వేగుంట మోహనప్రసాద్ (Vegunta Mohanaprasad)

Share
పేరు (ఆంగ్లం)Vegunta Mohanaprasad
పేరు (తెలుగు)వేగుంట మోహనప్రసాద్
కలం పేరుమో
తల్లిపేరుమస్తానమ్మ
తండ్రి పేరుసుబ్బారావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/05/1942
మరణం08/03/2011
పుట్టిన ఊరుగుంటూరు సమీపంలో లాం గ్రామం
విద్యార్హతలు
వృత్తిఇంగ్లీషు లెక్చరర్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచితి-చింత, పునరపి, రహస్తంత్రి, నిషాదం, సాంధ్యభాష,
బతికిన క్షణాలు (జీవిత చరిత్ర)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆయన తొలి కవితా సంకలనం చితి- చింతకు 1969లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది.
చివరి కవిత్వం నిషాదం. దీనికి తణికెళ్ల భరణి అవార్డు లభించింది.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవేగుంట మోహనప్రసాద్
సంగ్రహ నమూనా రచన

వేగుంట మోహనప్రసాద్

ప్రముఖ కవి, రచయిత, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘మో’ పేరుతో సాహితీలోకంలో సుప్రసిద్ధులైన ఈయన తెలుగు ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతుడిగా పేరొందాడు . ఆయన తాడికొండ మండలం లాంలోజన్మించారు. స్వస్థలం ఏలూరు సమీపంలోని వట్లూరు . తండ్రి వెంకట కనకబ్రహ్మం టీచర్. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందాడు. విజయవాడ లోని సిద్ధార్థ కళాశాలలో ఆయన ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశాడు. అంతకు ముందు మూడేళ్లపాటు నైజీరియాలోఆంగ్లోపాధ్యాయుడిగా పనిచేశాడు. చివరి దశలో ఆయన కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం అనుసృజన (అనువాద) శాఖకు అధిపతిగా పనిచేశాడు.
గుంటూరు సమీపంలో లాం గ్రామంలో 1942, జనవరి 5 న సుబ్బారావు, మస్తానమ్మ దంపతులకు జన్మించారు.ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఏ. చేశారు. విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేశారు.సిద్ధార్థ విద్యా సంస్థల్లో ఆంగ్ల శాఖాధిపతిగా 2000 జూలై 31న ఉద్యోగ విరమణచేసి ఆ తర్వాత ఐదేళ్లు ద్రవిడ విశ్వవిద్యాలయంలో అనువాద విభాగానికి నేతృత్వం వహించారు. కవిగా, అనువాదకునిగా ఆయన అపార ప్రతిభ కనబర్చారు.ఈయనకు భార్య సుజాత, కుమార్తె మమత ఉన్నారు.
ఆయన వ్రాసిన మొట్టమొదట కవిత “హిమానీహృది” 1960 మే నెల భారతి పత్రికలో ప్రచురించబడింది. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు తన ఊరి తన వారి జ్ఞాపకానుభవాల కాక్‌టెయిల్‌ చితి-చింత (1969) మో కి తెలుగు కవుల్లో ఒక ప్రత్యేకమైన ఉనికిని తెచ్చింది. తెలుగు పాఠకులకు 1969లో చితి-చింత కవితా సంపుటితో మో పరిచయమయ్యారు. 1970 దశకం దాకా ఉన్న కవిత్వాన్ని ఆంగ్ల పాఠకులకు పరిచయం చేయాలన్న తపనతో ది టెన్స్ టైమ్ను ప్రచురించారు. కరచాలనం గ్రంథం (1999), రహస్తంత్రి కవితా సంపుటికి మంచి పేరువచ్చింది. బతికిన క్షణాలు (1990), పునరపి (1993), సాంధ్యభాష (1999), వెన్నెల నీడలు (2004) కవితాసంపుటాలు అపురూప కవిగా స్థిరపరిచాయి. ఈ మధ్య ఖాదర్ మొహియుద్దీన్ -టిఎస్ ఇలియట్ వేస్ట్‌లాండ్ను చవిటిపర్ర (2011) పేరిట చేసిన అనువాదానికి మో టీకా-టిప్పణి సమకూర్చారు. ఆత్మశ్రీయ ధోరణికి పెద్దపీట వేస్తూనే స్వాప్నికునిగా అన్వేషకునిగా తెలుగు సాహిత్యంపై మో చెరగని ముద్ర వేశారు.

———–

You may also like...