కాకాని చక్రపాణి (Kakani Chakrapani)

Share
పేరు (ఆంగ్లం)Kakani Chakrapani
పేరు (తెలుగు)కాకాని చక్రపాణి
కలం పేరు
తల్లిపేరుసుబ్బమ్మ
తండ్రి పేరుశ్రీరాములు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ04/26/1942
మరణం01/02/2017
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకథల సంపుటలు : జీవరాగం 1996, మట్టి- బంగారం 2001, అతడు-నేను 2007, క్షతగాత్ర 2014, పిట్టగూళ్లు 2016
కవితా సంపుటి : ఆమె, 2002
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుసుశీలా నారాయణ రెడ్డి పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం, విమలాశాంతి పురస్కారం, సహృదయ సాహితి పురస్కారం, హసన్ ఫాతిమా పురస్కారం,
రంజని పురస్కారం, అజో-విభో పురస్కారం,
ఆటా కథా పురస్కారం, తానా కథా పురస్కారం, రంగవల్లి పురస్కారం, పులికంటి పురస్కారం,
ఆర్.ఎస్. కృష్ణ మూర్తి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం,
శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం మొ॥నవి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకాకాని చక్రపాణి
సంగ్రహ నమూనా రచన

కాకాని చక్రపాణి

కాకాని చక్రపాణి తెలుగు కథా రచయిత. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను, అత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. వీరు దాదాపు పన్నెండు నవలలు, ఎన్నో కథలు లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు ప్రకటించారు.
కాకాని చక్రపాణి గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో 1942, ఏప్రిల్ 26వ తేదీన శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు మంగళగిరి సి.కె.ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి, ఉన్నత విద్యను గుంటూరులో కొనసాగించారు. 1966లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇరువురు కుమారులు. 1993లో భార్య మరణించగా 1999లో పునర్వివాహం చేసుకున్నారు. 1970లో ఇంటి నుండి తిరుపతికి 600 కి.మీ.ల దూరం కాలినడకన ప్రయాణం చేయడం వీరి జీవితంలో ముఖ్య ఘట్టం. వీరు హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1974 నుండి 2000 వరకు 37 సంవత్సరాలు ఆంగ్లభాషా బోధకుకులుగా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఆంగ్ల బోధన వీరి వృత్తి తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి వీరి వ్యావృత్తి మనిషి మృదుభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదుటివారిని నొప్పించని తత్త్వం వీరిది. స్నేహితులతో కబర్లంటే ఇష్టపడతారు. తెలుగు నవలా సాహిత్యంపై సోమర్సెట్ మామ్ ప్రభావం అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టం పొందారు.

———–

You may also like...