పేరు (ఆంగ్లం) | Kurella Vittalacharya |
పేరు (తెలుగు) | కూరెళ్ళ విఠలాచార్య |
కలం పేరు | – |
తల్లిపేరు | కూరెళ్ళ లక్ష్మమ్మ |
తండ్రి పేరు | వేంకటరాజయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 07/09/1938 |
మరణం | – |
పుట్టిన ఊరు | నీర్నేముల |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం.(పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం), తెలుగులో గొలుసుకట్టు నవలలు (ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథం), స్వాతంత్ర్యోద్యమం ఆంధ్రప్రదేశ్‌లో దాని స్వరూపం, విఠలేశ్వర శతకము (సామాజిక స్పృహ నిండిన సచిత్ర పద్యకృతి), మధురకవి కూరెళ్ళ పీఠికలు (సేకరణ: దాసోజు ఙ్ఞానేశ్వర్), స్మృత్యంజలి (పద్య గద్య కవితా సంకలనం), కవితా చందనం (పద్య కవితా సంకలనం) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | అభినవ పోతన, మధురకవి, తేజ ఆర్ట్ క్రియేషన్స్ ఆలేరు వారి జీవిత సాఫల్య పురస్కారం. వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి పురస్కారం. ప్రజాకవి సుద్దాల హనుమంతు పురస్కారం. 1979 నల్లగొండ జిల్లా ఉత్తమ ప్రధానాచార్య పురస్కారం రాష్ట్రోపాధ్యాయసంఘం స్వర్ణోత్సవ పురస్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కూరెళ్ళ విఠలాచార్య |
సంగ్రహ నమూనా రచన | – |
కూరెళ్ళ విఠలాచార్య
పల్లెపట్టుల్లో సాహిత్య పరిమలాలను వెదజల్లుతూ తన ఇంటినే సాహితీకుటీరంగా మలచుకొని సాహిత్యవ్యాప్తి కోసం పరితపిస్తున్న నిత్యకృషీవలుడు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. విద్యాధికులంతా పట్టణాలకు వలస వెళ్తున్న నేటి రోజుల్లో పల్లె ప్రాణంగా, సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు సాగిస్తున్నాడు.
ఆబాల్యకవియైన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య 1938 జూలై 9న యాదాద్రి – భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని అతని మాతామహుల గ్రామమైన నీర్నేములలో కూరెళ్ల వెంకటరాజయ్య – లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆ కాలంలో ఇతని తండ్రి కూరెళ్ల వేంకటరాజయ్య గొప్ప స్వర్ణకారుడని ప్రతీతి. అంతేకాకుండా మంచి చిత్రకారుడు కూడా.అతను చేసిన అపురూపమైన చక్కని చొక్కపు ఆభరణాలు ఊళ్ళో వాళ్ళు విఠలాచార్యులకు చూపించి పొంగి పోతుంటారు. అయితే దురదృష్టవశాత్తూ తండ్రి వెంకటరాజయ్య అనారోగ్యానికి గురైనాడు.వెంకటరాజయ్య అన్నదమ్ములు అతని ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోలేదు. శివుడు మీది భారంతో జైకేసారం అనే ఊరి చివరి శివాలయంలో విడిదికి వెళ్ళాడు. రోగం ముదిరి ఇతని తండ్రి వెంకటరాజయ్య1938లో మరణించారు. అప్పటికీ కష్టజాతకుడైన కవి విఠలాచార్య వయస్సు 5 నెలలు మాత్రమే. బాల్య వివాహాలు జరిగే ఆనాటి సమాజంలో అతని అమ్మ లక్ష్మమ్మ వయస్సు ఆనాటికీ 15 సంవత్సరాలు మాత్రమే. జీవిత సుఖాలు త్యాగం చేసి అష్టకష్టాలుపడి తల్లి లక్ష్మమ్మ విఠలాచార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచింది. చిన్ననాటి ఆ పరిస్థితులు కవిహృదయంపై చెరగని ముద్రవేశాయి.
ఏను జనించినట్టి తరియెట్టిదొ? నేనిల నేలపైన కా
లూనగ లేనె లేదు జనకుండు గతించెను, నాదు తల్లి నా
నాన కొరంతనేమియు కనంబడ నీయక లెస్సపెంచె, కా
నీ నను బాధపెట్టెగ అనిష్టము లెన్నియొ విఠ్ఠలేష్వరా!
