కేతు విశ్వనాథరెడ్డి (Ketu Viswanathareddy)

Share
పేరు (ఆంగ్లం)Ketu Viswanathareddy
పేరు (తెలుగు)కేతు విశ్వనాథ రెడ్డి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ07/10/1939
మరణం
పుట్టిన ఊరువైఎస్ఆర్ జిల్లా కమలాపురం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు1991 కేతు విస్వనాథరెడ్డి కథలు……. ఆంధ్రజోతి వార పత్రిక.
1975 ద్రోహం. విశాలాంధ్ర దిన పత్రిక.
1977 ఆత్మ రక్షణ. వీచిక మాస పత్రిక.
1977 మన ప్రేమకథలు. ఆంధ్ర జోతి మాస పత్రిక.
1978 విశ్వరూపం స్వాతి మాస పత్రిక.
1979 ఆరోజులొస్తే… నివేదిత మాస పత్రిక.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (న్యూఢిల్లీ),
భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా), తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు), రావిశాస్త్రి అవార్డు,
రితంబరీ అవార్డు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకేతు విశ్వనాథ రెడ్డి
సంగ్రహ నమూనా రచన

కేతు విశ్వనాథ రెడ్డి

కేతు విశ్వనాథ రెడ్డి (1939, జూలై 10 – 2023, మే 22) ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు.

జూలై 10, 1939న వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురం గ్రామంలో జన్మించాడు.

ఈయన తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు “దృష్టి” అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో Torch bearers అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం “ఈభూమి” పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించాడు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల. విశ్వనాధరెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి చదువుకథలు[1] అనే కథల సంపుటిని సంకలనం చేశారు.

పురస్కారాలు
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (న్యూ ఢిల్లీ),
భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా),
తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు),
రావిశాస్త్రి అవార్డు,
రితంబరీ అవార్డు
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[2]

———–

You may also like...