పేరు (ఆంగ్లం) | Chakravathula Lakshminarsamma |
పేరు (తెలుగు) | చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | నరసమాంబ |
తండ్రి పేరు | వీర రాఘవాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 01/03/1939 |
మరణం | – |
పుట్టిన ఊరు | ఖమ్మం జిల్లా, భద్రాచలం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | భద్రగిరి (నవల), రామదాసు (పద్యకావ్యం – మధురై కామరాజ్ యూనివర్సటీ నుండి ఎం.ఫిల్ పరిశోధన), కవితా ధనుస్సు (ఖండకావ్యం), సమతాభిరామం (భద్రగిరిధామ శతకం), శాంతిభిక్ష (ఖండకావ్యం), శ్రీపదం (ద్రవిడ ప్రబంధానువాద పద్యకావ్యం), అక్షరతర్పణం (స్మృతి కావ్యం), మారుతీ సుప్రభాతం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం – హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2018 మార్చి 8, యునెస్కో సాహితీ స్వర్ణ మహిళ – 1998, యునెస్కో లిటరసీ ఉమన్ ఆఫ్ ద ఇయర్ – 1998, భీమవరం వారి ఆధ్యాత్మిక పురస్కారం – 2000, భద్రాచలం వాసవీ క్లబ్ వారి సేవా పురస్కారం (భద్రాచలం) – 2002, సత్తుపల్లి బ్రాహ్మణ సంఘం వారి ఉగాది పురస్కారం – 2004, సాయినాథ బదరికాశ్రమ పురస్కారం (జూకల్లు గ్రామం) |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ |
సంగ్రహ నమూనా రచన | – |
చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ
డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి, అభినవ మొల్ల బిరుదాంకితురాలు. ఈవిడ 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.లక్ష్మీనరసమ్మ 1939, జనవరి 3వ తేదీన పొడిచేటి వీర రాఘవాచార్యులు, నరసమాంబ దంపతులకు ఖమ్మం జిల్లా, భద్రాచలంలోజన్మించింది. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 60 సంవత్సారాలు ప్రధానార్చక పదవిలో సేవలందించాడు.
శారదా బిల్లు చట్టం ఉన్న ఆ సమయంలో 9 సంవత్సరాలకే రహస్యంగా లక్ష్మీనర్సమ్మ వివాహం జరిగింది. అత్త, ఆడపడుచుల ఆరళ్ళతో ప్రారంభమైన ఆమె వివాహ జీవితం సరిగా సాగలేదు. లక్ష్మీనర్సమ్మ ఇంటిలోని బావిలో త్రోసి వేయగా, పాలేర్లు రక్షించి పుట్టింటికి చేర్చారు. స్వయంగా ఇంట్లో ఉండి ప్రైవేటుగా ఆంధ్రా మెట్రిక్ పాసైంది. ఎస్.జి.బి.టి. ట్రైనింగ్ పూర్తిచేసి భద్రాచలం మల్టీపర్పస్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టింది. ఉద్యోగం చేస్తూనే పి.యు.సి., బి.ఏ, ఎం.ఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది.
లక్ష్మీనర్సమ్మ 7 సంవత్సరాల వయసులో గాంధీ మహాత్ముని మరణవార్త విని “భారత జనకుడు ఇకలేదు, గాంధీ తాత ఇకలేడు” అంటూ తన తొలి కవిత రాసింది. ఒక పది సంవత్సరాలపాటు ఒయాసిస్సులు, విధి బలీయం, పంట కళ్ళం మొదలైన కథలను పత్రికలు రచించాయి. గోల్కొండ పత్రిక, కృష్ణా పత్రిక, ప్రజామత, మనదేశం, తెలుగు తేజం, ఆంధ్రప్రభ, జ్యోతి, ఆంధ్రపత్రిక, వార పత్రికలు లక్ష్మీనర్సమ్మ రచనలను ప్రోత్సహించాయి.
1964 సంవత్సరంలో భద్రగిరి అనే నవల వ్రాసింది. మహాకవి దాశరథి దానికి పీఠిక వ్రాశారు. 1981లో ‘రామదాసు’ పద్య కావ్యం వ్రాశారు. కరుణశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు “అభినవ మొల్ల” బిరుదు ప్రసాధించారు. మహాకవి పధునా పంతుల సత్యనారాయణ శాస్త్రిగారు బలపరిచారు. అప్పటి నుండి ఆమె వెనుతిరుగలేదు. 22 పద్య, గద్య కావ్యాలు రచించింది.
———–