పేరు (ఆంగ్లం) | Indarapu Kishanrao |
పేరు (తెలుగు) | ఇందారపు కిషన్ రావు |
కలం పేరు | – |
తల్లిపేరు | కమల |
తండ్రి పేరు | కేశవరావు |
జీవిత భాగస్వామి పేరు | విమలాబాయి |
పుట్టినతేదీ | 07/04/1941 |
మరణం | 06/08/2017 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీనివాస శతకం, ఋతు సంహారం, వసంత సుమనస్సులు, కవితా వసంతం, సరస్వతీ వైభవం, వాణీ విలాసము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఇందారపు కిషన్ రావు |
సంగ్రహ నమూనా రచన | – |
ఇందారపు కిషన్ రావు
ఇందారపు కిషన్ రావు ప్రముఖ అవధాని, కవి మరియు బహుభాషా కోవిదుడు. ఇతడు 80కి పైగా అష్టావధానాలు చేశాడు.
కిషన్‌రావు 1941 జూలై 4వ తేదీన కమల, కేశవరావు దంపతులకు రెండో సంతానంగా ఆదిలాబాద్ జిల్లా తాండూరులో జన్మించాడు. ఇతనికి తెలుగుతోపాటు మరాఠీ, సంస్కృతం, ఉర్దూ భాషల్లో మంచి పాండిత్యం ఉంది. ఇతడు తాండూరులో ప్రాథమిక విద్య, చెన్నూరులో పదో తరగతి వరకు, వరంగల్‌లో పీయూసీ చదివాడు.1966లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ., 1969లో ఎం.ఎ. డిగ్రీలు పొందాడు. ఆ తర్వాత “శేషాద్రి రమణ కవులు – జీవితం – సాహిత్యం” అనే అంశంపై కేతవరపు రామకోటిశాస్త్రి నిర్దేశకత్వంలో పరిశోధన చేసి 1987లో డాక్టరేట్ పట్టాను పొందాడు. కాశీ కృష్ణాచార్యులు, వానమామలై వరదాచార్యులు, దివాకర్ల వెంకటావధాని, సి.నారాయణరెడ్డిలకు ఇతడు ప్రియశిష్యుడు. ఇతడు ఉపాధ్యాయుడిగా తాండూరు, సిర్పూర్, నిర్మల్ లలో పనిచేసి తరువాత 1970లో ఉద్యోగరీత్యా వరంగల్లు జిల్లా, హనుమకొండలో స్థిరపడ్డాడు. ఇతడు 1970 నుంచి 1987 వరకు వరంగల్‌లోని ఎల్‌బీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకునిగా, ఆ తర్వాత పదోన్నతిపై రీడర్‌గా పని చేసి 1999లో ఉద్యోగ విరమణ చేశాడు. ఇతని భార్య విమలాబాయి. వీరికి ఇద్దరు కుమారులు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ముగ్గురు కుమార్తెలు కరుణశ్రీ, పద్మశ్రీ, గీతాంజలి ఉన్నారు. ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ 2017, జూన్ 8వ తేదీన హైదరాబాదులో తన పెద్ద కుమారుడు శ్రీనివాసరావు ఇంటిలో మరణించాడు
———–