పేరు (ఆంగ్లం) | Ayyala Somayajula Ganapati Sastry |
పేరు (తెలుగు) | అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి |
కలం పేరు | వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. |
తల్లిపేరు | నరసమాంబ |
తండ్రి పేరు | నరసింహశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/17/1878 |
మరణం | 7/27/1936 |
పుట్టిన ఊరు | విజయనగరం జిల్లా లోని కలవరాయి అగ్రహారం |
విద్యార్హతలు | పదియేండ్ల వయసు నండే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదము నందు అసమాన ప్రతిభ చూపినారు |
వృత్తి | ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | గణపతిముని ఉమా సహస్రము, శ్రీ రమణ గీత, శ్రీ రమణ చత్వరిమ్సత్, ఇంద్రాణి సప్తశతీ, మహా విద్యాది సూత్రావళి, గీతమాల, విశ్వమీమాంస |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కావ్యకంఠ |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (నవంబరు 17 1878 – 1936) ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. వారు పదియేండ్ల వయసు నండే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదము నందు అసమాన ప్రతిభ చూపినారు. |
అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి
అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (నవంబరు 17 1878 – 1936) ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. వారు పదియేండ్ల వయసు నండే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదము నందు అసమాన ప్రతిభ చూపినారు. వీరి యొక్క వాక్చాతుర్యము అమోఘము , సంస్కృత భాషా ప్రావీణ్యము మరియు అన్ని శాస్త్రములందును విశేష ప్రతిభ కనబరచినారు.
శ్రీకావ్య కంఠ వాసిష్ఠ గణపతి ముని రమణ మహర్షిని ఆస్తిక లోకానికి పరిచయం చేసి మహోపకారాన్ని చేశారు. వీరు కడు మేధావులు. బెంగాల్ లోని నవద్వీప నగరంలో పాండిత్య పరీక్షల కోసం జరిగే పండిత సభలో పండితులందరినీ అబ్బురపరిచే రీతిలో శ్రీకావ్యకంఠ గణపతి ముని తన ప్రతిభను చూపారు. అక్కడ ఒక వృద్ధ పండితుని చూసి ఎవరీయన అని తన పక్కన వారిని వారు అడిగారట. ‘‘అతడే పరీక్షాధికారి, ఆశుకవి, అంబికాదత్తుడు’’ అని బదులిచ్చాడట పక్కనున్న వ్యక్తి. ఇంతలో అంబికాదత్తుడే వచ్చి, ‘‘నేను ఆశుకవితా జనకుడను, గౌడుడను. నా పేరు అంబికాదత్తు’’ అని సంస్కృతంలో చెప్పగా, దానికి నాయన ఏమాత్రం తడబడకుండా, ‘‘నేను కవికులానికి అధిపతిని. అతిదక్షుడను. దాక్షిణాత్యుడను. నా పేరు గణపతి’’ .. నీవు కేవలం అంబికకు దత్తుడవు మాత్రమే. నేను సాక్షాత్తూ అంబికకు పుత్రుడను అని నాయన చేసిన చమత్కారం అంబికా దత్తుడికి కావ్యకంఠ గణపతి ముని పాండిత్య ప్రతిభ తెలియకనే తెలిసింది.. అని సంస్కృతంలోనే జవాబిచ్చారు. ఆ తరువాత ఆ సభ పెట్టిన పరీక్షలన్నిటిలోనూ కావ్యకంఠ గణపతి ముని తన ప్రతిభ చాటి, తన అసమాన ప్రతిభతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. ఆనాటి అచటి విద్వత్పరిషత్తు వారికి కావ్య కంఠ బిరుదునిచ్చి సత్కరించింది. ఇది 20.06.1900 నాడు జరిగిన సంఘటన. అలా వారు ఆ పండితుల మహాసభలోనవద్వీపంలో పండితుల సమక్షంలో పండితుల అభిమతం మేరకు 18 శ్లోకాలలో భారతగాథను ఆశువుగా చెప్పి తన అసమాన ప్రతిభను కనబరిచి ‘‘కావ్యకంఠ’’ బిరుదును పొంది కావ్యకంఠ గణపతిగా ప్రసిద్ధికెక్కారు. రమణ మహర్షి వారిని ప్రేమతో నాయనా అని పిలిచేవారు. ఇలా మన తెలుగు వారు సంస్కృత పాండిత్యములో ఎందఱో విద్వత్తు కలిగిన పండితులను తమ అసమాన ప్రజ్ఞతో రాణించారు. అలాంటి నేలన నేడు సంస్కృత భాషా ప్రావీణ్యం మృగ్యమై పోతున్నది.. మన ప్రాచీన భాషలను పునరుద్ధరించే సమయం ఆసన్నమైనది. ధర్మ దీక్ష లేకనే నేడు దేశం అనేక కష్టాల మయమగుచున్నది. సనాతన ధర్మాన్ని తిరిగి ఈ నేలన పునః ప్రతిష్టించాలి. అలా చేయాలి అంటే మనకు మన ఋషులు ప్రసాదించిన అపూర్వ వాజ్మయము అందరికీ తెలియాలి. వాజ్మయాన్ని తెలుసుకోవడం వలన మనలోని బుద్ధి వికసించి ధర్మ దీక్షా కంకణ బద్ధులం అవుతాము. సంస్కృత భాషా పాండిత్యం మన అందరికీ తప్పని సరి. అందరు తప్పక సంస్కృతం నేర్చుకునే దిశగా ప్రయత్నం చేయాలి. భారతీయతను మన సంస్కృతిని సంస్కృత భాషను కాపాడుకుందాం.
తల్లిదండ్రులు వీరు గర్భంలో ఉండగానే కలిగిన కొన్ని దివ్య నిదర్శనాల వలన గణపతి దైవాంశ సంభూతునిగా భావించి వీరికి గణపతి అని నామకరణం చేశారు. పదేళ్ళ వయసులోనే మూడు కావ్యాలు రచించి కవిత్వం చెప్పేవారు. జ్యోతిశ్య శాస్త్రంలో పట్టు సంపాదించి పంచాంగ గణనలో ఒక నూతన పథకాన్ని కూడా రచించి గురువును మించిన శిష్యుడు అని పేరుపొందారు. వీరి పదవ ఏట తల్లి మరణించగా, పన్నెండవ ఏట వివాహమైనది. వీరు భార్యను ఉద్దేశించి ‘భృంగ సందేశమ్’ అనే సరస కావ్యాన్ని మందాక్రాంత వృత్తాలలో రచించారు. పదహారు సంవత్సరాలకు కావ్య శాస్త్రేతిహాస పారంగతుడును, ఉజ్జ్వల ఆశుకవి అయిన తండ్రి నుండి మహా మంత్ర దీక్షలచే తపస్సు చేయడానికి నాసిక్, భువనేశ్వర్ దివ్య క్షేత్రాలను వెళ్ళారు. ఇరవై సంవత్సరాలకు గణపతి శాస్త్రి కవిత్వ ప్రజ్ఞలో పూర్వ కవులకు గల ప్రాభవాన్ని గడించారు. 1900లో విజిగీషతో నవద్వీప విద్వత్పరీక్షలకు వెళ్ళగా, అక్కడ సభలోని పరీక్షక వర్గం వారు ఇతని కవిత్వ ప్రజ్ఞా ప్రదర్శనను చూసి ‘కావ్యకంఠ‘ బిరుదుతో అభినందించారు. 1903లో మద్రాసులో నారాయణ సుదర్శనునితో పోటీలో ఆరు నిమిషాలలో కావ్యకంఠుడు ఇరవై శ్లోకాలను రచించి బంగారు కడియాన్ని బహుమానంగా పొందారు. 1902లో అరుణాచల క్షేత్రం వెళ్ళినప్పుడు వీరు శివుని సహస్ర శ్లోకాలతో స్తుతించి అక్కడ అధ్యాపకునిగా కొంతకాలం పనిచేసారు. తరువాత వేలూరులో తెలుగు పండితునిగా దాదాపు నాలుగు సంవత్సరాలు నిర్వర్తించారు.
