వక్కంతం సూర్యనారాయణరావు (Vakkantam Suryanarayanarao)

Share
పేరు (ఆంగ్లం)Vakkantam Suryanarayanarao
పేరు (తెలుగు)వక్కంతం సూర్యనారాయణరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరువరదయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుచిత్తూరు జిల్లా, అరికెల గ్రామం
విద్యార్హతలు
వృత్తిరచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆధ్యాత్మికం, తాత్త్విక రచనలు : నవగ్రహ పురాణం,
భగవాన్ పరశురాం, శ్రీ శివరాత్రి మహాత్మ్యం, అష్ట దిక్పాలక వైభవం, శని చరితామృతం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవక్కంతం సూర్యనారాయణరావు
సంగ్రహ నమూనా రచన

వక్కంతం సూర్యనారాయణరావు

వక్కంతం సూర్యనారాయణరావు ప్రముఖ తెలుగు రచయిత. ఇతడు అనేక కథలు, నవలలు, ఆధ్యాత్మిక రచనలు, అనువాదాలు రచించాడు. ఇతని కుమారుడు వక్కంతం వంశీ తెలుగు సినిమా రచయితగా రాణించాడు.
ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, అరికెల గ్రామంలో 1942లో జన్మించాడు. ఇతనికి బాల్యం నుండే దేశభక్తి, సామాజిక స్పృహల పట్ల అవగాహన ఉంది. ఇతడు పాఠశాల ఫైనల్ వరకు చదువుకున్నాడు. ఇతడు బాల్యంలో తన మొదటి కథను పిల్లల కోసం వ్రాసి తన తండ్రి వరదయ్యకు చూపించాడు. అది చదివిన వరదయ్య తన కుమారుని ఎంతగానో ప్రోత్సహించాడు. రచనలు చేయడానికన్నా ముందు అన్ని రకాల పుస్తకాలను చదవమని సలహా యిచ్చాడు. అతడు తను కుమారునికి టెంపోరావు డిటెక్టివ్‌ నవల “ఇతన్ని నమ్మకండి”ను బహూకరించాడు. తండ్రి సలహా ప్రకారం ఇతడు తన బాల్యంలో అన్ని రకాల పుస్తకలను విరివిగా చదివాడు. ఇతడు ప్రముఖ డిటెక్టివ్ రచయిత “టెంపోరావు”కు అత్యంత సన్నిహితుడయ్యాడు. టెంపోరావు ఇతనికి రచనలలో మెళకువలను నేర్పించాడు. ఇతడి రచనలను ఎంతగానో ప్రోత్సహించాడు. టెంపోరావు ఇతడిని తన రచనా వారసుడిగా ప్రకటించాడు.
ఇతడు తన దృష్టిని సమాజంలోని సమస్యల పట్ల ముఖ్యంగా స్త్రీల మానసిక, శారీరక సమస్యలు, వారికి జరుగుతున్న అన్యాయాలపై సారించాడు. ఇతని మొదటి నవల “అబల ఆంతర్యం” 1966లో ప్రకటించబడింది. ఈ నవలను మద్రాసులోని ఒక పబ్లిషర్ ప్రకటించాడు. ఈ నవలకు ప్రచురణ కర్త ఏ పారితోషికం ఇవ్వలేదు. అసలు ఈ నవల ప్రచురిస్తున్నట్టు కూడా తెలియజేయ లేదు. ఇతనికి ఒక ప్రతి కూడా పంపలేదు. ఇతడు ఎంతో శ్రమకోర్చి మద్రాసు వెళ్లి ఈ నవల కాపీ ఒకటి కొన్నాడు. రచయితగా ఇది ఇతని తొలి అనుభవం. అప్పటి నుండి ఇతడు స్త్రీ సమస్యల పట్ల అనేక నవలలు, కథలు వ్రాశాడు. ప్రముఖ సినీ రచయిత ఆచార్య ఆత్రేయ ఇతని రచనల పట్ల ఆకర్షితుడై ఇతడిని “మగ రచయిత్రి” అని కొనియాడాడు.
1980 నుండి ఇతడు పూర్తిస్థాయి రచయితగా మారాడు. ఇతడు తన డిటెక్టివ్ నవలలను, కథలను వి.ఎస్.రావు అనే పేరుతోను, ఆధ్యాత్మిక, సాంఘిక రచనలను తన పూర్తి పేరు వక్కంతం సూర్యనారాయణరావు అనే పేరుతోను ప్రకటించాడు. ఇతడు ఇంకా ‘బాటసారి’, ‘కౌండిన్య ‘, ‘సూర్యాత్రేయ ‘, ‘చిత్రభాను ‘ అనే కలంపేర్లతో రచనలు చేశాడు.
ఇతడు 84 కు పైగా క్రైమ్‌, డిటెక్టివ్ నవలలను, స్త్రీవాద నవలలను, నాటకాలను, ఆధ్యాత్మిక రచనలను చేశాడు.ఇంకా ఇతడు వందల కొద్దీ భక్తి పాటలను వ్రాసి క్యాసెట్లుగా విడుదల చేశాడు.
ఇతడు టెంపో అనే డిటెక్టివ్ పాత్రను సృష్టించి సుమారు 12 నవలలలో ఆ పాత్రను హీరోగా చేశాడు. ఈ పాత్రకు తన అభిమాన రచయిత టెంపోరావు ప్రేరణ. టెంపోరావు మరణించిన తర్వాత ఈ టెంపో పాత్ర సృష్టించబడింది. ఈ పాత్ర తెలుగు పాఠకులలో ఎంత ప్రాచుర్యం పొందింది అంటే ఆ పాత్ర సజీవమైనదని ఎందరో నమ్మారు.
ఇతడు తిరుమల తిరుపతి దేస్థానం వారి “దాస సాహిత్య ప్రాజెక్టు”లో అనువాదకునిగా పనిచేశాడు. ఈ సమయంలో ఇతడు చాలా ఆధ్యాత్మిక రచనలను కన్నడ భాష నుండి తెలుగులోనికిఅనువదించాడు. వాటిని తి.తి.దే. వారు ప్రచురించారు.

———–

You may also like...