Share
పేరు (ఆంగ్లం)P.S.Narayana
పేరు (తెలుగు)పి.ఎస్.నారాయణ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅంతరంగ తరంగాలు, అంతరంగం, అంతర్ముఖుడు,
అంతస్సు, అందం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపి.ఎస్.నారాయణ
సంగ్రహ నమూనా రచన

పి.ఎస్.నారాయణ

పి.ఎస్.నారాయణ ప్రముఖ కథారచయిత. ఇతడు 230కు పైగా కథలు, 31 నవలలు, 10 రేడియో నాటికలు, 2 స్టేజి నాటకాలు, ఏన్నో విమర్శా వ్యాసాలు రచించాడు.
పి.ఎస్.నారాయణగా పిలువబడే పొత్తూరి సత్యనారాయణ 1938లో గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, చినకాకానిలో పొత్తూరి రామయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించడంతో పెద్ద అక్కయ్య వద్ద పెరిగి పెద్ద అయ్యాడు. ఇతడు ప్రాథమిక విద్య చినకాకానిలోను, సెకెండ్ ఫారం వరకు మంగళగిరిలోను, థర్డ్ ఫారం నుండి బి.కాం వరకు గుంటూరులోని హిందూ కళాశాలలో చదివాడు. కాలేజీ చదివే సమయంలో మన్నవ గిరిధరరావు ఇతని గురువు.
ఇతడు 1957లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. మొదట రెవెన్యూ శాఖలో గుమాస్తాగా తాత్కాలికంగా పనిలోకి చేరాడు. తరువాత అదే గుమాస్తాగా వైద్య శాఖలోనికి మారాడు. అక్కడ రెండేళ్లు పనిచేసి గుంటూరు జిల్లా ట్రెజరీలో గుమాస్తాగా పర్మనెంటు ఉద్యోగంలో చేరాడు. అక్కడ నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. 1963లో హైదరాబాదులోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్‌లో జూనియ అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడ సుమారు 30 సంవత్సరాలు పనిచేసి 1993లో సీనియర్ అకౌంట్స్ ఎక్జిక్యూటివ్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. ఇతడు బి.కాం. చదువుతుండగా ఇతనికి తన అక్క కూతురు మాధురి అన్నపుర్ణతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలిగారు.
ఇతని తొలిరచన 1957లో గుంటూరు పత్రికలో అచ్చయింది. ఇతడు తొలినాళ్ళలో మాధురి అనే కలంపేరుతోను, అనేక ఇతర కలం పేర్లతోను రచనలు చేసేవాడు. ఇతడిని ఇతని గురువు మన్నవ గిరిధరరావు చాలా ప్రోత్సహించాడు. ప్రముఖ రచయితలు తారక రామారావు, కాకాని చక్రపాణి, శ్రీ సుభా, కవిరాజు, పాలకోడేటి సత్యనారాయణరావు, దత్తప్రసాద్ పరమాత్ముని, డి. చంద్రశేఖరరెడ్డి, గోవిందరాజు చక్రధర్, మల్లాది వెంకటకృష్ణమూర్తి మొదలైనవారు ఇతని సమకాలికులు మరియు సన్నిహితులు. ఇతని రచనలు స్వాతి, నవ్య, ఇండియాటుడే, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, జ్యోతి, అప్సర, యువ, రచన తదితర దిన, వార, పక్ష, మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి.

———–

You may also like...