కాళ్ల కూరి నారాయణరావు (Kallakuri Narayanarao)

Share
పేరు (ఆంగ్లం)Kallakuri Narayanarao
పేరు (తెలుగు)కాళ్ల కూరి నారాయణరావు
కలం పేరు
తల్లిపేరుఅన్నపూర్ణమ్మ
తండ్రి పేరుబంగారు రాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ4/28/1871
మరణం6/27/1927
పుట్టిన ఊరుతూర్పగోదావరి జిల్లాలోని కాకినాడ మత్స్యపురి
విద్యార్హతలుపాడి వెంకట నారాయణ వద్ద కావ్య , నాటకాలంకార గ్రంధాలను అభ్యసించారు .
వృత్తిప్రథమాంధ్ర ప్రచురణ కర్త…జాతీయవాది…ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువరవిక్రయం, చింతామణి , మధుసేవ ,చిత్రాభ్యుదయం ,పద్మవ్యూహం (1919), సంసార నటన (1974 కళలో ధారవాహికగా ప్రచురితం) , కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920),
లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుమహాకవి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకాళ్లకూరి నారాయణరావు
సంగ్రహ నమూనా రచనగీ. “కవి ప్రసిద్ధుఁడు; కావ్యమా – కాలవిహిత
మైనయది; మీరలా భర-తాగమమునఁ
జతురు; లటుగాన, మీ ప్రద-ర్శనము కొఱకుఁ
ద్వరబడుచు నున్నవార మెం-తయును మదిని.”
అనియా?- చిత్తము చిత్తము- ఇదిగో యిప్పుడే యుపక్రమించెదము.

కాళ్ల కూరి నారాయణరావు

వరవిక్రయం నాటకం

పాత్రలు

• పురుషోత్తమరావు – పెండ్లికుమార్తెల తండ్రి
• భ్రమరాంబ – పెండ్లికుమార్తెల తల్లి
• సింగరాజు లింగరాజు – పెండ్లికుమారుని పెంపుడు తండ్రి
• సుభద్ర – సింగరాజు లింగరాజుగారి భార్య
• కాళింది – మొదటి పెండ్లికుమార్తె
• కమల – రెండవ పెండ్లికుమార్తె
• బసవరాజు – పెండ్లికుమారుడు
• పెండ్లిండ్ల పేరయ్య – దళారీ
• వివాహాల వీరయ్య – దళారీ
• న్యాయాధిపతి
• ఘంటయ్య – సింగరాజు లింగరాజుగారి వంట బ్రాహ్మడు
నాంది
భూరివరిష్ఠమై, విబుధ – పుంగవ మంగళ వాక్సమృద్ధమై,
చారుతరాప్సరోనటన – సంభృతమై, సవినోదమై, యహం
కార వికార దూరమయి – గర్హ్యతరోభయశుల్క శూన్యమౌ
గౌరి వివాహసంస్మరణ – కల్గగఁజేసెడుఁ గాక! భద్రముల్‌.
ప్రస్తావన
సూత్ర:- (ప్రవేశించి) ఓహో! యేమి యీ సభాసమ్మర్దము! ఆ మహాకవి కావ్యము లనఁగానే యభిజ్ఞుల కేమి యాదరము! (పరిక్రమించి) ఓ సభాస్తారులారా! వర్తమాన వరశుల్క దుర్నయ దూరీకరణమునకై బుద్ధిరాజు వీరభద్ర రాయామాత్యులవారి కంకితముగా, మహాకవి కాళ్లకూరి నారాయణరావు గారిచే రచింపఁబడిన వరవిక్రయ రూపకమును విలోకించు నిమిత్తము విచ్చేసిన మీయెడ నే నత్యంతముఁ గృతజ్ఞుఁడను, ఏమనుచున్నారు?
గీ. “కవి ప్రసిద్ధుఁడు; కావ్యమా – కాలవిహిత
మైనయది; మీరలా భర-తాగమమునఁ
జతురు; లటుగాన, మీ ప్రద-ర్శనము కొఱకుఁ
ద్వరబడుచు నున్నవార మెం-తయును మదిని.”
అనియా?- చిత్తము చిత్తము- ఇదిగో యిప్పుడే యుపక్రమించెదము.

(తెరవంకఁ జూచి) ఓసీ! ఓసీ! యెక్కడ! ఒక్కసారి యిటురమ్ము.

