యద్దనపూడి సులోచనారాణి (Yaddanapudi Sulochanarani)

Share
పేరు (ఆంగ్లం)Yaddanapudi Sulochanarani
పేరు (తెలుగు)యద్దనపూడి సులోచనారాణి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1940
మరణం05/21/2018
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునవలలు : ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిశాపం, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికయద్దనపూడి సులోచనారాణి
సంగ్రహ నమూనా రచన

యద్దనపూడి సులోచనారాణి

యద్దనపూడి సులోచనారాణి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లామొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది.

(ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అమెరికాలో కన్నుమూశారు. ఆమె రచనలు, జీవన యానం గురించి తెలుగు యూనివర్శిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్ మృణాళిని బీబీసీ కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం)
యద్దనపూడి సులోచనారాణి అంటే అందరికీ రెక్కలు చాచుకున్న కార్లు, ఆరడుగుల ‘రాజశేఖర్’ లూ, ముక్కుమీద కోపం ఉన్న ‘రోజా’లు గుర్తుకొస్తారేమో… కానీ నాకు మాత్రం మెత్తని మాట, మందస్మితం, హుందాతనం, నిరాడంబరత్వం మూర్తీభవించిన ఆమె మూర్తిమత్వమే గుర్తుకొస్తుంది.
ఆమె పరిచయం కాకముందు, నా 12 ఏళ్ల వయస్సునుంచీ నన్ను ముంచెత్తినవి కూడా ఆ అద్భుతమైన ప్రేమ కథలే. ఆమె రచనలు వట్టి ప్రేమ కథలు కావు. ఆడపిల్లని కొత్తరకంగా, మనం కూడ అలా ఉండగలిగితే బాగుండు అనే రకంగా చూపించినవి. ఆమె మీద ఆరోపణ కూడ అదే. ఒక్కోసారి అనిపిస్తుంది. ఆమె ఆడపిల్లల్ని, అప్పటి తక్కిన రచయిత్రుల్లా ‘బాధితులు’ గా (విక్టిమ్స్) చూపించివుంటే ఆమెకు విమర్శకుల మన్ననలు కూడ లభించేవేమో? కానీ ఆమె ఏరోజూ ఆడపిల్లల్ని బాధితులుగా చూడలేదు. చూపలేదు.
చీమూ, నెత్తురూ ఉండి, సమస్యలను ఎదురెళ్లి మరీ ఢీకొన్న మొండిఘటాలుగానే చూపించింది. ఒకవేళ తమకు సమస్యలు లేకపోతే కొని తెచ్చుకునే పెంకితనం ఉన్న ఆడపిల్లలు వాళ్లు. ఆమె ఎవరికీ అనుభవంలోకి రాని, రాలేని ‘కలల పురుషుడిని, స్వప్నలోకాన్ని’ చూపించిందన్న ఆరోపణ మహామహుల నుంచి కూడ వస్తూంటుంది. నిజమే.. కానీ ఆడపిల్లలకు కలలు కనే హక్కును కూడ నిరాకరించే సమాజంలో కనీసం కథల్లోనైనా కలలు కనడం ఆనందం కాదూ?
సులోచనారాణి 1964లో సెక్రటరీతో మొదలుపెట్టి డెబ్బైకి పైగా నవలలు రాసారు. కానీ ఎక్కువ పేరు తెచ్చిపెట్టినవి, ఆమె పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి, సీరియల్స్ గా వచ్చినపుడు పాఠకులను మంత్రముగ్ధులను చేసినవి కొన్నే. సెక్రటరీ, జీవనతరంగాలు, మీనా. ఇంకా చెప్పుకోదగ్గవి విజేత, ఆరాధన, కీర్తి కిరీటాలు, ప్రేమలేఖలు, గిరిజాకల్యాణం, పార్థు, ఈ తరం కథ, ఆత్మీయులు, బంగారు కలలు, కథల్లో బహుమతి, ఐలవ్ యూ… ఇంకా ఎన్నో ఆమె అభిమానులు మెచ్చినవి. ఎన్ని సార్లు ప్రచురించినా, అన్ని ప్రతులూ అతి వేగంగా అమ్ముడుపోయే ఏకైక రచయిత్రి ఆమె (రచయితలు కొందరున్నారు).

———–

You may also like...