పిరాట్ల వెంకటేశ్వర్లు (Piratla Venkateswarlu)

Share
పేరు (ఆంగ్లం)Piratla Venkateswarlu
పేరు (తెలుగు)పిరాట్ల వెంకటేశ్వర్లు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుసూర్యకుమారి
పుట్టినతేదీ07/16/1940
మరణం12/08/2014
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురెడ్‌ టెర్రరిజం ఇన్‌ ఇండియా, వందేమాతరం, అజేయ భారత్‌, మార్క్సిజం – మేధావుల మత్తుమందు,
ముట్నూరి కృష్ణారావు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఇందిరాగాంధీ సద్భావనా అవార్డు
2013లో రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారం
2001లో పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారి తాపీధర్మారావు స్మారక ధర్మనిధి పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపిరాట్ల వెంకటేశ్వర్లు
సంగ్రహ నమూనా రచన

పిరాట్ల వెంకటేశ్వర్లు

1902లో ప్రారంభమైన కృష్ణా పత్రిక తెలుగు పత్రికారంగంలో ఒక విప్లవాత్మక మార్పును తెచ్చింది. అయితే తదనంతర కాలంలో వివిధ సమస్యల కారణంగా మూతబడింది. 1982లో ఈ పత్రికను పిరాట్ల వెంకటేశ్వర్లు పునరుద్ధరించాడు. పత్రికకు సంపాదకుడిగా ఉంటూ పత్రిక పూర్వవైభవానికి తనవంతు కృషి చేశాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసిన వెంకటేశ్వర్లు అనంతరం ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. ఎమర్జెన్సీ కాలంలో ఏబీవీపీ తరఫున పోరాడాడు. ఆనంతరం పత్రికా రంగంలో స్థిరపడ్డాడు. తన జీవితకాలంలో వివిధ సమస్యలపై ఎన్నో పుస్తకాలు రచించాడు. నక్సలైట్లతో చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలో తీసుకురావాలన్న తపనతో అటు ప్రభుత్వానికి, ఇటు నక్సలైట్లకు మధ్య వారధిగా వ్యవహరించిన వారిలో ఇతడు ముఖ్యుడు.
కృష్ణా పత్రిక ప్రాభవాన్ని మళ్లీ నిలబెట్టేందుకు ఇతడు చేసిన కృషి చెప్పుకో దగింది. చైతన్య వంతమైన సంపాదకీయాలతో ఈ పత్రిక ఇతని ఆధ్వర్యంలో నిర్మొహమాటమైన నిష్పాక్షికమైన పంథాను అవలంబించింది. ఇతని సారథ్యంలో కృష్ణాపత్రిక కార్యాలయం సాహితీవేత్తలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలతో సందడిగా ఉండేది. ఎన్నో చారిత్రక, రాజకీయ, సాహిత్య చర్చలు ఆరోగ్యవంతమైన రీతిలో జరిగేవి. పత్రికా దర్బార్, కాకతీయ విజయం, భువనవిజయం, గోల్కొండ విజయం మొదలైన సాహిత్య రూపకాలు పత్రికా కార్యాలయ ప్రాంగణంలో జరిగేవి. ఓగేటి అచ్యుతరామశాస్త్రి, రాళ్ళబండి కవితాప్రసాద్, జి.ఎం.రామశర్మ, కసిరెడ్డి వెంకటరెడ్డి, అనంతలక్ష్మి వంటి సాహిత్యవేత్తలతో ఇతని ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్యకార్యక్రమాలు జరిగేవి

———–

You may also like...