పేరు (ఆంగ్లం) | Nadella Purushottama Kavi |
పేరు (తెలుగు) | నాదెళ్ల పురుషోత్తమ కవి |
కలం పేరు | – |
తల్లిపేరు | సుబ్బాంబిక |
తండ్రి పేరు | కామేశ్వరశాస్త్రి. |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 4/23/1863 |
మరణం | 11/27/1938 |
పుట్టిన ఊరు | ఈయన పూర్వీకులది కృష్ణా జిల్లా నాదెళ్ల గ్రామం. ఈయన దివితాలూకా సీతారామపురం అగ్రహారంలో జన్మించారు. |
విద్యార్హతలు | – |
వృత్తి | బందరు హిందూ ఉన్నత పాఠశాల బ్రాంచి ప్రధానోపాధ్యాయులు |
తెలిసిన ఇతర భాషలు | హిందీ, పారశీక |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తెలుగు : అహల్యాసంక్రందనం (1883), హరిశ్చంద్ర (1917), పారిజాతాపహరణం, సారంగధర, ద్రౌపదీ వస్త్రాపహరణం, చంద్రహాస (1916), స్త్రీల మీటింగు నాటి హరికథ ప్రహసనం (1908) హిందీ: కాళాసురవధ, పంచాక్షరీ మహిమ, సుభద్రా పరిణయం, శంబూక వధ, శారదోపాఖ్యానం, లవణాసుర సంహారం (1916), చిత్ర కందపద్య రత్నాకరము(1922) వంటి ప్రసిద్ధ రచనలు చేశారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు, ఆదర్శోపాధ్యాయుడు, శతాధిక గ్రంథకర్త, బుధ విధేయని పత్రికా సంపాదకులు, జ్యోతిషమంత్ర శాస్రవేత్త, తెలుగు నాటకాలలో పాత్రోచిత భాషా ప్రయోగానికి ఆద్యుడు. బందరులో 1886లో బుధజన విధేయని పత్రిక స్థాపించారు. ఆ తరువాత 1890లో హైందవ పాఠశాలను, హిందూమత బాలసమాజం స్థాపించి, హిందూ మతోద్ధరణకు పాటుపడ్డారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | నాదెళ్ల పురుషోత్తమ కవి |
సంగ్రహ నమూనా రచన | కవిత్వ మొకకళ. కళకును శాస్త్రమునకును నెంతో యంతరము. తొలినాడు శాస్త్రకారునకు జూపిన గౌరవప్రపత్తులు, కళాకారునకు జూపలేదనుట వాస్తవము. నటవిటగాయకుల గణములోనే కవుల పరిగణనము. నేడు తలక్రిందులై కళాజీవులు గద్దెలకెక్కి కొండాడబడు చుండుటయు, శాస్త్రజీవులు అజ్ఞాతులై మూలలనుండుటయు జరుగుచున్నది. |
నాదెళ్ల పురుషోత్తమ కవి
కవిత్వ మొకకళ. కళకును శాస్త్రమునకును నెంతో యంతరము. తొలినాడు శాస్త్రకారునకు జూపిన గౌరవప్రపత్తులు, కళాకారునకు జూపలేదనుట వాస్తవము. నటవిటగాయకుల గణములోనే కవుల పరిగణనము. నేడు తలక్రిందులై కళాజీవులు గద్దెలకెక్కి కొండాడబడు చుండుటయు, శాస్త్రజీవులు అజ్ఞాతులై మూలలనుండుటయు జరుగుచున్నది. దీనిలోరహస్యము, కళ వలన బ్రతుకువానికడ నాముష్మికదృష్టి లోపించి యుండువల్ల నేమోయని తోచును. కళగాని, శాస్త్రముగాని తాత్త్విక సరణికి గొనిపోవలయును. అపుడు, ఆకళాకారుడు, ఆ శాస్త్రకారుడు నేక శ్రేణిలో గూర్చుండుటకర్హులగుదురు. కవికి “సంథ్యావందనము బావగారు” అని తిరుపతికవులు కాబోలు చెప్పినారు ఇది ఇటులు సార్వత్రికమనుటకు వీలు లేకుండ మహానిష్ఠాగరిష్ఠులగు పురుషోత్తములు కొందఱు కవిలోకమలో నుందురు. అట్టివారిలో నాదెళ్ళ పురుషోత్తమకవిగారొకరు. శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు వీరిని గూర్చి వ్రాసిన యీపద్యములు సరిగా దూచిన ట్లున్నవి.
అతిశాంతుం, డతిదాంతుడు
కృతకృత్యుడు, నుకవి, యెన్నియేని విషయముల్
మతినెఱిగినవిద్వాంసుడు,
స్తుతియింపదగిన పూరుషుండు సుకవులకున్.
ఒకనికి లో గని శాంతియు
సకలమ్ము నతిక్రమించు చండత, కడువై
దికకర్మ నిష్ఠయు బరో
పకృతియు బురుషోత్తముని స్వభావగుణమ్ముల్.
