ఓలేటి వేంకటరామశాస్త్రి (Oleti Venkataramasastry)

Share
పేరు (ఆంగ్లం)Oleti Venkataramasastry
పేరు (తెలుగు)ఓలేటి వేంకటరామశాస్త్రి
కలం పేరు
తల్లిపేరుకామేశ్వరమ్మ
తండ్రి పేరునారాయణశాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ11/15/1853
మరణం12/3/1939
పుట్టిన ఊరుతూర్పుగోదావరి జిల్లా, పల్లిపాలెం
విద్యార్హతలు
వృత్తిచర్ల నారాయణశాస్త్రి వద్ద సాహిత్యము, రామడుగుల వీరేశ్వరశాస్త్రి వద్ద శబ్దశాస్త్రము, విశ్వపతిశాస్త్రి వద్ద న్యాయశాస్త్రము నేర్చుకున్నారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునూటపదియార్లు
ఆంధ్ర కథా సరిత్సాగరము (6లంబకములు)

వేదుల రామకృష్ణశాస్త్రి తో కలిసి జంటగా రచించినవి
శతఘ్ని, రామకృష్ణ మహాభారతము, అట్టహాసము, విశ్వగుణాదర్శము (అనువాదం),
ఔచిత్య విచారచర్చ (అనువాదం), కవి కంఠాభరణము (అనువాదం), ఇందిరాదేవి (నవల), సుభద్ర (నవల), శకుంతల (నవల), దమయంతి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. తన మేనత్త కుమారుడైన వేదుల రామకృష్ణశాస్త్రితో కలిసి వేంకట రామకృష్ణ కవులు పేరుతో జంటగా కవిత్వం చెప్పాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఓలేటి వేంకటరామశాస్త్రి
సంగ్రహ నమూనా రచనఆంధ్రభోజుని యాస్థాన విద్వత్కవులగు వేంకట రామకృష్ణ కవుల కవితాప్రతిభ, విమర్శనశక్తి తెలుగువారికి దెలిసియే యుండును. 1909 సంవత్సరమున రామకృష్ణులు పిఠాపురసంస్థానమున బ్రవేశించిరి. నాటికి వేంకటరామశాస్త్రిగారి వయస్సు ఇరువదియాఱు వత్సరములకు మించదు. రామకృష్ణశాస్త్రిగారికి బదునెనిమిది దేండ్లు దాటినవి

ఓలేటి వేంకటరామశాస్త్రి

ఆంధ్రభోజుని యాస్థాన విద్వత్కవులగు వేంకట రామకృష్ణ కవుల కవితాప్రతిభ, విమర్శనశక్తి తెలుగువారికి దెలిసియే యుండును. 1909 సంవత్సరమున రామకృష్ణులు పిఠాపురసంస్థానమున బ్రవేశించిరి. నాటికి వేంకటరామశాస్త్రిగారి వయస్సు ఇరువదియాఱు వత్సరములకు మించదు. రామకృష్ణశాస్త్రిగారికి బదునెనిమిది దేండ్లు దాటినవి. సంస్థాన ప్రభువులు శ్రీ రావు వేంకట కుమార మహిపతి సూర్యరాయేంద్రు వీ కవకవుల బుద్ధి చాకచక్యమునకు గవితాధోరణికి నానందపడి యవధానవిశేషముల గాంచుట కనుమతించిరి. ఏ సుముహూర్తమున నీ జంటకవులు ప్రభువుకంట బడిరో యపుడే శ్రీవారి యనుగ్రహాంకూరము రామకృష్ణుల యభ్యుదయ క్షేత్రమున బడినది. దిగ్దంతులవంటి పండితులమ్రోల నా మహాస్థానమంటపమున నత్యద్భుతావధానము సేయునపుడు రామకృష్ణుల లీలలు పలువుర కానందాశ్చర్యములు కలిగించినవి. మహీనాథు డవధానానంతరము మూడు నూటపదియార్లు పట్టుసాలువలతో బహూకరించి యా కవులను దమ సంస్థానిలో నుండగోరెను.

పిమ్మట నత్యద్భుత శతావధానము, శతవిధానము [గంటకు నూఱుపద్యములు చెప్పుట] శతప్రాసము [ఒకేప్రాసముమీద నూఱు పాదములు గంటలో జెప్పుట] అష్టావధానము మున్నగువానిచే మన కవులు మహారాజు చిత్తమును మఱింత రంజింపజేసిరి. శతప్రాసము చెప్పుసందర్భమున “…ఇట్లిరవుగ గొన్నిపాదములనే మును గబ్బము తాత సెప్ప న, బ్బురపడి తత్సభాస్థలిని బోరన గద్దియ డిగ్గి గండ పెం, డెరమును గృష్ణరాయుడు తొడ్గె న్నృపపుంగువ!…” అని యభిప్రాయగర్భముగా నెట్లుచెప్పిరో పరికింపుడు.

