వీరవెల్లి రాఘవాచార్య (Veeravelli Raghavacharya)

Share
పేరు (ఆంగ్లం)Veeravelli Raghavacharya
పేరు (తెలుగు)వీరవెల్లి రాఘవాచార్య
కలం పేరుజ్వాలాముఖి
తల్లిపేరువెంకటలక్ష్మీనర్సమ్మ
తండ్రి పేరునరసింహాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ04/12/1938
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశరత్ జీవిత చరిత్రను ‘దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు’ పేరుతో హిందీ నుంచి అనువదించారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవీరవెల్లి రాఘవాచార్య
సంగ్రహ నమూనా రచన

వీరవెల్లి రాఘవాచార్య

జ్వాలాముఖి ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకడు. విరసం సభ్యుడు. శరత్ జీవిత చరిత్రను ‘దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు’ పేరుతో హిందీ నుంచి అనువదించాడు.
వ్యక్తిగత జీవితం
మెదక్ జిల్లా ఆకారం గ్రామంలో 1938 ఏప్రిల్ 12 న జన్మించిన ఆయన అసలు పేరు వీరవెల్లి రాఘవాచార్య. తల్లిదండ్రులు నరసింహాచార్యులు, వెంకటలక్ష్మీనర్సమ్మ. హైదరాబాద్‌లోని మల్లేపల్లి, నిజాం కళాశాలలో విద్యాభాస్యాన్ని పూర్తి చేసుకున్న ఆయన నిజాం కళాశాలలో ఎల్.ఎల్‌.బీ. పూర్తిచేశాడు. ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో 12 ఏళ్లు విధులు నిర్వహించాడు. తరువాత హైదరాబాద్‌లోని ఎల్.ఎన్‌.గుప్తా సైన్స్, కామర్స్ కళాశాలలో24 ఏళ్లు అధ్యాపకుడిగా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశాడు. మొదట్లో నాస్తికవాదం, పిదప మానవతా వాదం, అనంతరం మార్కిస్టు ఆలోచన విధానం వైపు మొగ్గు చూపాడు. 1958లో ‘మనిషి’ దీర్ఘకవితకు గుంటూరు రచయితల సంఘంవారు కరుణశ్రీ చేతులమీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందజేశారు. 1965-70 మధ్య దిగంబర కవుల పేరుతో కవితా సంపుటాలు రాశాడు. ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (ఓ.పీ.డీ.ఆర్) సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు సార్లు చైనాకు వెళ్లారు. 1971లో విరసం సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద నిఖిలేశ్వర్, చెరబండరాజులతో ముషీరాబాద్ జైల్లో యాభై రోజులున్నాడు. 1975 ఎమర్జెన్సీ కాలంలో 15 రోజులు జైల్లో ఉన్నారు. ఈయన పై మఖ్దూం మొహియుద్దీన్ ప్రభావం ఉంది. డిసెంబరు 14 2008 న కాలేయ వ్యాధి, గుండెపోటుతో మరణించాడు.
జ్వాలాముఖి రచనలు
‘వేలాడిన మందారం’ నవల
హైదరా’బాధ’లు
‘ఓటమి తిరుగుబాటు’ కవితా సంకలనం
‘రాంగేయ రాఘవ’ జీవిత చరిత్ర హిందీ నుంచి తెలుగు అనువాదం
అవార్డులు
ఝాన్సీ హేతువాద మెమోరియల్ అవార్డు
దాశరథి రంగాచార్య పురస్కారం
హిందీలో వేమూరి ఆంజనేయ శర్మ అవార్డు

———–

You may also like...