పేరు (ఆంగ్లం) | Gurajada Sriramamurthy |
పేరు (తెలుగు) | గురజాడ శ్రీరామమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | దుర్గాప్రసాదరావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1851 |
మరణం | 1/1/1899 |
పుట్టిన ఊరు | కాకినాడ |
విద్యార్హతలు | – |
వృత్తి | రచయిత, సంపాదకులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | చిత్రరత్నాకరము, కళాపూర్ణోదయ కథాసంగ్రహము, కవి జీవితములు, కలభాషిణి, తెనాలి , మకృష్ణుని కథలు, అప్పయదీక్షిత చారిత్రము, తిమ్మరుసు చారిత్రము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గురజాడ శ్రీరామమూర్తి |
సంగ్రహ నమూనా రచన | గురజాడ శ్రీరామమూర్తి గారికి బూర్వము తెనుగున గవి చరిత్రములు లేవు. వీరాంగ్ల విద్యాధికులు గాన బాశ్చాత్య విద్వాంసులు రచించిన కవి జీవితములు చూచి యట్టిది యాంధ్రమున సంధానించిరి. ఆంద్ర కవి జీవితములు కథా ప్రధాన మయిన గ్రంధము. అందు కవి కాల నిర్ణయాదుల కంటె నా యా కవులపై జెప్పుకొను పుక్కిటి పురాణము లెక్కువ. |
గురజాడ శ్రీరామమూర్తి
గురజాడ శ్రీరామమూర్తి గారికి బూర్వము తెనుగున గవి చరిత్రములు లేవు. వీరాంగ్ల విద్యాధికులు గాన బాశ్చాత్య విద్వాంసులు రచించిన కవి జీవితములు చూచి యట్టిది యాంధ్రమున సంధానించిరి. ఆంద్ర కవి జీవితములు కథా ప్రధాన మయిన గ్రంధము. అందు కవి కాల నిర్ణయాదుల కంటె నా యా కవులపై జెప్పుకొను పుక్కిటి పురాణము లెక్కువ. చారిత్రక దృష్టితో బరిశీలించిన నీ గ్రంధమునకు బ్రథమ స్థానము లేకున్నను గవి చారిత్రముల కిది మార్గ దర్శి యనవలయును. కందుకూరి వీరేశలింగము పంతులు తమ ‘కవులచరిత్ర ‘ లో మఱుగున నున్న కవులను బెక్కుమందిని బయట బెట్టి వారి వారి కాల నిర్ణయములు సప్రమాణముగా నొనరించి తత్తద్గ్రంథములలోని గుణ దోహములు వెల్లడించిరి. ఆ కారణమున వీరి కవి జీవితముల కంటె, వారి కవి చరిత్రములకు బెద్ద పేరు వచ్చినది. 1880 లో కవి జీవిత రచనము వీరిది సాగినది. రామ మూర్తి పంతులు గారి పీఠికలోని కొన్ని మాటలు పరికింప దగినవి.
