సురవరం ప్రతాపరెడ్డి (Suravaram Pratapaareddy)

Share
పేరు (ఆంగ్లం)Suravaram Pratapaareddy
పేరు (తెలుగు)సురవరం ప్రతాపరెడ్డి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ5/28/1896
మరణం8/25/1953
పుట్టిన ఊరుమహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానం ఇటిక్యాలపాడు
విద్యార్హతలుమద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు.
వృత్తికొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు .హైదరాబాద్ రాష్ట్రం శాసన సభ్యులు-వనపర్తి,(1952 పత్రికా సంపాదకుడు పరిశోధకుడు పండితుడు రచయిత ప్రేరకుడు క్రియాశీల ఉద్యమకారుడు ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడు(1944)
తెలిసిన ఇతర భాషలుతెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు.
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుగోల్కొండ కవుల సంచిక, ఆంధ్రుల సాంఘిక చరిత్ర , భక్త తుకారాం, ఉచ్ఛల విషాదము అనే నాటకాలు ,
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ఇతర వివరాలు1926లో తెలంగాణలో తెలుగు భాషా వికాసానికి దోహదపడే విధంగా ‘గోల్కొండ పత్రిక’ను తీసుకొచ్చారు. అప్పుడు రాజభాషగా,పాలనా భాషగా,వ్యవహారభాషగా ఉర్దూ ఉన్నది.అప్పటి రాజభాష ఉర్దూ భాషలోనే మీజాన్, జామీన్, రయ్యత్ పత్రికలు వచ్చేవి.అప్పటికి రెండు తెలుగు వార పత్రికలు మాత్రమే ‘నీలగిరి’నల్లగొండ జిల్లా నుండి,‘తెలుగు’ వరంగల్ జిల్లా నుంచి వెలువడుతుండేవి.
1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ‘ఆంధ్ర మహాసభ’కు అధ్యక్షత వహించారు.ఆంధ్ర మహాసభ కార్యాకలాపాలన్ని తెలుగులోనే జరగాలంటూ తీర్మానం చేయించారు.
తెలంగాణలో కవులే లేరన్న ముడంబ వెంకట రాఘవాచార్యుల ప్రశ్నకు సమాధానంగా ‘గోల్కొండ పత్రిక’ ద్వారా 354 మంది తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాల ను సేకరించి ‘గోల్కొండ కవుల సంచిక’ పేరుతో వెలువరించారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసురవరం ప్రతాపరెడ్డి
గ్యారా కద్దూ బారా కోత్వాల్
సంగ్రహ నమూనా రచనఒకనాడు ఒక పల్లెకాపు 11 సొరకాయాలను కంబట్లో వేసుకుని ఒక గ్రామానికి అమ్ముకొనేదానికి వెళ్ళినాడు.గ్రామంలో అమ్మలక్కలు పదిమంది మూగి బేరం చేస్తూ వున్నారు.అంతలో మాలీపటేల్ వేంచేసినాడు.”ఒరేయ్ “ఈడ కూర్చోమని నీకెవరు సెలవిచ్చినారు.మంచి మాటలతో ఒక కాయ ఇచ్చిపో’’ అంటూ తానే ఒక పెద్దకాయను లాగుకొని పోయినాడు.రోకటిపోట్టనట్లుగా పోలీసు పటేలు హాజరైనాడు.’’పట్టుకొని రారా వాణ్ణీ . ముసఫీర్ల లెక్కలో వాడి పేరుని రాయవలసి ఉంది “ అని గర్జించినాడు.