విఠలాచార్య నాన్నగారు వెంకటరాజయ్య చనిపోయిన తర్వాత వీరిని పెంచటానికి ఎవరూ లేరని గ్రహించి వీరి మాతామహులైన బేతోజు లక్ష్మీనారాయణ గారు కవి గారి పితామహుల గ్రామమైన ఎల్లంకి నుండి నీరునెములకు తీసుకెళ్ళారు. విఠలాచార్యుల వారి విద్యాభ్యాసం అక్కడే ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలలు అంతగా లేని ఆ కాలంలో మహాసూల్‌దార్ అనే ప్రైవేట్ టీచరు వద్ద వీరికి అక్షరాభ్యాసం జరిగింది. అప్పుడు తెలంగాణా ప్రాంతం నిజాం ఏలుబడిలో ఉండేది. ఉర్దూ మాధ్యమంగా విద్యాభ్యాసం కొనసాగేది. ఆ రోజుల్లో పొడగాటి చెక్క పలకమీద ఇసుక పోసి అక్షరాలు దిద్దించేవాళ్ళు. నీర్నేములలోని వీరి అమ్మమ్మ ఈశ్వరమ్మ గారి ఆప్యాయత ఎంత అపూర్వమైందంటే “ఎప్పుడైన విఠలాచార్య గారు తమ పితామహుల గ్రామమైన ఎల్లంకికి వెళ్ళవలసి వస్తే వీరి రెండు పాదాలను ఆమె జాజులో ముంచి వారి పాదముద్రలను గోడకు కొట్టుకొని తిరిగి ఆచార్యులవారు వచ్చే వరకు వాటిని చూసుకుంటూ మురిసేది” ఆ యమ్మ చూపిన అనన్య ప్రేమను ఆచార్యులవారు ఈ నాటికీ మరచిపోకుండా నీరునెముల గ్రామములోని ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రతి సంవత్సరము 7వ తరగతిలో తెలుగు సబ్జెక్టులో ఉత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థికి బేతోజు లక్షీనారాయణ ఈశ్వరమ్మల పేరిట స్మారక పురస్కారాలు అందిస్తుంటారు.
నీరునెములలో పెరుగుతున్న విఠలాచార్యులవారు క్రమంగా తమ ఉనికిని స్థిరపరచుకోవడానికి తమ పితామహుల గ్రామమైన ఎల్లంకికి వచ్చి వెళ్ళేవారు. ఎల్లంకిలో వీరికి 3 ఎకరాల భూమి ఉండేది. అయితే వీరి పెదనాన్న గారైన కనకయ్య గారు ఆచార్యుల వారిని మరియు వారి మాతృమూర్తిని అనేక బాధలకు గురిచేశారు. ఆ బాధలను తల్లి గుండెలో దాచుకొని కొడుకును ఒడిలో కాపాడుకుంటూ ఆచార్యులవారిని పెంచింది. వీరి తల్లి పడ్డ బాధాతప్తాదృశ్యాలు కవి హృదయంపై చెరగని ముద్రను వేశాయి. అందుకే ప్రతి పుస్తకంలో ఆచార్యులవారు మరచిపోకుండా మాతృవందనం చేస్తూవుంటారు.
పుట్టుకలోనే తండ్రి చనిపోయెను, తల్లియె నన్ను పెంచె, ఇ
క్కట్టులనెన్నొ పొందెను, సుఖంబననేమొ ఎరుంగదాయె, న
న్నెట్టులో వీధి బళ్ళొ చదివించెను, మేధకు వన్నెపెట్టె, నే
నట్టి దయార్థ్ర మాతృ చరణాలకు మ్రొక్కెద విఠ్ఠలేశ్వరా!
