పేరు (ఆంగ్లం) | Devulapalli Subbaraya Sastry |
పేరు (తెలుగు) | దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకమాంబ |
తండ్రి పేరు | వేంకటకృష్ణశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1853 |
మరణం | 1/1/1909 |
పుట్టిన ఊరు | వీరి స్వగ్రామము కూచిమంచి తిమ్మకవి గ్రామమైన చంద్రమపాలెము. |
విద్యార్హతలు | దేవులపల్లి సోదరకవులకు ప్రపితామహుడు దేవులపల్లి సీతారామశాస్త్రి అక్షరాభ్యాసం చేశాడు. ఈ సోదరులు సీతారామశాస్త్రి వద్ద కాళిదాసత్రయము, తండ్రివద్ద కావ్యద్వయము, నైషదము, కొన్ని చంపువులు, అలంకారశాస్త్రము, సిద్ధాంతకౌముది, తర్కప్రకరణాలు, నాటకములు, కొంత జ్యోతిషశాస్త్రము నేర్చుకున్నారు. అమరము ఈ సోదరులకు కంఠస్థము అయ్యింది. కూచిమంచి వేంకటరాయకవి వీరికి ఆంధ్ర లక్షణశాస్త్రాలను ఉపదేశించాడు. |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సంస్కృత రచనలు: శ్రీరామ పంచాశత్తు,శ్రీమద్రావువంశముక్తావళి తెలుగు రచనలు: మహేంద్రవిజయము (ప్రబంధము), రామరాయవిలాసము (ప్రబంధము), మల్హణస్తవము ( సంస్కృతమునుండి అనువాదము), శ్రీ కుమార శతకము (సంస్కృతము నుండి అనువాదము), మందేశ్వర శతకము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | శ్రీ రంజిల్లనొనర్చు గావుత శిలా జీవ ప్రదానప్రధా ధౌరం ధర్యము గాంచి దారుశకల ద్వంద్వంబునుం బాదుకా కారం బూని భజింప భూ భరణభాగ్య స్ఫూర్తి గల్పించు సీ తారామం ఘ్రియుగంబుమాకు ససుఖోదారాయురైశ్వర్యముల్ . 1 చ . వసుధ జనించి యాజనక వంశము నయ్యినవంశ మింపు సొం పెసగ సమున్న తత్వము వహింపగ మించిన సీత శీత దృ క్ప్రసరణము ల్సుధారసపరంపరలై యల రారు గాత నే డసదృశదోహదస్ఫురణ నస్మదభీష్టలతాఫలాప్తికి . |
దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (నమూనా రచన )
శ్రీరస్తు.
శుభమస్తు.
అవిఘ్నమస్తు .
శ్రీగణాధిపతయేనమః.
శ్రీ సరస్వతీ దేవ్యై నమః.
శ్రీ హయ గ్రీవాయ నమోనమః.
శ్రీ మహేంద్ర విజయము
ఇష్ట దేవతాస్తుతి
***
శ్రీ రంజిల్లనొనర్చు గావుత శిలా జీవ ప్రదానప్రధా
ధౌరం ధర్యము గాంచి దారుశకల ద్వంద్వంబునుం బాదుకా
కారం బూని భజింప భూ భరణభాగ్య స్ఫూర్తి గల్పించు సీ
తారామం ఘ్రియుగంబుమాకు ససుఖోదారాయురైశ్వర్యముల్ . 1
చ . వసుధ జనించి యాజనక వంశము నయ్యినవంశ మింపు సొం
పెసగ సమున్న తత్వము వహింపగ మించిన సీత శీత దృ
క్ప్రసరణము ల్సుధారసపరంపరలై యల రారు గాత నే
డసదృశదోహదస్ఫురణ నస్మదభీష్టలతాఫలాప్తికి . 2
శా . శ్రీనర్దిల్లగ జేయు గావుత జటా శ్రేణీమిథోబంధరే
ఖావిశ్లేష మొనర్ప స్వర్ణది తరంగ వ్యాజ హస్తంబుచే
ఠీవిం జొన్పిదంతకంకతముమాడ్కి న్మౌళి లేజల్వడా
ల్పూవుం దాల్చిన శంకరుం డెపుడు సమ్మోదం బెదం గ్రమ్మగన్. 3
ఉ . స్నానజలంబు ధౌతవసనం బను లేపన మోగిరంబు దా
నే నెఱీ గూర్చి నాధు నెనయించునొ పెండిలి కూతురంచు సం
వ్యాసము బూని యవ్వరుని యవ్వ నటంచు నటించు భ్రుంగి చం
దానకు నెచ్చెలుల్ నగిన నవ్వెడు శాంకరి మమ్ము బ్రోవుతన్ . 4
చ . అనుపమ మైన యాత్మ చతురానన రూడికి దోడు సత్యన
ర్తనము మెఱుoగువెట్ట విబుధప్రకరంబుల కెల్ల బెద్దయై
మనుమని నన్గళా కలన మానితు జేసిన సద్ద యార్ద్రహృ
ద్వనరుహుడౌ మహా మహు బితామహుని న్నుతియింతు నెంతయున్ 5
శా . శ్రీపూర్ణాకృతి ముక్తి సౌధచతురంఘ్రి స్ఫాటిక స్థంభశో
భా పీఠీకృత శాతమన్యవశిలా భాస్వత్ఖురోద్య ద్రజ
శ్శ్రీ పేర్మిం బురుషార్ధ పాళి నిడ నా శ్రీ ధేనువాగీశ్వరీ
రూపం బూని తనర్చు వాణి సమకూర్చు న్మాకు వాగున్నతుల్ . 6
సి . కలుము లీ నోపడే కమాలాప్త ప్తసుత రాజ్య
సంఘటనోపాయ చతుర మంత్రి
యిష్టార్ధము లోసంగడే జానకీ రాఘ
వాన్యోన్యకుశల వార్తై కదూత
చిరతరాయు ర్వృద్ధి జేయు జాలండె ల
క్ష్మణజీనదాభిషగ్వరుండు
కళల నీ నేరడే ఘనమౌని సంపూర్ణ
రామసభైక పౌరాణికుండు
తే .గీ . పాననాకృతి శైవాంశ భవుడు శ్రీహ
రిస్వగూపుడు భావివిరించనుండు
నిరవధిక కీర్తియగు నాంజనేయమూర్తి
తత్ప్రసేవనములు జగత్పావనములు .
