శలాక రఘునాథశర్మ (Shalaka Raghunatha Sharma)

Share
పేరు (ఆంగ్లం)Shalaka Raghunatha Sharma
పేరు (తెలుగు)శలాక రఘునాథశర్మ
కలం పేరు
తల్లిపేరుదుర్గమ్మ
తండ్రి పేరునరసయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుకృష్ణా జిల్లా, నూజివీడు సమీపంలోని గొల్లపల్లి గ్రామం
విద్యార్హతలు
వృత్తిఆచార్యుడురచయిత, ఆంగ్ల ఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకవిత్రయ భారత జ్యోత్స్న, భారత ధ్వని దర్శనము,
ఆర్షభావనా వీచికలు, శ్రీ షట్పదీ కనకధారలు,
సనత్సు జాతీయ సౌరభం, శ్రీ నాగేశ్వర మహా విభూతి,
శివానందలహరి హంస
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఅజోవిభొ కందాళం విశిష్ట సాహితీమూర్తి పురస్కారం.
జానమద్ది హనుమచ్ఛాస్త్రి పురస్కారం
కంచి కామకోటి పీఠం లేఖారత్న బిరుదు.
రాయల కళా గోష్ఠి అనంతపురం వారిచే భోగిశెట్టి స్మారక పురస్కారం
శ్రీభాష్యం అప్పలాచార్య స్మారక పురస్కారం
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి వారిచే మహామహోపాధ్యాయ బిరుదు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం
సామవేదం షణ్ముఖశర్మచే ఋషిపీఠం పురస్కారం మొదలైనవి.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశలాక రఘునాథశర్మ
సంగ్రహ నమూనా రచన

శలాక రఘునాథశర్మ

శలాక రఘునాథశర్మ ప్రముఖ పండితుడు, కవి, రచయిత, శతాధిక గ్రంథకర్త, ప్రవచనకర్త. ఇతడు కృష్ణా జిల్లా, నూజివీడు సమీపంలోని గొల్లపల్లి గ్రామంలో 1941, జూలై 23వ తేదీన నరసయ్య, దుర్గమ్మ దంపతులకు జన్మించాడు. పదవ యేటనే తండ్రి మరణించడంతో ఇతని తల్లి పశ్చిమ గోదావరి జిల్లా, ఆకిరిపల్లిలో తెలిసిన వారియింట ఇతనికి వసతి, చదువు ఏర్పాటు చెసింది. ఇతడు 1960లో తెలుగు, సంస్కృత భాషలలో భాషాప్రవీణ మొదటి ర్యాంకులో ఉత్తీర్ణుడైనాడు. 1967లో తెలుగు భాషాసాహిత్యాలలో ఎం.ఎ. డిస్టింక్షన్ సాధించాడు. 1975లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుండి ‘భారతంలో ధ్వని దర్శనము ‘ అనే అంశంపై పి.హెచ్.డి. సంపాదించాడు. పేరి వెంకటేశ్వరశాస్త్రి, రామచంద్రుల కోటేశ్వరశర్మ, దివాకర్ల వేంకటావధాని, లంక శ్రీనివాసరావు ఇతని గురువులు.
ఇతడు 1960-65 మధ్యకాలంలో గౌతమీ విద్యాపీఠంలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. తరువాత హైదరాబాదులో ప్రాచ్యకళాశాలలో ఒక సంవత్సరం ఉపన్యాసకుడిగా సేవలను అందించాడు. అటు పిమ్మట ఇతడు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో లెక్చరర్‌గా అడుగుపెట్టి, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది డీన్‌గా పదవీవిరమణ చేశాడు. ఆ విశ్వవిద్యాలయంలో 16 సంవత్సరాలు ఆచార్యునిగా పనిచేసి, 24 మందికి డాక్టరేట్లు, 23 మందికి ఎం.ఫిల్.పట్టాలు లభించడానికి మార్గదర్శనం చేశాడు. ఉద్యోగ విరమణ తరువాత రాజమండ్రిలో స్థిరపడ్డాడు.
ఇతడు వ్యాసభారతంలోని విరాటపర్వానికి తాత్పర్య వ్యాఖ్యానాలు రచించాడు. ఆది, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, శాంతి, అనుశాసన, అశ్వమేధిక, ఆశ్రమవాసిక, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలలోని ప్రతి శ్లోకానికి తాత్పర్య, వ్యాఖ్యానాలు రచించాడు. యుద్ధషట్కం అని పిలువబడే ఆరు పర్వాలలో కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలను వచనరూపంలో తెలుగులోనికి అనువదించాడు. మొత్తం 80వేల శ్లోకాలకు తాత్పర్యసహిత్య వ్యాఖ్యానాలను అందించాడు. మిగితా పర్వాలలోని శ్లోకాలకు కూడా వ్యాఖ్యాన తాత్పర్యాలు వ్రాస్తున్నాడు

———–

You may also like...