విఠలాచార్యుల ఎల్లంకి వచ్చిన తర్వాత షేక్ అహ్మద్ అనే ప్రైవేట్ ముస్లీం టీచర్ వద్ద చదువు ప్రారంభించాృు. ఆ రోజుల్లో ఈ గురువుకు అతని దగ్గర చదువుకునే పిల్లవాళ్ళు ప్రతిఫలంగా ఒకటో, రెండో రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే విఠలాచార్య ఆ ఒక్క రూపాయి కూడా చేల్లించలేని ఆర్థిక పరిస్థితి. రూపాయి చెల్లింపు బదులుగా రోజూ బడిని ఊడ్చి శుభ్రం చేసేవాడు. స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో ఎల్లంకి గ్రామానికి ఆ ఊరి దేశ్‌ముఖ్ అనుముల లక్ష్మీనరసింహరావు కృషివల్ల ఒక ప్రభుత్వ పాఠశాల మంజూరైంది. అప్పట్లో దానిని ధర్మబడి అనేవారు. ఆ బడికి తుల్జారాంసింగ్ అనే ఉపాధ్యాయుడు వచ్చాడు. అతడే ఆ పాఠశాల మొట్టమొదటి ఫౌండర్ హెడ్మాస్టరు. అప్పట్లో బల్తాఖైదా (శిశు తరగతి), అవ్వల్ (మొదటి తరగతి), ధువ్వం (రెండవ తరగతి), సువ్వం (మూడవ తరగతి) అని తరగతి శ్రేణులు పిలిచేవారు. ఆనాటి పాఠ్యపుస్తకాల అట్టల మీద, మొదటి పేజీల మీద నిజాం రాజు ఫొటో ఉండేది. ప్రతి రోజు ఉదయం పిల్లల చేత పాఠశాలలో నిజాం రాజు చల్లగా ఉండాలని ప్రార్థన చేయించేవాళ్ళు. క్రమంగా ఆనాటి ప్రైవేట్ ఉపాధ్యాయుడైన షేక్ అహ్మద్కు కూడా ఈ బడిలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఆ ధర్మబడికి ఫౌండర్ స్టూడెంట్ అయిన ఆచార్యుల అదే స్కూల్‌కు తర్వాతి కాలంలో హెడ్మాస్టర్‌గా వచ్చాడు.
గౌ.శ్రీ దానం నాగేందర్ గారిచే ఉత్తమ సీనియర్ సిటిజన్ రాష్ట్ర పురస్కారం ప్రదానం
ఎల్లంకిలో సువ్వం చదివిన తరువాత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ నీర్నేములకు వెళ్ళిపోయాడు. అప్పుడే విఠలాచార్యుల జీవితం ఒక మలుపు తిరిగింది. ఆ ఊరి కరణం బసవరాజు లక్ష్మణారావు రెండవ కుమారుడైన శ్రీహరి రావు అప్పట్లో భువనగిరిలో చదువుకుంటుండేవాడు. ఆయన ఎండాకాలం సెలవుల్లో నీర్నేములకు వచ్చి ఉచితంగా “బేసిక్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్” చెప్పేవారు. ఆచార్యుల అత్యంత ఆసక్తితో ఆంగ్ల భాష నేర్చుకున్నాడు. చదువు పట్ల విఠలాచార్యులుకు ఉన్న ఆసక్తిని గమనించి శ్రీహరిరావు, ఇతనిని భువనగిరి ‘ఫోఖానియా’లో (ఉన్నత పాఠశాల) చేర్పించడానికి తీసుకెళ్ళాడు. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వీరికి సీటు దొరకలేదు. ఇక విధిలేక రామన్నపేటలోని కోటిచింతల పురుషోత్తం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో 1950-51లో చారుం (4వ తరగతి)లో చేరాడు. అక్కడే పంజుం (5వ తరగతి), చెస్సుం (6వ తరగతి), అఫ్‌తుం (7వ తరగతి) చదివాడు.
స్వాతంత్ర్యానంతరం తెలుగు వారి వికాసం ప్రారంభమైంది. 1954-55 ప్రాంతంలో విశ్వకర్మలంత కలసి భువనగిరిలోని ఒక కిరాయి యింట్లో విశ్వకర్మ హాస్టల్ ప్రారంభించారు. ఆచార్యులు రామన్నపేటలో 7వ తరగతి పూర్తి చేసుకొని 8వ తరగతి నుండి “ఫోఖానియా” (ఉన్నత పాఠశాల)లో చేరటానికి భువనగిరికి వచ్చి విశ్వకర్మ హాస్టల్‌లో ప్రవేశాన్ని పొందాడు. అప్పట్లో ఆ హాస్ట్లలు నెల ఫీజు 6 రూపాయలు. ఆ మాత్రపు ఆర్థిక పరిస్థితి కూడా ఆచార్యులుకు లేదు. చిట్టోజు రామయ్య. చొల్లేటి వీరాచారి, మల్లాచారి, వలబోజు రంగయ్య, భోగోజు కృష్ణమాచారి మొదలైన బంధువులు తలా కొంత మెత్తం ఆర్థిక రూపంలో ఇచ్చి ఇతని హాస్టల్ ఫీజు చెల్లించారు.తెలుగురాని ముస్లీం వకీళ్ళకు తెలుగు చెప్పడం వల్ల వాళ్ళు కూడా కొంత సహకరించేవారు. ప్రధానంగా బేతోజు బ్రహ్మయ్యనే అన్ని చూచేవాడు. హాస్టల్ కూడా సరిపోని ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కష్టంగానే నడిచేది. హాస్టల్ యాజమాన్యం వారు హాస్టల్‌లో చదువుకునే పిల్లలకు కమ్మరి, వడ్ల, స్వర్ణకారుల ఇండ్లు చూపేవారు. హాస్టల్ పిల్లలు వారికి కేటాయించిన ఇండ్లలోకి వెళ్ళి వారు పెట్టిన భిక్ష తెచ్చుకొని హాస్టల్‌లో తిని కాలం గడిపేవారు. ఈ హాస్టల్‌కు కొల్లోజు వెంకటాచారి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగాఉండేవాడు.అతనిని ఆచార్యుల తన శిల్పాచార్యుల గ్రంథంలో ఇలా స్మరించుకున్నాడు.
