పేరు (ఆంగ్లం) | Bandi Gopalareddy |
పేరు (తెలుగు) | బండి గోపాలరెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/12/1938 |
మరణం | 10/31/1982 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | స్వయంగా సి.పి.బ్రౌన్ జర్నలిజం చరిత్ర, సి.పి.బ్రౌన్ సాహిత్య స్వీయచరిత్ర, బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు, మాలపల్లి నవలపై ప్రభుత్వ నిషేధాలు వంటి పలు అంశాలపై గ్రంథాలు రాశారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బండి గోపాలరెడ్డి |
సంగ్రహ నమూనా రచన | – |
బండి గోపాలరెడ్డి
బంగోరె అనే పేరుతో ప్రసిద్ధుడైన బండి గోపాలరెడ్డి (1938-1982) పత్రికా రచయిత, గొప్ప సాహిత్య పరిశోధకుడు, విమర్శకుడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించిన బంగోరె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం.కాం ఆనర్స్ వరకూ చదువుకున్నా ఆసక్తి, కృషి మాత్రం సాహిత్యం, పరిశోధన రంగాల్లోనే సాగింది. కొద్దికాలం పాటు సహకార బ్యాంకులో పనిచేసినా ప్రధానంగా పాత్రికేయునిగా, పరిశోధకునిగా జీవించాడు.
నెల్లూరు స్థానిక చరిత్రతో ప్రారంభమైన కృషి విస్తరిస్తూ వేమన, సి.పి.బ్రౌన్, గురజాడ వంటి పలువురి సాహిత్యం, జీవితాలపై లోతైన పరిశోధనలతో తెలుగు సాహిత్య పరిశోధన రంగంలో సంచలనం సృష్టించాడు. ఆ క్రమంలో బ్రౌన్ సాహిత్య కృషిపైన, వేమనపై, వేమన గురించి 20వ శతాబ్ది తొలినాళ్ళలో సాహిత్య కృషికి ప్రోత్సహించిన సి.ఆర్.రెడ్డి, సాగించిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వంటివారి గురించి, గురజాడ జీవితం, సాహిత్యాల గురించి, వీరేశలింగం గురించి, అజ్ఞాత చరిత్రకారులు, జర్నలిస్టుల గురించి – ఇలా ఎన్నెన్నో అంశాల గురించి పరిశోధనలు, ప్రచురణలు చేశారు. గురజాడ అప్పారావు కన్యాశుల్కం మొదటి కూర్పు, బ్రౌన్ ప్రచురించిన తాతాచార్ల కథలు, సి.ఆర్.రెడ్డి ప్రసంగాలు, వ్యాసాలు, డాక్టర్ జె.మంగమ్మ బుక్ ప్రింటింగ్ ఇన్ ఇండియా వంటివెన్నో వెలికితీసి, పరిష్కరించి, నోట్స్ రాసి పలు హోదాల్లో ప్రచురించాడు. స్వయంగా సి.పి.బ్రౌన్ జర్నలిజం చరిత్ర, సి.పి.బ్రౌన్ సాహిత్య స్వీయచరిత్ర, బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు, మాలపల్లి నవలపై ప్రభుత్వ నిషేధాలు వంటి పలు అంశాలపై గ్రంథాలు రాశారు. బంగోరె పరిశోధనల్లో వెలికివచ్చిన అంశాల్లో గురజాడ అప్పారావు జన్మదినం, బ్రిటీష్ ప్రభుత్వంపై తిరగబడ్డ నెల్లూరు అజ్ఞాత స్వాతంత్ర్య యోధుడు వంటివి ఉన్నాయి.
జమీన్ రైతు పత్రిక సహాయ సంపాదకునిగా 1964 నుంచి 1971 వరకు, ఆపైన ఏడాది పాటు మద్రాసు (నేటి చెన్నై)లో అమెరికన్ రిపోర్టరులో పాత్రికేయునిగా, 1975 నుంచి 1979 వరకూ తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టు రీసెర్చి అధికారిగా, 1980 నుంచి ఏడాది పాటు ప్రభుత్వం వేమనపై ఏర్పరిచన పరిశోధన ప్రాజెక్టులో, ఆపైన 1982 వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కట్టమంచి రామలింగారెడ్డి గురించి ఏర్పరిచిన ప్రాజెక్టులో పనిచేశాడు. 1975 – 1982 మధ్యకాలంలో పలు అకడమిక్ రీసెర్చి ప్రాజెక్టుల్లో పనిచేస్తూ, తన పరిశోధన సంతృప్తికరంగా ముగియకుండానే వాటి కాలం చెల్లిపోతూ, అస్థిరమైన పరిస్థితుల్లో జీవించడం, పరిశోధన ప్రాజెక్టుల్లో పరిస్థితులు వంటికారణాలతో జీవితేచ్ఛ కోల్పోయాడు. ఎవరికీ చెప్పకుండా నెల్లూరు విడిచిపెట్టి ఢిల్లీ, హరిద్వార్, హృషీకేశ్ వంటి ప్రాంతాలు తిరిగి, అశాంతితో 1982 అక్టోబర్ 31న 44 సంవత్సరాల ప్రాయంలో భాక్రానంగల్ ప్రాజెక్టుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బంగోరె చేసిన పరిశోధన కృషి ఎంతో ఉన్నా రాసుకున్న నోట్సులోంచి విస్తరించి చేయాల్సిన పరిశోధనలు, పరిష్కరించి చేయాల్సిన ప్రచురణలు మరణానంతరం మిగిలిపోయే ఉన్నాయి.
———–