“……………. కందుకూరి వీరేశలింగము గారు తమ మిత్రు లెవ్వరో తమ్ము గవి చరిత్రములు తిరుగ రచియించుటకు బ్రేరేపించినారని కవి చారిత్రము లను పేరితో నొక గ్రంథము ప్రాచీన కవులం గూర్చిన భాగమును ముద్రించి ప్రకటించిరి. అందు పెక్కండ్రు కవుల పేళ్ళును వారి చారిత్రములను 101
వ్రాసినట్లున్నను జాల భాగ మిదివఱలో నాచే బ్రకతింప బడిన కవి జీవితముల యర్థ సంగ్రహమే కాని వేఱు కాదు. ఏవియైన నొకటి రెండు కథలు నవీనముగా కాంపించుటకు జేర్పబడినను నవి యనవసరమైన చారిత్రములు గానైనను లేక ప్రత్యేకము కవిత్వ శైలిం జూపుటకు వ్రాయ బడిన పద్యములు నుదాహరణములుగా నైన నుండును…………
ఇది యటుండె, రామ మూర్తి పంతులు గారిది సువర్ణ విగ్రహము. విగ్రహమునకు దగ్గగుణసంపత్తి. ఈయన ‘మెట్రిక్యులేషన్ ‘ నేటి ఎం.ఏ లకు సహపాఠి. వీరు కాకినాడ సబ్ కోర్టులో నుద్యోగించుచు రాజీనామానిచ్చి 1830 లో విజయనగర సంస్థానాధీశ్వరులు ఆనంద గజపతి సన్నిధిని నిలయ విద్వాంసుడుగా నుండెను. ఆ ప్రభువున కీకవి యెడల జెప్పలేని యాదరము. ఆనంద గజపతి నిర్యాణము 1897 లో. ఆ తరువాత రామమూర్తి గారిని సంస్థానము పోషించినది. వీరి కవి జీవితములు ఆనంద గజపతి పేరుగా వెలసి యున్నవి.
ఈయన చరిత్ర పరిశీలకుడే గాక కవి కూడను. ‘మర్చంటు ఆఫ్ వినీస్ ‘ నాటకమును బరివర్తించిరి. ఓగిరాల జగన్నాధ కవిగారి యచ్చ తెనుగు నిఘంటువగు ఆంధ్ర పద పారిజాతము ను కొన్ని పదములందు జేర్చి కూర్చి వీరచ్చుకొట్టించిరి. తిమ్మరుసు, బెండపూడి అన్న మంత్రి, ఆప్పయ దీక్షితులు ఈ మూవురు మహామహుల చరిత్రములు సంపాదించిరి. తెలుగు వారి కందిచ్చిరి. మొత్తము, వీరికి జరిత్ర సంధానముపై మక్కువ యెక్కువ. వీరు కాకినాడ నుండి వెలువరించిన ‘ రాజయోగీ’ పత్రిక నాడు పేరు గాంచినది. విజయనగరము ప్రాంతములో వీరికి కాకినాడ పంతు లని పేరు. శ్రీరామమూర్తి గారి ‘కవిజీవితములు ‘ చరిత్రలో నొక కనక ఘట్టము.
***
గురజాడ శ్రీరామ్మూర్తి (నమూనా రచన )
కవి జీవితములు
ప్రధమ భాగము
****
1
వేములవాడ భీమకవి.
ఈ కవి శిఖామణి వేములవాడ యను నెక యూర జన్మంబం గాంచుటం జేసి యిట్టిగృహ నామంబు గలిగినది . ఈ గ్రామము గొందఱు కృష్ణా మండలములోని దందురు . మణికొందఱు గోదావరీ మండలంలోనిదే యని నిశ్చయింపబడినది . ఇది కాకినాడకు సమీపమున నున్నయది . దీనికి గొంచెము దూరముననే దాక్షారామము (దక్షవాటిక ) అను గ్రామ మున్నది . అచ్చటనే భీమనాయక స్వామి యున్నవాడు . ఆయీశ్వరునికటాక్షాతిశయమున నీత డుద్భవించే ననియు నాతని కీతడు కుమారుడే యనియు వాడుక గలదు . ఇది యెంత వరకు నమ్మదగినదో మనము చెప్పలేము . ఇట్టివార్తలు మన హిందువులలోనే కాక క్రైస్తవులు మొదలగునితరమతముల వారిలోనుం గలవు . ఈ విధముననే క్రీస్తువు భగవంతుని కుమారుడని జగత్ప్రసిద్ది గలదు . అట్టి వృత్తాంతమును ప్రతి మతములోనను మహాత్ములం గూర్చి చెప్పునప్పుడు కల్గును . కావును నందరును నమ్మవలసినదే కాని వేఱు కాదు . అట్టి వారిలో గొందఱు నమ్మ మనుట కలిగెనేని వారు తమ మతము నట్లే గ్రహించి రణ వచ్చును . అయినను మన మిపు డా విషయము గూర్చి మాటలాడ వలసినది లేదు . భీమన జన్మ వృత్తాంతము గొంత వక్కాణింతము .