కుటుంబ జీవితాన్ని గడుపుతూ, బాధ్యతలను నిర్వర్తిస్తూ తపస్సు చేసుకోవడం ద్వారా మోక్షప్రాప్తి సాధించవచ్చని ఋషులు చెప్పిన దానిని గట్టిగా విశ్వసించారు. భార్య అనుమతితో సంవత్సరంలో ఆరునెలల కాలం దేశంలోని వివిధ ఆలయాలలో ఏకాంత ప్రదేశంలో తపస్సు చేస్తుండేవారు. నవద్వీపంలో పండితుల సమక్షంలో వారి అభిమతం మేరకు 18 శ్లోకాలలో భారతగాథను ఆశువుగా చెప్పి ‘కావ్యకంఠ’ బిరుదు పొందారు. అరుణాచలంలో ఉన్న బ్రాహ్మణస్వామిని రమణమహర్షిగా మార్చారు.
చివరకు 1907లో దాస్య వృత్తిని వదలి అరుణాచలం వెళ్ళారు. అక్కడ అచంచల తపోదీక్షతో చిరకాలం ఉండి మునిగా రమణ మహర్షి ని దర్శించి తపస్సు గురించి అతనికి అనుభవ పూర్వక వాక్యాలు ఉపదేశించారు. తరువాత ఈశ్వరిని స్తుతిస్తూ ‘ఉమా సహస్ర’ అనే గ్రంథాన్ని రచించారు. ఋగ్వేదం నుండి విదితమైన భారత చరిత్రాంశాలను నిరూపించు ‘భారత విమర్శ’ అనే గ్రంథం ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు మించిన సత్యదర్శిని వంటిది. డెబ్బైఐదు వరకు ఉన్న వీరి గ్రంథాలలో కొన్ని మాత్రమే ముద్రించబడ్డాయి. వీరు 1924లో కాంగ్రెసులో చేరి, తమిళనాడు కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులయ్యారు. సంఘ సంక్షేమం కోసం అస్పృశ్యతా నివారణను సమర్ధించి, దానిని శాస్త్రీయ దృష్టితో పోషించడానికి ‘పంచ జన చర్చ’ అనే వ్యాసాన్ని రచించారు.
1923 డిసెంబరులో కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభలో స్త్రీల హక్కుల కోసం ఏర్పాటు చేసిన సభలో… పురుషులతో బాటు స్త్రీలకు సమానహక్కు ఉందని వేదశాస్త్ర ప్రమాణాలతో నిరూపించారు. 1924లో ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బెల్గాంసభలో … అస్పృశ్యత నివారణ శాస్త్రసమ్మతమని ప్రసంగించారు. హైదరాబాదులో ఆది హిందూసంఘం (హరిజనులు) వారు పల్లకిలో ఊరేగించి, సత్కరించి… ‘ముని’ బిరుదునిచ్చారు. ఒకపక్క తపస్సు ద్వారా అమ్మవారి దర్శనం, వివిధ రచనలు చేస్తూనే, మరోపక్క దేశోద్ధరణకు పూనుకున్నారు.భారతీయుల పట్ల బ్రిటిష్‌వారి అమానుష ప్రవర్తనకు ఎంతో బాధపడిన నరసింహశాస్త్రి ప్రజలు ధర్మాలను ఆచరించకపోవడం వల్లే దేశానికి ఈ దుర్గతి పట్టిందని విచారించారు. సనాతన ధర్మాన్ని నెలకొల్పగల శక్తి సామర్థ్యాలుగల కుమారుడిని అనుగ్రహించమని తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థించారు. వీరు ఆనేక ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు అయినను ఇంకా సంతృప్తి పడక – ఈశ్వర ప్రేరణమున, అరుణాచలము (తిరువన్నామలై) లో, 18-11-1907 న బ్రాహ్మణ స్వామిని (వేంకటరామన్) కలిసి ‘……. తపస్సాధన స్వరూపము కొఱకు అర్ధించుచు మిమ్ములను శరణువేడుచున్నాను…. ‘ అని తమిళ భాషలో అడిగిరి. అప్పటిదాకా పెక్కు సంవత్సరములు మౌనముగా వున్న బ్రాహ్మణ స్వామి:
- “‘నేను, నే’ ననునది యెచ్చటనుండి వచ్చుచున్నదో విచారించినయెడల, అది ఉదయించు స్థలమందే లీనమగును. అదియే తపస్సు.
