పూండ్ల రామకృష్ణయ్య (Pundla Ramakrishnaiah)

Share
పేరు (ఆంగ్లం)Pundla Ramakrishnaiah
పేరు (తెలుగు)పూండ్ల రామకృష్ణయ్య
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/14/1860
మరణం9/1/1904
పుట్టిన ఊరునెల్లూరు జిల్లాలోని దువ్వూరు లో జన్మించాడు.
విద్యార్హతలు
వృత్తిప్రముఖ తెలుగు పండితుడు, విమర్శకుడు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅముద్రిత గ్రంథ చింతామణి అనే పత్రికను రామకృష్ణయ్య 1885లో ఒడయారు వీరనాగయ్య సహాయ సంపాదకతతో ప్రారంభించాడు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలునెల్లూరు జిల్లా గెజిట్ తరువాత ఇప్పుడు లభ్యమయ్యే నెల్లూరు ప్రాచీన పత్రిక ’అముద్రిత గ్రంథ చింతామణి’.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపూండ్ల రామకృష్ణయ్య
సంగ్రహ నమూనా రచననెల్లూరు జిల్లా గెజిట్ తరువాత ఇప్పుడు లభ్యమయ్యే నెల్లూరు ప్రాచీన పత్రిక ’ఆముద్రిత గ్రంథ చింతామణి’. 19వ శతాబ్ద చివరిపాదంలో ఆంధ్రదేశంలో సాగిన భాషాకృషికి, సారస్వత వ్యాసంగానికి, చెలరేగిన పండిత వివాదాలకూ ఆముద్రిత గ్రంథ చింతామణి నిలువుటద్దం. అప్పటి విమర్శనాపద్ధతులకు, సాహిత్యసంప్రదాయాలకూ ఇది ఒక సజీవసాక్ష్యం.

పూండ్ల రామకృష్ణయ్య

నెల్లూరు జిల్లా గెజిట్ తరువాత ఇప్పుడు లభ్యమయ్యే నెల్లూరు ప్రాచీన పత్రిక ’ఆముద్రిత గ్రంథ చింతామణి’. 19వ శతాబ్ద చివరిపాదంలో ఆంధ్రదేశంలో సాగిన భాషాకృషికి, సారస్వత వ్యాసంగానికి, చెలరేగిన పండిత వివాదాలకూ ఆముద్రిత గ్రంథ చింతామణి నిలువుటద్దం. అప్పటి విమర్శనాపద్ధతులకు, సాహిత్యసంప్రదాయాలకూ ఇది ఒక సజీవసాక్ష్యం. ఆనాటి సాహితీపరులంతా ఏదో ఒక విధంగా ఈ పత్రికా సంపాదకులతో సంబంధం ఉన్నవాళ్ళే. ఆముద్రిత గ్రంథ చింతమణి దాదాపు రెండు దశాబ్దాలపాటు జీవించింది. ఈపత్రిక సంపాదకులు పూండ్ల రామకృష్ణయ్య దీని నిర్వహణ తన జీవితాశయంగా భావించారు. తన 23వ ఏట పత్రిక ప్రారంభించి, చనిపోయేరోజువరకు పత్రిక కొనసాగిస్తూ వచ్చారు. ఉల్లిగొండం రామచంద్రరావు ప్రేరణ, రెవెన్యూ ఉద్యోగి-గౌరవనీయుడూ అయినరోజుకుర్తి వెంకటకృష్ణారావు ప్రోత్సాహం పుండ్ల రామకృష్ణయ్యకు ఈ పత్రిక ప్రచురణకు స్ఫూర్తినిచ్చాయి. హిందూ వర్నాక్యులర్ స్కూలులో ఆంధ్ర పండితులుగా పనిచేస్తున్న ఒడయారు వీరనాగయ్య దేవర సహసంపాదకుడిగా బాధ్యత స్వీకరించి కొంతకాలం పత్రికా నిర్వహణలో సహకరించారు. తొలి నాలుగుపుటలలో వ్యాకరణాది శాస్త్ర విచారం. గ్రంథవిమర్శ, సమస్యాపూరణం, వసుచరిత్ర,మనుచరిత్ర వంటి ప్రాచీన ప్రబంధాలలోని కఠిన పద్యాలకు అర్థనిరూపణ, భిన్నప్రతులలోని పాఠాంతరాలను చర్చించి కవి హృదయాన్ని ఆవిష్కరించడం, లక్షణ విరుద్ధమైన రచనలమీద ఆక్షేపణలతో పాటు పద్యాల ప్రచురణ, విద్యావిషయకమైన లేఖలుండేవి. తక్కిన పుటలను ఆముద్రిత గ్రంథాలను పరిష్కరించి ప్రకటించడానికి కేటాయించేవారు. నిరాదరణతో నశించిపోతున్న తాళపత్ర గ్రంథాలను సేకరించి ప్రచురించడం ఆముద్రిత గ్రంథ చింతామణి ప్రధానాశయం. వేదం వెంకటరాయశాస్త్రి, మండపాక పార్వతీశ్వరశాస్త్రి వంటి వారి కీర్తి దశదిశలా వ్యాప్తి చెందేందుకు ఆముద్రిత గ్రంథ చింతామణి గొప్ప సాధనం అయింది.