నటి:- (ప్రవేశించి) ఏమా యధికారము! కొని పాఱవైచినట్లె గొంతు చించుకొనుచున్నారే?
సూత్ర:- ఓసి దెష్టా! కొని గాక నిన్నుఁ గోసికొని వచ్చితి నఁటే? నీ తండ్రికిచ్చిన వేయిరూపాయల రొక్కము – నీకుఁబెట్టిన వేయిరూపాయల నగలు – ఏ గంగలోఁ గలిసినవి?
నటి:- మీ సొమ్ములు మీకుఁ దిరుగ నిచ్చివేసిన నాకు విడియాకు లిచ్చెదరా?
సూత్ర:- ఆసి నీబొడ్డుపొక్క! యిది అమెరికాదేశ మనుకొంటివా యేమి! కాదుకాదు- ఆర్యావర్తము. అబ్బో! ఆ యాట లిక్కడ సాగవు! బొందు మెడఁగట్టినచో, బొందిలోఁ బ్రాణముండువఱకును బందెగొడ్డువలెఁ బడి యుండవలసినదే.
నటి:- అట్లయిన నాసంగతి రేపాఁడంగుల సభలో నాలోచించెదము. కాని- యిప్పుడు నన్నుఁ బిలిచినపని యేమో సెలవిండు.
సూత్ర:- పాత్రములను సిద్ధపఱచితివా?
నటి:- సిద్ధపఱచుటయే గాదు- శీఘ్రముగఁ బ్రవేశింపవలసిన దని చెప్పికూడ వచ్చినాను.
సూత్ర:- అట్లయిన, వారింకను నాలసించుచున్నా రేమి?
నటి:- మీ చెవులలోఁ జెట్లు మొలచినవా యేమి! ఆ చరకాగానము వినబడుట లేదా?
(తెరలో:-) చరకా ప్రభావం బెవ్వరి కెఱుక! జగతిలోన మన చరకా॥
సిరులతోడఁ దులఁదూగుచున్న యల-
సీమజాతి చూచుచున్న దేమఱక, చరకా॥
సూత్ర:- ఔనే! అవిగో – భ్రమరాంబా, కాళిందీ, కమలా పాత్రములు చరకాగానముతోఁ బ్రవేశించుచున్నవి. మనము పోయి పయిపని చూతము రమ్ము.
(ఇద్దరు నిష్క్రమింతురు.)
ఇది ప్రస్తావన.
ప్రథమాంకము.

(ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి.)
(ప్రవేశము: పంటెను నూలు చుట్టుచు భ్రమరాంబ, చరకాగానముతో నూలు వడకుచు కాళింది, కమల.)
కాళింది,
కమల:- (మోహనరాగము – ఆది తాళము.)
చరకా ప్రభావం బెవ్వరి కెఱుక! జగతిలోన మన చరకా॥

సిరులతోడఁ దులఁదూగుచున్న యల-
సీమజాతి చూచుచున్న దేమఱక. చరకా॥

చర.
సాలున కిరువదికోట్ల రూప్యములు – సంపాదించెడు వారికె గాక
మేలి చేతిపనులు మాపుకొని – మేటి బానిసలమైన వెనుక, చరకా॥

పాటవమగు సామ్రాజ్యముఁ గూర్చున్‌ – పరిమితి లేని ధనంబును జేర్చున్‌
కాటక రాకాసిని బరిమార్చున్‌ – సాటిలేని యొక జాతి నొనర్చెన్‌. చరకా॥
కాళింది:- అమ్మా! అదేమే – చేతిలోని నూలు చేతిలోనే యున్నది!
భ్రమ:- ఈ పూఁట నా దృష్టి యీపని మీఁద లేదే! మీ నాయనగారు మిల్లెగరిటెఁడు కాఫీనీళ్లు గొంతులోఁబోసికొని, ప్రొద్దున బోయినపోక – యింతవఱ కింటికి రాలేదు! పండ్రెండు కొట్టి పావుగంట యైనది! ఎక్కడికి వెళ్లినారో యేమి పనిమీఁద నున్నారో తెలియదు!
కమ:- నాయనగారి కిప్పు డింకేమి పని యున్నది? – అహర్నిశలు అల్లురను వెదకుట క్రింద సరిపడుచున్నవి.
భ్రమ:- అమ్మా! యేమి చేయు మనెదవు – ఆఁడుపిల్లలం గన్నవారి యవస్థ యిప్పు డీస్థితికి వచ్చినది!
గీ. కన్య నొక్కరి కొసఁగి స-ద్గతులు గాంతు
మనుచు సంతోషపడు కాల – మంతరించి,
కట్నములు పోయఁ జాలక – కన్య నేల
కంటిమా యని వ్యథపడు – కాల మొదవె!
కమ:- అట్లే కాని ఆఁడుబిడ్డల తల్లి వ్యథకు మాత్రము అర్థములేదమ్మా ఏమందువా?
గీ. కార్య మగుదాఁక నయ్యయో! – కాకపోయె
ననుచుఁ దపియించు రేపవ – లాత్మలోన;
కార్యమగునంత బిడ్డ నె-క్కరణి విడిచి
యుండనోపుదు నని దిగు-లొందు మదిని.
కాళింది:- హుష్‌! ఊరకుండుము! అదిగో చెప్పుల చప్పుడు – నాయనగారు వచ్చుచున్నారు.
పురు:- (ఆయాసముతోఁ బ్రవేశించి) ఔరా! యేమి విపరీతకాల మాసన్న మైనది.
మ. చెడెధర్మంబు నశించెనీతి! హరియిం-చెం బూర్వమర్యాద! లం
గడిఁ గూరాకు విధాన, వేలమునఁ జొ-క్కా టోపీ పాగాల కై
వడి సంతం బశువట్లు పెండ్లికొడుకున్‌ – వ్యాపార మార్గంబునం
బడయంగావలె ద్రవ్యముం గురిసి దై-వం బైన నేఁ డిమ్మహిన్‌.
ఇంతకన్న ఘోర మింకేమున్నది?

మ. పనిలే దంట కులంబుతోఁ, బడుచు రూ-పజ్ఞాన సంపత్తితోఁ!
బని లేదంట ప్రతిష్ఠతోఁ, బరువుతో – బంధుప్రమేయంబుతోఁ!
గనకంబున్‌, మృదులాంబరంబులును శు-ల్కంబు న్సమర్పించి, లాం
ఛనముల్‌ దండిగ ముట్టఁజెప్పుటె యవ-శ్యంబంట సంబంధికిన్‌!
(అని యనుకొనుచు ముందునకు నడుచును.)

 

———–

You may also like...