వేంకటరామకృష్ణులు పిఠాపురసంస్థానమునకు బోవుచున్నటు లింటియొద్ద బెద్దవారి కేరికిని జెప్పనేలేదు. పట్టుసాలువలు కప్పుకొని సింగపు బిల్లలవలె వచ్చుచున్న యా యువకవుల గని తలిదండ్రు లానందభరితులైరి. గ్రామస్థు లాశ్చర్యకలితులైరి. ఈ జంటలో దొంటికవి ఓలేటి వేంకటరామశాస్త్రి, ద్వితీయుడు వేదుల రామకృష్ణశాస్త్రి. వీరు మేనత్త మేనమామ బిడ్డలు. వీరిని స్మరించునపుడు నంది మల్లయ్య, ఘంట సింగన జ్ఞప్తికి వత్తురు. జంటకవులలో దిరుపతి వేంకట కవులపేరు లెటులు కుదిరినవో రామ కృష్ణ కవుల నామము లట్లు సరిపడినవి. ఈ కవికోకిల యుగళము పిఠాపుర ప్రభుని మ్రోల మధురకంఠము లెత్తియిట్లు పాడినది. భోజనమాను నర్థి సురభూజుని జూచితిరే? పిఠాపురీ

రాజు నతండు మిమ్ము గవిరాజుల నెట్లు బహూకరించె? సం

చోజను గోరువారికి సదుత్తర మిచ్చి తదాసనంబులం

దేజరిలంగ జేసెడుగతి న్మము నీవును గారవింపుమా !

    *            *            *

అక్షరలక్ష లిచ్చునృపు డట్టి కవీంద్రులు కానరా రటం

చీ క్షితివారలెల్ల వచియించెడు నుద్దుల నాలకింతె హ

ర్యక్షసదృక్ష ! నీవును దిరంబుగ నేమును గక్షగట్టి ప్ర

త్యక్షము సేయ బూనెదమె ? తత్సములం గవుల న్న రేంద్రులన్.

    *           *            *

ధారణతప్పరాదు, కవితారసమాధురి పోవరా, దలం

కారము లేగరాదు, కనగా నవశబ్దము లుండరాదు వా

గ్ధోరణి యాగరాదు తమతోడ బ్రగల్భములంట గాని, యె

వ్వారికినైన నిట్లు నొడువంగలవార మనంగ జెల్లునే?

వీరు పిఠాపుర సంస్థానమున బ్రవేశించిన వెనువెంటనే సుప్రసిద్ధులైన తిరుపతి వేంకటకవులతో వాగ్యుద్ధము తటస్థించినది. రామకృష్ణకవులు వయసున బసివారయ్యును నా కవుల కృతులలోని దోసములు బయట బెట్టి ‘శతఘ్ని’ యను ఖండన గ్రంథము ప్రకటించిరి. ‘శతఘ్ని’ శక్తి నాడు పెద్దపండితులను గూడ దల లూపించినది. ఈ సాహిత్య సమరముననే రామకృష్ణ భారతము, పాశుపతము, అట్టహాసము, శృంగభంగము, కోకిలకాకము మున్నుగా నెన్నో రచనలు వెలువడినవి. ఈ వివాదము తొలుత జక్కని కృతివిమర్శనములతో నారంభమై క్రమక్రమముగా శ్రుతి మించి వ్యక్తిదూషణములకు బాలుపడి ముదిరినది. ఏది యెటులయిన, నాటి యీవివాదము సాహిత్యజిజాస హెచ్చించి ముచ్చటగా సాగినది. ఈ వాక్సమరమున దేశము లోని పండిత కవులెందఱో కలుగ జేసికొని పైకి వచ్చిరి. ఇది సారస్వత చరిత్రలో మఱవరాని సరసఘట్టము ఈ వివాదారంభమున ‘కవిత’ యను మాసపత్రిక రామకృష్ణులు నెలకొలిపి నడపిరి. ఈ పత్త్రిక తొమ్మిది పదియేం డ్లవిచ్ఛిన్నముగా సాగి యాగినది. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారికి, వేంకటరామశాస్త్రి గారికి గల గురు శిష్య సంబంధమును బురస్కరించుకొని యీ వివాదము ప్రారంభమైనది.