వేములవాడ గ్రామములో నొక బ్రాహ్మణుడు కాపురము సేయుచుండెను . ఆయన కోక కూతురు సంతానము లేక వగచు కాలమున గలిగినది . అట్టి శిశువుం జూచి యా బ్రాహ్మణుడు మిక్కిలి ప్రేమతో బెంచుచు బెద్ద దానిం జేసి వివాహ సమయము తటస్థింపగానే యొకా నొక బ్రాహ్మణ కుమారునికి విద్యా బుద్ధులచే నొప్పు వాని కిచ్చి వివాహము చేసెను . ఆ చిన్న దాని కత్త వారి యింటికి వెడలు ప్రాయము వచ్చు వఱ కాచిన్న దాని భర్త కాల్ ధర్మము నొందెను . అపుడా చిన్నది విశేష మయింటనే యుంచుకొని పోషించుచుండిరి . ఇట్లుండ గొంత కాల మతి క్రమించినది. ఒకానొక సమయమున నాయూర నుండు మణి కొందఱు బ్రాహ్మణ స్త్రీలు శివరాత్రి నాడు తత్పర్వంబునకై యాసమీపముననే యున్న దాక్షారామమునకు జన నుద్యుక్త లయిరి . అపు డీ బ్రాహ్మణుని కూతురును వాడ్రతో బోవ గమకించి తల్లిదండ్రుల నాజ్ఞ యడు గాగా వారును గూతు రిహమునకు గాకున్న బరమునకైన దగుయత్నంబు చేయవలసినదే కావున దీనికి సెల వీయదగు నని తగు ధనం బిచ్చి వాండ్ర వెంట దాక్షారామమునకు బంపిరి .
ఇటు లా బ్రాహ్మణ స్త్రీలందఱు దక్ష వాటిం జేరి యచ్చోటు న నున్నసప్త గోదావరములో స్నానము చేసి భీమనాధుని దర్శించి స్వమనో భిష్టములం గోరుచు మ్రొక్కు లిడ సాగిరి . అపు దీ బాలరండయు స్వామికి దనతో డియువతులు మ్రొక్కుట చూచి అవి సఫలము లగునా యయినా నేనును మ్రొక్కెద నని యీశ్వరుని దిక్కు మొగంబై “ఓ స్వామీ ! నాకు ణీ యట్టి కుమారుడు పుట్టేనేని పుట్టెడు నీరు దీపారాధన చేసి నాలుగు పుట్లయిసుక నైవేద్యము పెట్టెద “ నన్నది . అట్టి దీని మనవి యా యీ శ్వరుని కెంతయు సమ్మోద కారి యయ్యెనట . ఆహా ! ఏమి ! ఈశ్వరుని విలాసము ! ఏమి ! యాభక్తసులభత ! ఇట్లు నలువురితో పాటు మ్రొక్కి యింటికి వచ్చి శయనించినయా బ్రాహ్మణ స్త్రీకి స్వప్నమున నాయీశ్వరుడు సాక్షాత్కరించి “ ఓ యువతీ ! నా యట్టి పుత్రుని బడయ గోరితివి ; అవరము నీకు దయ సేయ వచ్చితిని ; ఇదె గైకొమ్మని యామెతో నప్పుడే కలసి నీ పుత్రునకు నాపేరే యుంచు “ మని సెలవిచ్చి యంతర్హితుండయ్యెను.
