నండూరి పార్థసారథి (Naduri Parthasarathi)

Share
పేరు (ఆంగ్లం)Nanduri Parthasarathi
పేరు (తెలుగు)నండూరి పార్థసారథి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ07/31/1939
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురాంబాబు డైరీ (మూడు భాగాలు), శిఖరాలు – సరిహద్దులు, సాహిత్య హింసావలోకనం, పిబరే హ్యుమరసం, స్వరార్ణవం, కార్ఖానాఖ్యానము, అయోమయరాజ్యం,శ్రీకృష్ణకథామృతం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనండూరి పార్థసారథి
సంగ్రహ నమూనా రచన

నండూరి పార్థసారథి

ఇతడు 1939, జూలై 31న కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, ఆరుగొలను గ్రామంలో జన్మించాడు. “నరావతారం”, “విశ్వరూపం” మొదలైన రచనల ద్వారా ప్రసిద్ధుడైన నండూరి రామమోహనరావు ఇతనికి అన్న. విజయవాడలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ లో బి.ఎ., తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. చదివాడు. 1959లో ఆంధ్రప్రభ దినపత్రికలో పాత్రికేయుడిగా ఉద్యోగంలో చేరాడు. 1996వరకు ఆంధ్రప్రభ దినపత్రిక, ఆంధ్రప్రభ వారపత్రికలలో పనిచేశాడు. నీలంరాజు వేంకటశేషయ్య, శార్వరి, గొల్లపూడి మారుతీరావు, విద్వాన్ విశ్వం మొదలైన వారితో కలిసి పనిచేశాడు. గుంటూరు శేషేంద్రశర్మ ఇతని మిత్రుడు. ఇతని మొదటి కథ 1957లో ప్రచురితమైంది. అప్పటి నుండి వివిధ పత్రికలలో అనేక కథలు, గల్పికలు, ధారవాహిక నవలలు, సంగీత, నాటక, సాహిత్య రంగాలపై వందల కొద్దీ వ్యాసాలు, సమీక్షలు ప్రకటించాడు. 2000 నుండి 2009 వరకు రసమయి అనే సాంస్కృతిక మాసపత్రికను స్వీయ సంపాదకత్వంలో ప్రచురించాడు. 1992లో హాస్యరచనకు గాను, 2002లో పత్రికారంగంలో చేసిన కృషికిగాను తెలుగు విశ్వవిద్యాలయం ఇతడికి పురస్కారాలను అందజేసింది.

———–

You may also like...