- జపము చేయునప్పుడు మంత్రనాద మెచ్చటనుండి యుదయించు చున్నదని పరికించినచొ, అది యుధ్భవించు స్థలమందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము.” అని మితాక్షరములతొ తమ ఉపదేశవాణిని తమిళ భాషలో వెలువడిరి.
గణపతిముని వేంకటరామన్ అను నామమమును ‘రమణ’ అని మార్చి, ‘భగవాన్ శ్రీ రమణ మహర్షి‘ అను పూర్ణ నామమును సమకూర్చి, ‘శ్రీ రమణపంచక’ మను శ్లోక రత్నములను అప్పటికప్పుడు కూర్చి రమణుని హస్తమందుంచి ‘మీరిది స్వీకరించి నన్ను ఆశిర్వదింతురు గాక’ అని పలికెను. ‘సరే, నాయనా’ యని రమణుడు దానిని స్వీకరించెను. అప్పటినుండి బ్రాహ్మణ స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి గాను, కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని నాయన గాను పిలువబడుచుండిరి. జగత్ప్రసిద్దులయిరి. తదుపరి గణపతి ముని భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుగ్రహము వలన చూత గుహలో కపాల భేద సిద్ధి పొందిరి.
నాయన కలకత్తా కి 24-11-34 న వచ్చి శ్రీ గుంటూరు లక్ష్మికాంతము గారి ఇంట్లో బస చేసితిరి. వీరి ఆదరాభిమానములకు సంతసించి, నాయన షుమారు ఒకటిన్నర సంవత్సరములు కలకత్తా లో వీరి దగ్గర వుండిరి. ఆ సమయములో ప్రతిరోజూ నాయన వీరికి అనేక ముఖ్య విషయములను బోధించెడివారు.. ముఖ్యముగా లక్ష్మికాంతము గారి కోరిక మేర నాయన గారు స్వయముగా తమ జీవిత చరిత్ర, ఉమా సహస్రము నకు అర్ధము మరియు వ్యాఖ్యానము,ఇంద్రాణి సప్తశతీ యొక్క అర్ధము మరియు వ్యాఖ్యానము, విశ్వమీమాంస వివరణము, మొదలగు విషయములు బోధించిరి. గణపతి ముని గారు (వీరనారి సత్యప్రభ అను కథను) ‘పూర్ణ’ అని సంస్కృత భాష యందు వ్రాసి, ‘పూర్ణ’ అని తెలుగులో వ్రాసిరి. (ఈ కథను భారతి పత్రికలో అచ్చు వేసిరి).
గణపతిముని నిర్యాణము తరువాత గుంటూరు లక్ష్మికాంతము గారు తరచూ భగవాన్ శ్రీ రమణ మహర్షి యొద్దకు వచ్చుచుండెడి వారు.
భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయముగా లక్ష్మికాంతమును ఆశీర్వదించి, పలు వ్యక్తులను కలిసి నిజ నిర్ధాణము చేసుకొని, ఈ జీవిత చరిత్రను వ్రాయమని ఆదేశించిరి. ఈ జీవిత చరిత్ర మొదట 1958 లోను, తదుపరి 1964,1998,2001 మరియు 2013 ప్రచురింపబడినది.
———–