-పుస్తకం. నెట్ సౌజన్యంతో

———-

 

పూండ్ల రామకృష్ణయ్యగారివంటి తెలుగుపండితు లెందఱో కలరు. కాని వారివంటి విమర్శకులు తక్కువ. వీరిది మొగమోటమి లేని విమర్శనము. ఆంధ్రమున వీరిపాండితి నిరూడము. ఈయన బహుశ్రద్దతో వెలువరించిన ‘అముద్రితగ్రంథ చింతామణి’ పత్రికలలోని ప్రతిపత్రమును వేలకొలది విలువ కలది. ఈపత్రిక 1885 ఒడయారు బీరనాగయ్యగారి సహాయసంపాదకతతో శ్రీరామకృష్ణయ్యగా రారంభించిరి. 1888 లో వీరనాగయ్యగా రీయుద్యమమునుండి తప్పుకొనిరి. శ్రీ వేంకటగిరిమహారాజా శ్రీరాజగోపాలకృష్ణయాచేంద్ర బహద్దరు వారు దీనికి బోషకులు. ఇక లోటేమి? రామకృష్ణయ్యగారు తమ నిర్యాణపర్యంతము 1904 వఱకు నముద్రితగ్రంథచింతామణి నపూర్వపద్ధతులతో వెలువరించిరి. 

జతనము మీఱంగ నము

ద్రితసద్గ్రంథముల సేకరించి కడు బరి

ష్కృతములు గావించి యథా

మతి బత్త్రిక గూర్చెదము క్రమంబుగ వానిన్.

 

తోరపు నూలుదారములతో బదిలంబుగ గట్టి పెట్టియం

బేరుప నందు జీర్ణదశ జెంది మొగిం గ్రిమికీటకచ్ఛటా

పూరితమైవృథాసెడు సముద్రితపుస్తకపంక్తి నెంత యుం

గూరిమి మీఱ నచ్చునను గూర్చుట సెల్లదె పత్త్రికాకృతిన్.

ఆముద్రిత గ్రంథప్రకటనము, వ్యాకరణచ్ఛందోవిషయవిమర్శనము నీపత్రిక ప్రధానోద్దేశములు, మండపాక పార్వతీశ్వరశాస్త్రి, వేదము వేంకటరాయశాస్త్రి ప్రభృతులపాండిత్యశక్తి నీపత్రికయే చాటినది. రామకృష్ణయ్య గారి విమర్శకతి ‘మయూఖము’ లలో వెల్లివిరిసినది. శ్యమంతక, శబ్దవిచారము, పటుశబ్దప్రయోగము, పరిఖా పరిఘ శబ్దద్వయసాధుత్వము బిలేశ్వరీయకృతి విమర్శనము ఇత్యాదులు రామకృష్ణయ్యగారికి విమర్శ కాగ్రేసర బిరుదము నీయగల వ్యాసములు. వీరి విమర్శనము కేవలశాబ్దికమే కాదు. నాటకాదులలో గ్రామ్యభాషాప్రయోగము చేయవచ్చునా? ఇత్యాదివిషయములుకూడ వీరి నిశితవిమర్శకు విషయములైనవి. వేదము వేంకటరాయశాస్త్రిగారి ‘నాగానందము’ లోని పాత్రోచితభాషను వీరు చక్కగ సప్రమాణముగ సమర్థించిరి. నాడు వీరివ్రాత పండితులకు శాసనము.

అ.గ్ర. చింతామణిలో వెలువరించిన గ్రంథము లివి: 1 ప్రబంధరాజ వేంకటేశ్వరవిజయవిలాసము. (గణపవరపు వేంకటకవి) 2.హరిశ్చంద్రవలోపాఖ్యానము. (రామరాజభూషణుడు) 3. మిత్త విందాపరిణయము (కుందుర్తి వేంకటాచలకవి) 4. చంద్రాంగదచరిత్రము (పైడిమఱ్ఱి వేంకటపతి) 6. యాదవరాఘవపాండవీయము (నెల్లూరి వీర రాఘవకవి) వైజయంతీవిలాసము (సారంగు తమ్మయ) ఇవి ప్రాచీనములగు ప్రబంధములు. ఆధునికకృతులుకూడ నిందు బ్రచురితములు. ఓగిరాల రంగనాథకవిగారి ‘ద్విరేఫదర్పణము’ మండపాక పార్వతీశ్వరకవిగారి శ్రీకృష్ణభ్యుదయము మున్నగునవి.

సహజముగ నీయన చిన్ననత్తికలవాడని, కాని పద్యములు మధురకంఠమున జదువునపు డానందముగ నుండెడిదని చెప్పుకొనుట.

రామకృష్ణయ్యగా రొనరించిన భాషాసేవ చిరస్మరణీయము. ఈయన గతకాలములో స్మృతిదప్పి పడియున్నప్పుడు వేంకటగిరి ప్రభువు వీరికి కొంతధనము పంపి వారిచెవికడ ‘వేంకటగిరిరాజు పంపె’ నని గట్టిగా కేకవేయించి యిచ్చుటకాజ్ఞ పెట్టెనట. ఆమహారాజున కీయనపై నంతయభిమానము.

——-

ఆంధ్ర రచయితలు నుండి-

———–

You may also like...