సురవరం ప్రతాపరెడ్డి

గ్యారా కద్దూ బారా కోత్వాల్

ఒకనాడు ఒక పల్లెకాపు 11 సొరకాయాలను కంబట్లో వేసుకుని ఒక గ్రామానికి అమ్ముకొనేదానికి వెళ్ళినాడు.గ్రామంలో అమ్మలక్కలు పదిమంది మూగి బేరం చేస్తూ వున్నారు.అంతలో మాలీపటేల్ వేంచేసినాడు.”ఒరేయ్ “ఈడ కూర్చోమని నీకెవరు సెలవిచ్చినారు.మంచి మాటలతో ఒక కాయ ఇచ్చిపో’’ అంటూ తానే ఒక పెద్దకాయను లాగుకొని పోయినాడు.రోకటిపోట్టనట్లుగా పోలీసు పటేలు హాజరైనాడు.’’పట్టుకొని రారా వాణ్ణీ . ముసఫీర్ల లెక్కలో వాడి పేరుని రాయవలసి ఉంది “ అని గర్జించినాడు. తలారీ వచ్చి తన పాళి ఒక కాయ , పటేల్ పాలిట ఒక కాయ లాగు కొని పోయినాడు . కొంత సేపటికి పెద్ద తలారీ వచ్చినాడు . “మొన్న నీ వంటి వాడే వచ్చెను , పొద్దు మునిగినప్పుడు కూరగాయలు అమ్మినట్లు అమ్మి రాత్రి కోమట్లోల్ల ఇంట్లో కన్నం వేసిండు . పద , చావిట్లో నిన్ను కట్టేస్తాను “ అంటూ తాను న్ను ఒక కాయ చేత బట్టుకున్నాడు . “అయ్యా ! మారాజా ! నేను దొంగను కాను , దొరను కాను , పొరుగూరు వాణ్ణీ , ఎల్లప్పటికినీ వచ్చి పోయే వాణ్ణీ , ఇప్పటికే మూడు కాయలు ఎరిగిపోయినవి . మళ్లీ నీవు ఎక్కడి ఉంది ఊదిపోయినవి ?” అని కాపు వాడు మొరపెట్టుకున్నాడు . అదే కాయతో వానీ నెత్తిన పొడిచి కాయతో చక్కా పోయినాడు పెద్ద తలారీ . ఈ విధంగా పూజారీ , పురోహితుడు , కమ్మరి , వడ్ల మొదలైన పదకొండు మంది అయ్యగాండ్లు ఒకరి వెనుక ఒకరు వచ్చి కాయలన్నీ లాగుకుని పోయినారు . కాపు వాడు ఎడ్చుకొంటూ గొంగడి దులుపుకొని లేస్తున్నాడు . చీకట్లోనే చీనికి పోయినట్లి కరణం అయ్యా అప్పుడే తనకి ప్రత్యక్ష మయ్యాడు .” ఏమీరా ఏడుస్తున్నావు ? నిన్ను ఎవరేమన్నారు నాకు చెప్పు . నేను ఈ ఊరి కరణాన్ని , తప్పు చేసినొనికి శిక్ష యిప్పిస్తాను “ అని అన్నాడు . న్యాయం విచారించే ప్రభువు ఒక్కడైనా ఈ ఊరి లో ఉన్నాడురా నారాయణ ! అని అనుకుని కాపు వాడు తన పదకొండు సొరకాయలు మాయమైన విధమంతా వినిపించి “అయ్యా , కరణమయ్యా , నీవే నారాయణ మూర్తివి నన్ను ఎట్లన్న గడ్డ కేయండి “ అని గొంగడి ఆయన కాళ్ల మీద వేసి కాళ్లు పట్టుకున్నాడు . కరణం ఒక్క తనను ఝూదించి తనని కంబలి లాగి చంక బెట్టుకుని ఇట్లన్నాడు .”అరె లుచ్చా ! అందరికీ వంతు సొరకాయ ఇచ్చి నా వంతు తప్పించినావా ? ఆ ఓనమాలురాని మాలీ పాటలు నీకు ఎక్కువైనాడా ? తే ! నా వంతు సొరకాయ . అదిచ్చి యీ గొంగడి తీసుకపో “ అని గ్రుడ్లెర్ర చేసుకొని కంబళి తన చంకబెట్టుకుని తన ఇంటికి పోయినాడు .