ఎట్టొ చదివితి మూన్నాళ్ళ పట్టపవలు

పట్టుమని రెండుముక్కలు పలుకకున్న

దిరుగ డికనెన్ని చెప్పిన గురుడ ననుచు

దగులు కొన్నాడు నిన్ను సైతానులాగు

రామకృష్ణ మహాభారతము లోని యీపద్యము వేదుల రామకృష్ణశాస్త్రి ఓలేటి వేంకట రామశాస్త్రిని గుఱించి చెప్పినది. ఈ పద్యములో యావద్విషయము గొప్పగా సరిస్ఫురిత మగుచున్నది. శ్రీ చర్ల నారాయణశాస్త్రిగారు రామకృష్ణుల సాహిత్య గురువులు. రామడుగుల వీరేశ్వరశాస్త్రిగారు వ్యాకరణ గురువులు విశ్వపతిశాస్త్రిగారు న్యాయశాస్త్ర గురువులు.

దేవులపల్లి సోదరకవుల తరువాత వీరు పిఠాపుర సంస్థాన కవులై పేరొందిరి. మొత్తము రామకృష్ణకవుల కృతులు ముప్పదివఱకున్నవి. శ్లేషయమకచక్రవర్తి వేంకటాధ్వరి రచనము నాంధ్రీకరించుట యేటి కెదురీదుట. ఈతని రచనలో యనుక భేదమో శ్లేషాలంకార భేదమో లేని పద్యములు మిక్కిలితక్కువ. అట్టివిశ్వగుణాదర్శమున కాదర్శప్రాయమగు నాంధ్రీకృతి గావించిన రామకృష్ణకవులు ప్రశంసనీయులు. తెనుగు మధ్యన కొకచోట మూళాను వాదములు మూదలింతును. నిర్వృత్తాధ్వరకృత్య ఋత్విజ మహాతీర్ణాపగో నావికం

యుద్ధార్తం నుభటం చ సిద్ధవిజయో వోడార మాప్తస్థల:

వృద్ధం వార వధూజనంచ కితవో నిర్విష్ట తద్యౌవనో

ధ్వస్తాతంకచయ శ్చికిత్సక మపి ద్వేష్టి ప్రదేయార్థినం.

అనబృథస్నానంబు నాచరించిన సోమ

యాజికి ఋత్విజుడన్న నలుక

యేరంతయును దాటి తీరమ్ము జేరిన

పాంథునకు నరంగుపై జిరాకు

విజయమ్ము గైకొని నిజపురమ్మున కేగు

నవనీపతికి బంటునం దసూయ

యిష్ట దేశమ్మున కేగిన పిదప స్వా

మికి యాసవాహకుమీద వినుపు

యౌవన మ్మంతయును జూఱలాడినట్టి

కితవునకు వారసతి యెడ గేరడంబు

వ్యాధి కుదిరిన వానికి వైద్యుపట్ల

వెగటు తా మీయవలసిన విత్త మడుగ.

సంస్కృతమున క్షేమేంద్రుడు రచించిన ఔచిత్య విచారచర్చ, కవి కంఠాభరణము, నువృత్తతిలకము వీరు తెనుగుపఱిచిరి. ఇందిరాదేవి, సుభద్ర, శకుంతల, దమయంతి మున్నగునవలలు వీరివి చదువదగినవి. వీరి యుత్తర రామచరత్రాంధ్రీకరణము నాలు గంకములు మాత్రము వెలువడినవి. ఇవిగాక, యీజంటకవులు కవితా పత్త్రికా మూలమున నెన్నో ప్రాచీనార్వాచీనకృతులు వెలువరించిరి. వానిలో మత్స్యపురాణము, పరమయోగివిలాసము, మైరావణచరిత్ర, ఆధ్యాత్మ రామాయణము, చంపూ భారతము, భారతఫక్కి, ప్రబోధ చంద్రోదయము, పరాశరస్మృతి ముఖ్యగ్రంథములు.

38 రామకృష్ణకవులు సారస్వతములో గ్రొత్త క్రొత్తత్రోవలు తీయునుద్దేశము గలవారు. కవిత్వములో సంస్కృతిని వీరు వలచియున్నారు. ‘ఆంధ్రపత్రిక’ కాలయుక్తి సంవత్సరాది సంచికలో వీరు “ఆంధ్రకవుల అపరాధములు” అను శీర్షికతో గొన్ని పద్యములు ప్రకటించిరి. పరిహాస గర్భముగా బ్రాచీనకవుల యపరాధము లందు వర్ణింపబడినవి. పద్యములు మొత్తము ముప్పదియేకాని తెలుగుదేశమున గొప్ప యలజడి రేపినవి. కొన్ని యుదాహరించుట యవసరము. రచనా చమత్ర్కియకు మనము మెచ్చుకోవలయునుగదా!

