మొవ్వ వృషాధిపతి (Movva Vrushadhipati)

Share
పేరు (ఆంగ్లం)Movva Vrushadhipati
పేరు (తెలుగు)మొవ్వ వృషాధిపతి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1940
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఉపనిషద్వాణి (7 భాగాలు), శ్రీ పద్మావతీ శ్రీనివాసీయం,
హరిహరాత్మక విజయం, తపస్సిద్ధి, సోమనాద్రి, భారతజ్యోతి, విశ్వగాయత్రి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువడ్డే శ్యామసుందర్ – సుజాత పురస్కారం
కవితా పురస్కారం (గుంటూరు)
కవిసింహ పోకూరి కాశీపతి సెంటినరీ పురస్కారం (మాచర్ల)
నన్నయ భట్టారక పురస్కారం (తణుకు)
భూతపురి సుబ్రహ్మణ్యశర్మ స్మారక పురస్కారం (కడప) మొదలైన పురస్కారాలను పొందారు.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమొవ్వ వృషాధిపతి
సంగ్రహ నమూనా రచన

మొవ్వ వృషాధిపతి

మొవ్వ వృషాధిపతి సుప్రసిద్ధ సాహితీ కారుడు మరియు నాటక రంగ ప్రముఖులు.
వీరు గుంటూరు జిల్లా నగరం మండలంలోని పూడివాడ గ్రామంలో శ్రీనివాస పెరుమాళ్ళు. బాలమాంబ దంపతులకు, 1941లో జన్మించారు. వీరు తాత నుండి సంగీతజ్ఞానం, తండ్రి నుండి సాహిత్యజ్ఞానం అందిపుచ్చుకున్నారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి ఎం.ఎ. (తెలుగు) పట్టాపుచ్చుకున్నారు. వీరు డిగ్రీ కళాశాల ఉపన్యాసకులుగా తమ ఉద్యోగ జీవితాన్ని 1964లో ప్రారంభించి, తెలుగు శాఖ అధ్యక్షులుగా, ప్రిన్సిపాల్‌గా పదోన్నతులు పొంది 1997లో పదవీ విరమణ చేశారు. వీరిని గురించి సాహితీ ప్రపంచంలో తెలియనివారు అరుదు. పండిత కుటుంబం నుండి వచ్చిన ఆయన అధ్యాపక వృత్తితోపాటు, ఆధ్యాత్మిక. సాహిత్య, నాటక, వ్యాఖ్యాన రంగాలలో రాణించి తనదైన ముద్ర వేసినారు. గంభీరమైన గాత్రంతో ఆయన దేశ, విదేశాలలో పలుప్రదర్శనలిచ్చారు. ఆలిండియా రేడియో, దూరదర్శన్, టీవీలు, తి.తి.దేవస్థానం కార్యక్రమాలలో విరివిగా పాల్గొని, వందలాది ప్రదర్శనలతో వీక్షకులు, శ్రోతలను ఆకట్టుకున్నారు. బర్మింగ్ హాం (లండన్), అమెరికా తానా సభలలో ఆయన ప్రసంగాలు ప్రశంసల జల్లులు కురిపించినవి.

———–

You may also like...