పేరు (ఆంగ్లం) | Tangirala Pala Gopalakrishna |
పేరు (తెలుగు) | తంగిరాల పాల గోపాల కృష్ణ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా లోని తణుకు తాలూకా ఇరగవరం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తంగిరాల పాల గోపాల కృష్ణ |
సంగ్రహ నమూనా రచన | – |
తంగిరాల పాల గోపాల కృష్ణ
తంగిరాల పాల గోపాల కృష్ణ తెలుగు రచయిత మరియు ఉత్తమ ఉపాధ్యాయుడు. తంగిరాల పాల గోపాల కృష్ణ డిసెంబరు 15 1940 న పశ్చిమ గోదావరి జిల్లా లోని తణుకు తాలూకా ఇరగవరం గ్రామంలో తంగిరాల రామ సోమయాజి, సూరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. గోపాల కృష్ణ ఎం.ఎ భాషా ప్రవీణ చేసి, 1960 జూన్ లో ద్వితీయ శ్రేణి తెలుగు పండితుడుగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. 1998 డిసెంబరులో పదవీ విరమణ చేశాడు.
ఆయన స్వగ్రామమైన ఇరగవరమును గూర్చి సీస పద్యం
పంచపాల క్షేత్ర పాలేశ్వర స్వామి
ఇలవేల్పుగానున్న ఇరగవరము
వేదముల్ శాస్త్రముల్ విహితకర్మలగూడి
చక్కగా నర్తించు స్థావరమ్ము
బ్రాహ్మ్యమ్ము లౌక్యమున్ పటుతరమ్ముగ నొప్పు
సంభావ్యసద్వంశ సంకులమ్ము
స్వాతంత్ర్యసిద్ధికై స్వార్ధమ్ము విడనాడు
త్యాగధనుల గన్న యాగభూమి
వేదపాఠాలు నిత్యమ్ము వెలయునట్టి
శాస్త్రవాదంబు చక్కగా సాగునట్టి
ధర్మమార్గమ్ము నిరతమ్ము తప్పనట్టి
ఇరగవరమిది పండితపురమ్ము!
1995 సంవత్సరములో అవార్డ్ పొందిన తుట్టగుంట సుబ్రహ్మణ్యం, వి.వై.వి, సోమయాజి, ఎం.ఎస్.ఆర్.శాస్త్రి, సుశర్మ లకు ‘నన్నయ భట్టారక పీఠం’సన్మానము చేసినప్పుడు వ్రాసిన పద్యము.
చిరునవ్వు శాంతమ్ము చెలిమి చేయుచు నుండ
మాన్యతనొందిన మాష్టరొకడు
రామకృష్ణుని యొక్క రమ్య సాహితిలోని
కామెడీ కధలెన్ను సోమయాజి
పాలనాపటిమతో పాఠశాలను తీర్చు
సౌమ్యవర్తనుడగు శాస్త్రి యొకడు
కవనంపు పటిమతో కార్యనైపుణి తోడ
సజ్జనాళిని చేర్చు శర్మ యొకడు
వీరినందర నొక్కచో వేదిపైన
చేర్చి చక్కగ సత్కృతి చేయుచున్న
పెద్దవారల సంగతిన్ వృద్ధిపొందు
నన్నపార్యుని పీఠంబు మిన్నగాదె!
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము పొందిన సందర్భముగా నన్నయ భట్టారక పీఠంలో 24-09-1997 సన్మానించినప్పుడు, ఆయన స్పందించి వ్రాసిన పద్యము.
పంచమ వేదమౌ భారతంబును తెల్గు
సేతతో ప్రఖ్యాతి చెందెనెవడు
తెల్గుభాషకు తగు తీరు తెన్నులు కూర్చి
ఆదికవి యనంగ అలరెనెవడు
తణ్కుపట్టణ కీర్తి తరతరాలుగ వెల్గ
జమ్మి నీడను చేసె జన్నమెవడు
విద్వద్వరేణ్యులు వైద్యశిఖామణుల్
నిరతమ్ము స్మరియించు నెవని నిచట
అట్టి శబ్దశాసనుపేర పుట్టినట్టి
సరస సజ్జన సంగతిన్ సాగునట్టి
నన్నపార్యుని పీఠంబు నన్ను నేడు
గౌరవించుట నా పుణ్య సరమగును!
అనేక సందర్భములలో చెప్పిన పద్యములు:
1. గాంధీ జయంతి రోజున : గాంధీని గురించి
2. పాశర్లపూడిలో మొట్టమొదటి బ్లో అవుట్ గురించి.
3. ముక్కామల క్షేత్రవర్ణనము అక్కడ జరిగిన లక్షపత్రి పూజ వర్ణనము,
4. ఇరగవరంలో పాలేశ్వరక్షేత్రమున జరిగెడి లక్ష పత్రిపూజ, ఇరగవరము యొక్క ప్రాశస్త్యము వర్ణించుట,
5. ముక్కామల లక్షపత్రి పూజ సందర్భముగా కడిమిళ్ళ వరప్రసాద్ ను సన్మానించినపుడు,
6. నన్నయ భట్టారక పీఠంలో కోట లక్ష్మీనరసింహం అష్టావధానం చేసినప్పుడు ఆయనను గూర్చి వ్రాసిన పద్యాలు,
7. నన్నయ భట్టారక పీఠంలో భారతం శ్రీమన్నారాయణకు సన్మానము చేసినప్పుడు, వీరి గ్రంథములు ఉత్తమమైనవిగా యెన్నిక చేసి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము సన్మానము చేసినప్పుడు, ఈయన ద్రౌపది గ్రంథావిష్కరణ సందర్భముగా వ్రాసిన పద్యాలు,
8. 01.04.2014 న నన్నయ భట్టారక పీఠంలో గరికిపాటి నరసింహారావు కుసన్మానము చేసినప్పుడు,
9. 22.03.2015 న తణుకు శాసన సభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణకు సన్మానము చేసినప్పుడు
యెన్నో పద్యాలు వ్రాశాడు.
భారత నీతిని ప్రజలకున్ వివరించి
వ్యాసుని హృదయంబు విశదపరచు
భగవంతు లీలల పరమార్ధమును చెప్పి
భక్తి సాగరమున ప్రజల ముంచు
శ్రీ కాళిదాసాది శిష్టకవుల యొక్క
కావ్య కధలు చెప్పు కమ్మగాను
గరికపాటి వినుత కమనీయ వంశాభ్ది
కలువల రాయుడై కళల నీను
ధారణా బ్రహ్మరాక్షస నారసింహ
రావు నిచ్చట నన్నయ ఠావునందు
సత్కరించుట మాకెంతో సంతసమ్ము
అందుకొనుమిదె మా యొక్క వందనమ్ము!!
———–