజ్క్ హెర్బేరియం” (పోలండ్ దేశం) కు పంపించారు. అక్కడి డైరక్టరు ఆయన పరిశోధనా గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, చిన్న, చిన్న సవరణలు చేసి పి.హె.డికి బదులుగా డి.ఎస్.సి పట్టాను అందించారు. ఈయన పరిశోధనలతో 40 కొత్తరకాల మొక్కలు వైద్యరంగంలో ప్రవేశించాయి. ఆయన కేంద్రీయ ప్రభుత్వ ఆయుర్వేద సంస్థలో సర్వే అధికారిగా ఔషథ మొక్కలను పరిశోధనలు జరిపేందుకు నియమితులయ్యారు. అప్పటి వరకు ఉన్న ఆయుర్వేద గ్రంథాలళో, నిఘంటువులలో ఉన్న మందుల మొక్కల పేర్చు దాదాపుగా అన్ని తప్పులుగా ఉండేవి. అన్ని తప్పులను సవరించి, వర్గీకరణలు చేసి, అసలు సిసలైన నామకరణం చేసారు.చరిత్ర గర్భంలో మాటు మణిగిన 24 రకాల మొక్కలను కొత్తగా పరిచయం చేసారు. హిమాలయాలలో మాత్రమే లభ్యమవుతుందనుకొనే ” గోమూత్ర శిలాజిత్”ను ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నట్లు కనుగొన్నారు. ఈ “గోమూత్ర శిలాజిత్” కడప లోని వెంపల్లి కొండల మీద “రక్తమండలం” పేరుతోనూ, అనంతపురం జిల్లా మడకసిర గ్రామ ప్రాంతాలలోని బంగారు నాయకుని కొండమీద “మునిరెట్ట” పేరుతోనూ, మహబూబ్ నగర్ జిల్లాలో “కొండముచ్చు మూత్రం” గానూ పిలువబడుతుంది.
ఆయన 2005 వరకు 15 వైద్య గ్రంథ రచనలను వెలువరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో మందు మొక్కలు, ఔషథీ వృక్ష శాస్త్రము, లను తెలుగు అకాడమీ వారు ప్రచురించి బి.ఎస్.సి (ఆయుర్వేద) విద్యార్థులకు పాఠ్య గ్రంథాలుగా రూపొందించారు. ఈయన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ జిల్లాల్లో లభ్యమవుతున్న ఔషథీ మొక్కలను పరిచయం చేస్తూ వాటి వినియోగ విధానాలను వివరిస్తూ పలు గ్రంథ రచనలు చేసారు. “గిరిజన మూలికా వైద్యం” గ్రంథం ప్రసిద్ధి పొందింది. ఆయుర్వేద నిఘంటువులను అక్షర క్రమంలో నామీకరణ ద్వారా సరిదిద్దారు.
కొప్పులవారి కతలూ…కబుర్లూ పుస్తకంలో ఆయన అనుభవాలను కథల రూపంలో వివరించారు. పుస్తకంలో సగం కబుర్లు తన ఊరు గొల్లప్రోలు గురించి. ఇందులో కనిపించే వ్యక్తులు — రచయిత తాతగారు, అమ్మా నాన్నలు, అక్కలు, బళ్ళో గురువు, స్నేహితులు, మంత్రగాళ్ళు — ఇలా ఎందరో. అందరి గురించి తీయటి జ్ఞాపకాలు. చదివిన ప్రతి ఒకరికీ వారి చిన్ననాటి విషయాలు కచ్చితంగా జ్ఞాపకం వస్తాయి. పల్లె వాతావరణంలో పెరిగిన వారికైతే ఇది మృష్టాన్నభోజనమే. మిగత సగం వ్యాసాల విషయాలు — కాలేజి చదువు, కాలేజి గురువులు, సహోద్యోగులు, ఉద్యొగంలో దోహదపడ్డ పెద్దలు, వృక్షశాస్త్ర పరిశోధనలు, ముఖ్యంగా మూలిక వైద్యం.
———–