పల్లె పల్లెల నుంచి పంచబ్రహ్మల కూర్చి
మంచిదౌ సంస్థ స్థాపించినావు
బడి చదువులకయి బాధపడెడి పేద
పిల్లలకు భృతి కల్పించినావు
రంగులు మార్చు ఈ రాజకీయాలలో
పిత గాంధిజీనే జపించినావు
విఙ్ఞులు ప్రాఙ్ఞులు విశ్వఙ్ఞులందరూ
ప్రియముగా నుండ తపించినావు
లోకమున మీరు మీదు కొల్లోజు వంశ
ఘనత విశ్వకర్మలకు ప్రఖ్యాతమయ్యె
ఆర్య ధన్యులు వేంకటాచార్య మీకు
నర్పణము సేతు నాదు శ్రద్ధాంజలిదిగొ!
విద్యార్థి దశలోనే తన రచనావ్యాసాంగానికి శ్రీకారం చుట్టారు. తెలుగులో గొలుసుకట్టు నవలలు, స్వాతంత్య్రోద్యమం-ఆంధ్రప్రదేశ్‌లో దానిస్వరూపం, విఠలేశ్వరశతకం, శిల్పాచార్యులు (పద్యకవితాసంకలం), స్మృత్యంజలి (పద్యగద్యకవితాసంపుటి), వెల్లంకి వెలుగు (గ్రామచరిత్ర), సహస్రసత్యాలు, కూరెళ్ల పద్యకుసుమాలు వంటి రచనలు బాగా ప్రాచుర్యం పొందాయి. 12 ఏండ్ల ప్రాయంలో ఆచార్యులవారు 7వ తరగతి చదువుచున్నప్పుడు (1953-54) వారి తాతగారు బేతోజు లక్ష్మీనారాయణ గారు మరణించారు. ఆ వయస్సులోనే కవి గారు వారి మీద “స్మృతికావ్యం” రాశారు. ఆ పద్యాలను ఆయన స్నేహితుడైన దొంతరబోయిన, చెలమంద మొదలైనవారికి వినిపించేవారు. ఈ సమయంలోనే నీరునెములలో స్నేహితులతో కలిసి ఒక సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేశారు వివిధ పండుగల సందర్భాలలో ఆయా పండుగలపై పద్యాలు వ్రాసి స్నేహితులకు వినిపించేవారు. ఓ పర్యాయం నీరునెములలోని హనుమదాలయంలో మిత్రులతో కలిసి సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించడం వల్ల ఆ గ్రామంలోని అగ్రవర్ణాల వారి ఆగ్రహానికి గురి అయ్యడు. ఈ దశలోనే ఆచార్యులవారు నీరునెములలో “విద్యాడ్రామా” అనే నాటికను రాయడమేగాక అందులో సుగంధరెడ్డి అనే పాత్రను కూడా ధరించి ప్రదర్శించాడు. అలాగే “గురుదక్షిణ”, “లంకాదహనం”, భక్త కన్నప్ప అనే నాటకాలలో ఏకలవ్య, హనుమంతుడు, కన్నప్ప పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ రకంగా ప్రాథమిక విద్యా స్థాయిలోనే ఆచార్యుల వారి కవితా వ్యాసంగం వెలుగులోకి వచ్చి సమకాలీన లబ్ధి ప్రతీష్ఠ సాహితీపరులను ఆశ్చర్య పరిచింది.
1954లో అధికవృష్టి వల్ల జనగామ దగ్గర రఘునాథపల్లిలో రైలు పడిపోయింది. ఆ సంఘటనకు బాలకవియైన ఆచార్యుల వారి హృదయం స్పందించి “అధికవృష్టి” అనే పేర కవిత ప్రవాహమై సాగింది. అందులో ఒకటి
ఉరుము మెఱుపులు నొకసారి ఉద్భవించె
గాలి, సుడి గాలి మేఘముల్ గప్పుకొనెయె
సరవిధారగ వర్షంబు కురియచుండె
అల్ల తెలగాణ రఘునాథపల్లియందు
———–