గోపరాజు సమరం (Goparaju Samaram)

Share
పేరు (ఆంగ్లం)Goparaju Samaram
పేరు (తెలుగు)గోపరాజు సమరం
కలం పేరు
తల్లిపేరుగోపరాజు సరస్వతి
తండ్రి పేరుగోరా
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ07/30/1939
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తివైద్యుడు, రచయిత, సంఘ సేవకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసైన్సు-నాస్తికత్వం1981, సైన్సు-మనస్సు 1982, ముప్పుతెచ్చేమూఢనమ్మకాలు 1993, కుటుంబ నియంత్రణ పద్ధతులు-డా.జి.సమరం (ఆర్కీవ్.ఆర్గ్ లో ప్రతి), ఆధునిక ఆరోగ్య రక్షణ గ్రంథావళి (హార్ట్ ఎటాక్),
ఆధునిక ఆరోగ్యరక్షణ గ్రంథావళి (వ్యాధులు-భయాలు)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగోపరాజు సమరం
సంగ్రహ నమూనా రచన

గోపరాజు సమరం

డా. గోపరాజు సమరం, ప్రముఖ వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు మరియు ప్రముఖ రచయిత. వైద్యవిజ్ఞాన సంబంధించిన విషయాలపై తెలుగులో అనేక గ్రంథాలు రచించాడు. సమరం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నాస్తికవాది అయిన గోరా మరియు సరస్వతి గోరాలకుమారుడు. వృత్తి రీత్యా వైద్యుడైన సమరం వివిధ రంగాలలో కృషి సలిపాడు. సమరం జూలై 30, 1939లో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలోజన్మించాడు.
కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల నుండి ఎం.బీ.,బీ.ఎస్. పట్టా పొంది సమరం 1970లో విజయవాడలో వైద్యునిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. వందలాది ఉచిత వైద్యశిబిరాలు, టీకావైద్యం క్యాంపులు, నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పోలియో శస్త్రచికిత్రా శిబిరాలు, కుటుంబ నియంత్రణ శిబిరాలు, హెచ్‌.ఐ.వీ. రక్తపరీక్షా శిబిరాలు నిర్వహించటంలో ప్రధానపాత్ర పోషించాడు. సమాజంలోని అన్నివర్గాల ప్రజాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంపొందించటంలో విశేషకృషి చేశాడు. సమరం స్వేఛ్ఛాగోరా నేత్రనిధి యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు. బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలను రూపుమాపడానికి సమరం వీటి సమస్య హెచ్చుగా ఉన్న మెదక్, నిజామాబాదు, అదిలాబాదు, నల్గొండ జిల్లాలో అనేక బృందాలతో పర్యటించాడు. జిల్లా అధికారులు, పోలీసు సూపరిండెంటు ఆహ్వానముపై బాణామతిపై అవగాహన పెంచడానికి వైద్యులు, శాస్త్రజ్ఞులు, మంత్రజాలికులు, మిమిక్రీ కళాకారులు మరియు స్వఛ్ఛంద కార్యకర్తలతో కూడిన బృందాలకు నాయకత్వం వహించాడు. సమరం విజయవాడలోని పోలీసు వైద్య కేంద్రము యొక్క గౌరవ నిర్దేశకుడు.
డా. సమరం భారతీయ వైద్య సంఘ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు. స్థానిక, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిల్లో అనేక ఉన్నత పదవులను చేపట్టాడు. 1980-81 సంవత్సరానికి గాను భారతీయ వైద్య సంస్థలో సంఘపు ఉత్తమ రాష్ట్రాధ్యక్షునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. 1996-97లో భారతీయ వైద్య సంఘము (Indian Medical Association) యొక్క ఉపాధ్యక్షునిగా పనిచేశాడు.ఈయన భార్యడా.రష్మీ కూడా వీరి కృషిలో పాలుపంచుకుంటున్నారు.
డా.సమరం హేతువాది. మూఢ నమ్మకాలను వమ్ముచేసే డాక్టరు. నెలకొల్పిన మొట్ట మొదట్లో ప్రజా రాజ్యం పార్టీ లో చేరాడు. తరువాత ప్రజారాజ్యం పార్టీ కూడా మిగతా పార్టీలలాంటిదేనని ప్రకటించి అందులోంచి తప్పుకున్నాడు.

———–

You may also like...