ఆ బ్రాహ్మణి యది యంతయుం జూచి విస్మితయై యొక విధ మగుకల కావలయును . లేకున్న నీశ్వరు డెక్కడ ? నే నెక్కడ ? నన్ను బొందుటయే యాతనికి వలయునా ? అని యూహించి సిగ్గు చేత నీవృత్తాంత మెవ్వరితోడను జెప్ప జాల దయ్యెను . ఇట్లుండ నెల తప్పినది . అంతట వేవిళ్ళారంభ మయినవి . దానిం జూచి యాచిన్నది మనంబున గళవళ పడ సాగినది . అంత మూడు మాసంబులు గతించినతోడనే యా చిన్నది గర్భము ధరించినది యని యందఱు ననుమానపడ దొడగిరి . ఇట్లుండ నైదవమాసము సంప్రాప్త మయినది . అప్పటిస్థితి గతుల నాలోచించి యాచిన్నది దోషిణి కావున దీని నిలు వేదాల గొట్టిన గాని మీయింటికి రా మని యా లేమ తండ్రితో నాయిరుగు పొరుగువా రందఱు ననిరి . అపు డా బ్రాహ్మణుడు కూతుం బిలిచి నిజ వృత్తాంతము చెప్పు మనుడు నా చిన్నది కన్నీరు నించుచు దా శివునకు మ్రొక్కు విధంబును శివుడు తనకు గాల్లో గంపించిన తెణంగును సవిస్తరముగా జెప్పిన నా బ్రాహ్మణుడు తాను శివ పూజాపరుడు కావున శివునకు గల్గిన మహాను గ్రహమునకు సంతసిల్లి “ అమ్మా ! నీవు వగవకుము . లోకులేమనిన ననగలరు . నాకు నీ వృత్తాంతము సరిపడి యున్నయది “ అని యాచిన్న దానిని దాగు విధంబున గాపాడు చుండెను . అంత నవమాసములును నిండినవి . అపుడా పె కొక పుత్రుడు విశేష తేజ శ్శాలి జనియించెను . అతని తేజో విశేషంబుల జూచి యాతనికి భీమేశ్వరం డని నామకరణము చేసేను . ఇదియ వేములవాడ భీమకవి జన్మ ప్రకారము . ఇది యీ దేశమున నంతటను నట్లే వ్యవహరింపబడుచున్నది . ఇక నితని శైశవ క్రీడాదికముం గూర్చి యంచుక వ్రాయుదము .
ఈ భీమకవి యయిదాఱు సంవత్సరముల వఱకు దల్లి పాలనకు లో నై యుండెను . ఇట్లుండి యొక నాడు తోడి పిల్లలతో నాటలాడు చుండినం దొక కుఱ్ఱం డీత డన్ని యాటలం గెల్చుకొనుచుంట సహింపలేక యితనిలోపము లెన్న దలచి “యో కుఱ్ఱలారా ! మన మా తండ్రి లేనివాని తో నాడ నేల ? మనలో మన మాడుకొనుదము రండు “ అని వారిం బిలుచుకొని పోవుడు భీమకవి మొగము చిన్న బుచ్చుకొని య చ్చోటు వాసి పోయి తన తల్లిం గాంచి యిట్లనియె . “ అమ్మా ! మాతండ్రి యెచ్చో నున్నాడు ? ఒకచో నున్న యెడల న న్నీ బాలు రిట్లనుటకు గారణం బేమి ? తండ్రి లేనివాడని పెక్కుగ బల్కి యపహసించుట యేల కల్గే ? దీనికి గారణమ్ము దెలుపు మనుడు నమ్ముగుద యేమియు నన నోరాడక యూరకుండినది .” అది త న్నవమానించుట గా భీమన పెఱీకికొని వచ్చి “ మా తండ్రి మాట చెప్పెదవా ? లేకున్నా నీతల శకలంబులు చేయుదునా ; అనుడు నా పె భయ మొంది యిట్లనియె . “అయ్యా ! మీయయ్య దాక్షారామపు దేవళములో నున్న యాశిలయే . అతని యొద్దకుం బోయి నీ వృత్తాంతమంతయు నడుగు మనుడు వల్లె యని యా రాతిలో నచ్చటికిం బోయి “యోయీ ! నీవు నా తండ్రి వట ! నీ వుండ నన్ను దండ్రి లేనివాడా యని నా స్నేహితులన నవసరం బేమి ? నీవు నాతండ్రివే యయిన యెడల వారి కందరఱకును గాన్పించి నన్నిట్లన కుండ జేయుము “ అనుడు నా దేవుని వలన నేమియు నుత్తరము లేదయ్యెను .”