గీ. ఆంధ్ర లోకోపకారమ్ము నాచరింప

భారతమ్మును నన్నయభట్టు తెలుగు

జేయుచున్నాడు సరియె; బడాయిగాక

తొలుత సంస్కృతపద్య మెందులకు జెపుడి!

గీ. పామరుడువోలె దిక్కనసోమయాజి

వెఱచి తాంధ్రీకరింప విడిచినట్టి

భారతమ్మున వ్రేల్వెట్ట బట్టిగాని

యెఱ్ఱప్రెగ్గడ బండార మెవ రెఱుగరు?

గీ. అచ్చ తెనుగు పదంబుల నిచ్చకొలది

బుచ్చి తలతిక్క యంవయంబులను బెట్టి

పాడుచేసెను నన్నయభట్టుదారి

యుభయకవి మిత్రులష! తిక్కయొజ్జగారు.

గీ. రావు సర్వజ్ఞసింహ భూరమణుతోడ

బావ శ్రీనాథ కవిసార్వభౌము డేమొ

చెప్పి తత్కరుణాపాత్రు జేయుపిదప

భోగినీదండకము నాడె బోతరాజు. గీ. ఎఱచి తినువార లేనియు నెమ్ముమెడకు

గట్టుకొందురె? శ్రీనాథకవివరేణ్య!

సానికూతుల తగుల మీశానునకును

బలికితివి నీస్వభావము బయలుగాను.

గీ. ప్రాలుమాలికచే దాళపత్త్రపుస్త

కాటపవులనర్థపుందెరువాట్లు గొట్టి

కొఱతబడునని కుకవిని గొసరితిట్టి

పెద్దనయొనర్చినట్టి తప్పిదము నిదియె.

గీ. తనకు నంత:పురమునకు మనసులందు

నెడమడుగు పుట్ట ముద్దులొల్కె నుడులను

బారిజాతాపహరణంబు బల్కి మాన్చి

నట్టి తిమ్మనఋణము రా జెట్టుతీర్చు?

గీ. కృష్ణరాయడు చేసిన విష్ణు చిత్త

కావ్యమందలి భావము శ్రావ్యమెయగు

నెన్నిమార్లు పఠించిన నెఱుకపడని

వట్టి పాషాణపాక మెవ్వండుసదువు?

గీ. శ్లేషకావ్యంబు జేసి విశేషయశము

గనిన పింగళ సూరన గడుసువాడె

కాని శుభమస్తని యదేమి గారుడంబు

దెలుగు జేసినవాడు వైదికుని పగిది.

గీ. తగని గర్వంబునంజేసి తన్ను దానె

పొగడుకొనువా డటంచు జెప్పుదురుగాక

నాలిపలుకులు రావు తెనాలి రామ

కృష్ణ కవినోట బంగారు గిలకదీట. గీ. ఒకడు స్వప్నప్రకారము నుగ్గడింప

నెల్లవారలకు గలవె తెల్లవార్లు

నవ్వుదురను తలంపు లే దెవ్వరికిని

పేరుకొననేమిటికి నట్టి బీదకవుల?

గీ. పూర్వకవిరాజులకు నిది భూషణంబొ

దూషణమొ యనుకొనుడు మీతోచినట్లు

నన్నయాదుల పట్ల మాకన్న గూర్మి

గలుగువారలు లేరు జగమ్మునందు.

ఈ యపరాధ పద్యములపై క్షమాపణము చెప్పవలసినదని ప్రతి పట్టనమున సభలు గావించి తీర్మానములు చేయుచుండిరి. అపు డీ కవకవులు కాళ్లు విరగ ద్రొక్కుకొను తెలుగు సోదరుల గని నవ్వుకొనుచు ‘దేశభక్తి’ యను నొకవ్యాఖ్య వ్రాసి “మేము చేసినది నిందాస్తుతిగాని కేవలనిందగాదు. ఈ విధముగా మేము ప్రాక్తనకవులను గూర్చి వ్రాయుట యాధునికులకు బ్రాచీన కవిసత్తములపై నెంతగా భక్తివిశ్వాసములు కలవో పరీక్షించుటకే” అని సమాధానము చెప్పిరి.

ఆంధ్ర రచయితలు నుండి-

———–

You may also like...