పేరు (ఆంగ్లం) | Sharoff Tulasi Ramachari |
పేరు (తెలుగు) | షరాఫ్ తులసీ రామాచారి |
కలం పేరు | తులసీరాం |
తల్లిపేరు | షరాబు సుబ్బమ్మ |
తండ్రి పేరు | షరాబు పుల్లయ్య ఆచారి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 04/24/1941 |
మరణం | – |
పుట్టిన ఊరు | కర్నూలు జిల్లా, సంజామల మండలంలోని అలువకొండ గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అనేక కథలు, చిన్న కథలు, రకరకాల జోకులు, వ్యాసాలు, కవితలు, హైకూలు, పాటలు, చిన్న పిల్లల కథలు వ్రాశారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | షరాఫ్ తులసీ రామాచారి |
సంగ్రహ నమూనా రచన | – |
షరాఫ్ తులసీ రామాచారి
తెలుగు వ్యంగ్యచిత్ర రంగంలో 1960, 1970 దశకాలలో పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించినవాడు తులసీరాం. ఇతని అసలు పేరు షరాఫ్ తులసీ రామాచారి. తన పేరులోని “తులసి” “రామ” కలిపి ‘తులసీరాం’ తన కలంపేరును చేసుకుని ఆ పేరుతోనే ప్రఖ్యాతిగాంచాడు.
ఇతను 1941, ఏప్రిల్ 24న కర్నూలు జిల్లా, సంజామల మండలంలోని అలువకొండ గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి షరాబు పుల్లయ్య ఆచారి, తల్లి షరాబు సుబ్బమ్మ. ఇద్దరూ కీర్తిశేషులయ్యారు. 1958-59లో ఎస్సెసెల్సీ (Secondary School Leaving Certificate[SSLC]), 1959-60 ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం నుండి పి.యు.సి. (Pre University Course[P.U.C.]) పూర్తి చేశాడు. 1968లో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ (Andhra Pradesh State Electricity Board [APSEB])లో ఎల్డిసీగా చేరి, విజయవాడ, నరసారావుపేట, గుంటూరు ప్రాంతాలలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి జూనియర్ అక్కౌంట్స్ ఆధికారిగా 1998వ సంవత్సరంలో పదవీ విరమణ చేశాడు. ఇతను ప్రస్తుతం విశాఖ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య షరాబు సత్యవతి. ఇతణ్ణి ఎంతగానో ప్రోత్సహిస్తూ, ఉన్నత స్థానాల్లో చూడాలని ఆకాక్షిస్తుంటుంది. వీరికి ఇద్దరు కుమారులు-రవీంద్రీశ్వర్, సుధాకర్ మరియు కుమార్తె-నాగమణి. ఇతని పెద్ద కుమారుడు రవీంద్రీశ్వర్ దురదృష్టవశాత్తూ చిన్న వయసులోనే స్వర్గస్తులయ్యాడు. ఇతని చిన్న కుమారుడు, సుధాకర్ కూడా మంచి కళాకారుడు. ఏనిమేషన్ లో ప్రవేశం ఉన్నది, స్వంతంగా చక్కటి బొమ్మలు గీస్తూ ఉంటాడు.ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంతున్న వీరి సంప్రదించాలంటే +919553358224 నంబరులో సంప్రదించవచ్చు.
ఇతను కార్టూన్లు వెయ్యటమేకాక, అనేక కథలు, చిన్న కథలు, రకరకాల జోకులు, వ్యాసాలు, కవితలు, హైకూలు, పాటలు, చిన్న పిల్లల కథలు వ్రాశాడు. ఇతను వ్రాసిన కవితలలో కొన్ని, ఆకాశవాణి విజయవాడ కేద్రం వారు వివిధ భారతిలో ప్రసారం చేశారు. పదశృతి శీర్షికన వ్రాసిన వ్యాసాలు ఆంధ్ర ప్రభలో ప్రచురితమవుతున్నాయి. ఇతను వ్రాసిన కథలు దాదాపు 30 దాకా ఉంటాయి 1960లో వ్రాసిన “ప్రేమ ఫలితం” అనే నాటకం హైదరాబాదులో నిర్వహించబడిన పోటీలలో బహుమతి అందుకున్నది.
———–