పాలెపు బుచ్చిరాజు (Palepu Buchiraju)

Share
పేరు (ఆంగ్లం)Palepu Buchiraju
పేరు (తెలుగు)పాలెపు బుచ్చిరాజు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1940
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుప్రాచీన వచనములు, వ్యాసం, శతకం అనే ప్రక్రియలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపాలెపు బుచ్చిరాజు
సంగ్రహ నమూనా రచన

పాలెపు బుచ్చిరాజు

బుచ్చిరాజుగారు విశాఖపట్నం జిల్లాలో గునుపూడి గ్రామంలో 1940-41 సం.లో జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎం.ఎస్.సి చేసి, ఆయిల్ అండ్ నేచురల్ గేస్ కమిషన్లో చేరి’ చీఫ్’ వరకూ ఎదిగి1955 లోపదవీ విరమణ చేశారు. దివింది సైన్సు అయినా తెలుగు సాహిత్యం మీద అభిమానంతో, రచనలు చేసి కవిగా ఎదిగారు. ఈయన గేయాలు రాసిన తెలుగు కథ అంటే ప్రత్యేక అభిమానం. ఇంతవరకూ ౩౦ కి పైగా కథలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. 2001 లో ‘గునుపూడి కథలు’సంకలనం వెలువడింది.2003లో ‘ప్రాచీన వచనములు, వ్యాసం, శతకం అనే ప్రక్రియలు’ఉన్న పుస్తకాన్ని రచించారు
పాలెపు బుచ్చిరాజుగారు మూడు అంశాలతో కూడిన ఒక పుస్తకం రచించారు.ఇది నవీన వచన రచనా విధానంలో వ్రాయబడింది.
మొదటి భాగంలో శ్రీ తిరుపతి వేంకటేశ్వర వచనములు, రెండవ భాగంలో శ్రీకృష్ణ హేల, మూడవ భాగంలో బుధవిధేయ శతకం రచించారు. మొదటి భాగం :*తెలుగు భాష జన్మించి వెయ్యేళ్ళకు పైగా అయింది.ఎందరో సరస్వతీ పుత్రులు సరికొత్త ప్రయోగాలను చేపట్టి తెలుగును జీవభాషగా తీర్చిదిద్దారు.
శ్రీ తిరుపతివేంకటేశ్వర వచనములు అనే అంశంలో ధర్మానికి గ్లాని జరిగి, ధర్మవిధ్వంసం అవుతుందో అప్పుడు భగవంతుడు ధర్మరక్షణకి పుట్టి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చెప్పారు.
కలడు కలండనెడు వాడు కలడోలేదో? ‘అని తనఫై నమ్మకాన్ని తానే కోల్పోతున్న ఒక భక్తుడి ఆవేదన ఇది.
రెండవ భాగం :*వేదకాలం నుంచి అపారమైన సంస్కృతి, సంప్రదాయం భారతదేశానికి తరగని సంపద.
వాటిలో రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు ముఖ్యమైనవి.
ఒక మంచిమనిషి ఏవిధంగా, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాడో చెప్పేది శ్రీకృష్ణుని పాత్ర.
అటువంటి శ్రీకృష్ణుని జీవితాన్ని గూర్చి చెప్పిన పుస్తకం ఇది.
ఇందు చెప్పబడ్డ విషయాలు :
బాలకృష్ణ
క్రీడాకృష్ణ
విద్యాకృష్ణ
రాధికాకృష్ణ
రుక్మిణికృష్ణ
బంధుకృష్ణ.
గీతాకృష్ణ
నిర్యాణకృష్ణ
మూడవ భాగం:*శతక ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ఒక విశిస్ట ప్రక్రియ.
‘బుధ విధేయ శతకం’లో సమకాలీన సమస్యలు, రాజకీయాలు, మనవ నైజం, ఇందులో ఇతివృత్తాలు.
పద్యం ద్వారా ఆ విషయాలను తెలియజేశారు కవి పాలెపు బుచ్చిరాజు.
ఆధారిత గ్రంథాలు-కవి :
మహాభారతం (తిక్కన)
భగవద్గీత (వేద వ్యాసుడు)
హరివంశం (ఎర్రన)
రాధికాసాంత్వనము (ముద్దు పళని) మొదలైనవి.

———–

You may also like...