అంతం గోపించి భీమన ఏమీ యీ మూర్ఖత నీవు మాట్లాడకున్న నీ రాతిచే నీశిరంబు శకలీభూతంబు గావించెదను “ అనుడు నాయీశ్వరుడు వాని యెడ వాత్సల్యము వహించి ప్రత్యక్షంబై నేను నీకు దండ్రి నే యగుదును . నీవు నాకు బిడ్డడవు . ఈ వృత్తాంతము లోకములోనందఱకు నిక దెలియును పోమ్మనుడు భీమన యంతటితో బోనీయక నే నీకోడుకునే యయిన నే నాడినది యాటాయు బాడినది పద్యమును నగునట్లు వర మి మ్మనుడు నవ్వి య మ్మహామహుం డట్ల వరమిచ్చి యంతర్హితుం డయ్యె . అట్టి వరములం బడసి భీమన తల్లికడ కరుదెంచి యా వృత్తాంత మా పెకు దెల్పిన నా పెయ హర్షోత్కర్షము నందినది . భీమన నాట నుండియు నా బాలురతో గలియక తనపని తాను జూచుకొనుచుండెను . ఇట్లుండ మఱీ కొన్ని దినంబులు గతించినవి . అంత నాయూర నొక గొప్ప గృహస్థుని యింట బ్రాహ్మణ సంతర్పణ తటస్థించినది . అపు డాయూర నండు బ్రాహ్మణులందకొందఱును భోజనంబునకు బిలువంబడిరి . భీమ తనమున వగచి కార్య మగుచున్న వారి వాకిట గూర్చుండెను . ఇతడును వాకిట నున్నా డను వర్తమానము దెలిసి తలుపులు దగ్గఱగా వేసికొని లోపల వడ్డన కారంభించిరి . అపుడు భీమన తన మాహాత్మ్యమును వారాలకు జూప నిశ్చయించి , యప్పాలు కప్పలు కావలె ననియు , నన్నము సున్నము కావలె నని యు బాడం దొడంగెను . ఇట్టి పాటకు ననుగుణంగా లోపల గాప్పలును సున్నమును నగుడు నచ్చో నుండు వారందఱును వెఱీకి దీనికి గారణమే మన నందులో గొందఱు భీమన పాట విని దీనికి భీమనయే కారణము . ఆయన మహానుభావుడు . అట్టి వానిం దోడి తెచ్చి మనము పూజించి తిమేని మీ యాపద మాను నని నిశ్చయించి యజమానునిం దోడ్కొని వచ్చి యామహామహుం బ్రార్ధించి లోనికిం దెచ్చిరి . అపు డాతడు తిరుగా గప్ప లప్పములు గావలె ననియు , సున్నా మన్నము గావలె ననియు బాడినతోడనే యవి యన్నియు నట్లే యయినవి . అపుడు భీమకవి మహాత్త్వము సర్వ జనులకును గోచరమయినది . నాడు మొద లీత డెపుడును నగౌరవం బండదయ్యెను.
ఇతడు చళుక్యవంశపు రాజగు చొక్కా నృపాలు సభ నున్నట్లు కొన్ని కొన్ని పద్యంబులచే గాన్పించుచున్నది . ఆచొక్క నృపాలుడు రాజ రాజనరేంద్రుని వంశజుడు . అతనికిని రాజ నరేంద్రునకును గలుగు సంబంధము రాజ నరేంద్ర చరితంబున జెప్ప బడును .
గురజాడ శ్రీరామ్మూర్తి, “కవి జీవితములు “ నుండి-
———–