పురుషోత్తమకవి తొలుత రేపల్లె లోయరు సెకండరీస్కూలులో నుపాధ్యాయుడు. ఆపదవిలో నుండగానే జ్యోతిశ్శాస్త్రము, ధర్మశాస్త్రము మున్నగువానియందు పాండిత్యము సంగ్రహించెను. 1884 నుండి, బందరు వీరిని హిందీనాటక రచనకు బ్రోత్సహించుచు వచ్చినది. అదివీరి జీవిక కొక క్రొత్త మెఱుగు. “నేషనల్ ధియేట్రికల్ సొసైటి” అనుపేర బందరున నొకనాటక సమాజము వెలసినది. వారికి హిందీనాటకముల సంతరింపజేసి ప్రదర్శింప వలయునని క్రొత్త……………………………… ,…………………. ………………. ………………… ………………….
(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) పురుషోత్తమకవి యిపుడు తెలుగువాడై, “బుధవిధేయిని” యను పత్రిక సంపాదించుట కారంభించెను. ఆయన తెలుగు పత్రికా సంపాదకుడైనను భారతీయుడు. తనపత్రికలో “నేషనల్ కాంగ్రెసు” ను గూర్చి ప్రచారవ్యాసములు వ్రాసి ప్రకటించెను. కాంగ్రెసుపై ఉరుదుభాషలో మహ్మదీయుల కుపన్యసించిచెప్పిన ప్రబోధకులు పురుషోత్తమ కవిగారు. కవికి జాతీయభావములు నిండార నుండవలయునుగదా!
పదవడి, వీరు 1887 మొదలు 1908 దాక హిందూబ్రాంచి స్కూలు హెడ్మాష్టరుగా శిష్యులను దిద్దెను, ఈ యుద్యోగము లన్నియు బురుషోత్తమున కార్థికములు. హార్దికముగా వీరునిర్వహించుచున్నది సారస్వతోద్యోగము. వీరు హెచ్చుగా బంధగర్భ కవిత్వాభిమానులు. చతుర్ముఖి కందపద్య రామాయణము, చిత్రకంద పద్యరత్నాకరము, మల్లికార్జున మకుటాంచ త్కందగీత గర్భితోత్సల చంపక మాలాష్టోత్తర శతకము ఇత్యాదులందుల కుదాహరణములు. చతుర్విధ కవితా ధురంధరులని వీరికి గల బిరుదము. పురుషోత్తమకవి శతక కవితా ధోరణి యీతీరు గలయది:
చ. ఒగి నగుమోముతో ముదమునొందగ జేయును ముద్దుపాప తా
వగనగ నెట్టులే గనెడువారి నడంబడు గంటి పాప చూ
డగ దిగువ స్వడి న్నిలుకడం దగ కాడును నీటిపాప తా
బగ లెగురుంగదా మదిని బాపగ జేయకు మల్లికేశ్వరా!
క. నగు మోముతో ముదము నొం
దగ జేయును ముద్దుపాప తా వగ నగనే
దిగువ వ్వడి న్నిలుకడం
దగ కాడును నీటిపాప తాబగ లెగురున్.
గీ. ముదము నొందగ జేయును ముద్దుపాప
కనెదు వారి నడంబడు గంటిపాప నిలుకడం దగ కాడును నీటిపాప
మదిని బాపగ జేయకు మల్లినాథ!
ఈపద్యములు మల్లికార్జున శతకములోనివి. చంపకమాలిక కడుపులో కంద – గీతములు రెండును నిమిడియున్నవి. జాగరూకతతో నీ మూడుపద్యములు చూచినచో గవిగా రెంత పరిశ్రమించిరో వెల్లడి కాగలదు. సాధారణముగా బంధకవితలు రచన రామణీయకము కొఱవడి యుండును. పురుషోత్తమకవిగారి శైలిమాత్రము మధురధారకలది-బంధకవిత్వములో నీయన యందెవేసినవా రనుట కెన్నో కృతులు తారకాణ లున్నవి. అది యటుండె; వీరి యద్భుతోత్తరరామాయణము నందలి వివధవర్ణనాంశములు గల పద్యములు కొన్ని:
క. అసలది వసంత మాయెను
బసరంగు సరింప విడిచె బడ జల్లిన య
ట్ల సదా యలరారుగదా
మిసమిస నదృశము లయ్యె మేదిని దరుపుల్.
క.వట ఫలము చుబుక మపునవి
నటు పటు దంతములు దాడిమాంచిత బీజో
త్కటములు మౌక్తికకుంద
స్ఫుటములు విశ్శ్రేణిబోల్ప బొలుపగువళులన్.
క. మదగజముల గేరెడినో
కుదిరిక యంచరులకు గూర్పగోరెడి నోయా
పదముల యెదుగుడు గమనిక
కుదిరెడి నే నాగకవులకు స్వర్ణింపన్.
నీసంవిధముగా మనోహరరీతిని చతుర్విధకవితలు సంతరించిన సుకవి పురుషోత్తములు కుమారరత్నము నాదెళ్ళ మేధా దక్షిణామూర్తి శాస్త్రిగారు తెలుగు రచయితల నెఱగినవారు.
ఆంధ్ర రచయితలు నుండి-
———–