సి .ప్రవితత ప్రత్యూహ పవమానగిళన దు
ర్వారతుం డాజగరంబు వాడు
బహుళాంతరాయ పర్వత విని ర్భేదన
ఫ్రౌడైకదంత వజ్రంబు వాడు
పటు విఘ్నగణ తుష వ్రజసముద్ధూరనన
ద్రాఘిష్ఠకర్ణ శూర్పములవాడు
ఘనతరాతంకపంకక్షాళనపటిష్ఠ
కటతల దానోదాకంబువాడు
తే .గీ . భూరి పుష్కర పూత్కార వారికల్పి
తాసమయవర్ష సిక్త రౌష్యద్ర్యుపత్య
కాత టో త్ఖా త కేలి సం ప్రీతి వాడు
సిద్ధిగణనాధు దిష్టాప్తిజేయు గాత . 8
మ . కవనా ఖ్యే క్షువణంబు నాటి జగతిం గాండోన్నతిం బెంచి ప
ర్వవితానస్థితి సంఘటించి రససంపన్మాధురీ సాధురీ
తివి శేషంబు రసజ్ఞ జాలమునకుం దెలల్లంబుగా గూర్చి
రవముం జెందిన భక్తి దలతుం బ్రాచేతస వ్యాసులన్
కం . నన్నయభరిత మనోజ్ఞక
నన్నయ భావ్యోక్తిగా నొనర్చును గృపచే
నన్నయభయ ధృతిమతితో
నన్నయ భట్టాదికవిజనంబు నుతింతున్. 10
మ . తమ కావ్యాదుల సత్కవుల్ “గుకవినిందం జేసి” యం చొక్కా భా
గము గల్పించి రకారణంబు యది నిష్కారుణ్యమాత్సర్యభా
వమో కా కాఘను లుండకున్న నల దేవానాంప్రియ శ్రేణి కె
ట్లమరుం గీర్తివిశే పూర్తి యిల గావ్యాసార పూరోత్థమై . 11
కం . అని యిష్టదేవతావం
దన ముఖకావ్యముఖ లక్షణంబుల నెల్లం
బొనరించి యెద్దియే నొక
వనమాలి క్షేత్ర మహిమ వర్ణించుటకై . 12
కం . ఊహల కనుగతిగా గౌ
తూహల మెద మెదల భక్తిదోహలహితసం
దోహలలితానుమతి ను
త్సాహల సచ్చక్తి పూర్ణతా హాలాహలికన్. 13
కం . ఏనానిం గృతిపతిగా
భావింతునొ యెట్టి దివ్యభవ్య క్షేత్ర
శ్రీవర్ణ్యమొ యని యోజన
కావించుచునుండి యే నొకానొక రజనిన్ 14
సి . శ్రీజానకీ దేవి చెలగు వామాంక భా
గముతో నిరాభారిగముల తోడ
నాంజనేయాంజలిన్య స్తమౌ శప్తమౌ
పదముతో నదిక సమ్మదముతోడ
వెనుక సౌమిత్రి వట్టినయట్టిహురుమంజి
గొడుగుతో నపరంజిమడుగుతోడ
భరతశత్రుఘ్నులునురటులూనినపార్శ్వ
యుగముతో జిఱునవ్వు మొగముతోడ
తే .గీ . గరములు మొగుడ్చునృపులతో గవులతోడ
బ్రేమరసపూర్తి బట్టాభిరామమూర్తి
పుష్పకాంతరవర్తియై పూర్వపుణ్య
కలన నా మ్రోల నిలచినట్టుల దలంచి . 15
రచన : దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి
———–