కాపువాడు ఎగాదిగా చూచినాడు . “ నీవూ ఇంతేనా ? ఈ ఊరంతా ఇంతే ! ఏందేశం యిది పాడు దేశం . ఇంక నా వంటి దిక్కులేని వారు బదికేదేట్లా ?” అని గొణుగుతూ పట్వారి వెంట కొంత దూరం దీనంగా ప్రాధేయపడుతూ వెళ్ళినాడు . “ఒరేయి ! ఒక్క అడుగు ముందుకు వేస్తే నే తలకాయ పగుల తంతా (జాగ్రత్త ) ఖబర్దార్ ?” అన్నాడు పట్వారి . కాపునాడు దిక్కుతోచకుండా నిలిచిపోయినాడు . చిన్నపిల్లవాని వలె కొంత సేపు ఏడ్చినాడు . ఒకరిద్దరు ఆడవారు వాణ్ణి చూచి “పొ ఇట్లాంటి మారాజులే . ఇంకోమారు రావద్దు “ అని బుద్ది చెప్పినారు . కాపువాడు దీర్ఘాలోచన చేస్తూ ఇంటి బాట పట్టినాడు . “థూ , పుట్టితే పాటలు పట్వారి అయి పుట్టలె లేకుంటే తలారిగా అయినా పుట్టాలె . ఈ బదుకు బతికినా వకటే చచ్చినా ఒకటే … కాయలుపోతే పోయెగాని గొంగిడి కూడా పోయింది . అందరికంటే ఆ కర్ణమోడు మరీ చెడ్డవాడు . అందుకోసరమే కాటికిపోయినా కర్ణం పీడ తప్పదన్నారు పెద్దలు … దీనికి బదలా తీయకుంటే నేను మనిషినా ? అయితే బీదోన్ని ఏమి చేయగలను ? ఆ తలారికి చేరెడు చేనన్నాలేదు . నాకు చేనుంది . పెండ్లాము పైన వంకివుంది . ఒకెద్దుంది. తలారి కంటే తక్కువనా నేను ?…..దేవునికైనా దెబ్బే గురువు . నేనున్నా ఏదో మొండి తొండి చేస్తా …..”ఇట్లా ఆలోచనా పరంపరలో మునిగి నడుస్తున్నాడు . తన మోట బావిని సమీపించినాడు . బావిగడ్డపై కూర్చున్నాడు . ఇంకా దీర్ఘాలోచనలో ఉన్నాడు . తటాలున మెరుపు మెరిసినట్లా వాణి తలలో వక ఆలోచన తళుక్కు మంటు ప్రవేశించింది . చటుక్కున లేచినాడు . ఊళ్లోకి పోయినాడు . చక్కగా పెండ్లాం వద్దకు వెళ్లి “ఒసేయి ! ఈ వాంకి ఇట్లాతే ,ఇయ్యమంటే ! నీకేం పరవాలేదులే . మళ్లీ వుగాదినాటికి ఒకటికి దాన్ని 200 రూపాయలకు అమ్మినాడు . పైకం తీసుకుని 10 మైళ్ళ దూరంలో ఉండే పట్నం చేరుకున్నాడు . షేర్వానీలు , లాగులు ,మోజాలు , పగడీ , నడుము పట్టి , బిల్లులు మొదలైన పరికరాలు సిద్ధము చేసుకొన్నాడు . నలుగురు అరబ్బు జవానులను జత చేసుకున్నాడు . వారికి బిల్లలు తగిలించాడు . తానున్నూ బాగా వేషం వేసుకొన్నాడు . ఒక బగ్గీని కిరాయకు మాట్లాడుకొన్నాడు .
రెండామడల దూరంతో ఒక పెద్ద బస్తీ ఉండింది . అది నాలుగు బాటలు కలిసే స్థలం . గొప్ప వ్యాపారి పేట , అధికారులు , మంత్రి , నవాబు కూడా ఆ మార్గంగా షికారుకు పొయ్యే స్థలం . ఆ గ్రామంలో మన కాపు దిగినాడు . ఊరబావిగట్టున ఒక పెద్ద మర్రి మానుంది . దాని కింద మేజు కుర్చీలు వేయించినాడు . జనానులను బావిపై పహిరా ఎక్కించినాడు . ప్రొద్దునే ఊరులోని ఆడవారు నీటికివస్తే ఆ జవానులు “ఖబర్దార్ , కడవకొక పైసాయిచ్చి నీళ్లు తీసుకోండి “ అని బెదరించినారు . పటేలు ఫర్మాన్ “ అని ఉర్దూ ముద్రలతో నుండే ఫర్మాను చూపించినాడు కాపు . ఉండవచ్చునని గ్రామాధికారులూ రాకైనారు .
దినమున్నూ పైకం బాగా వసూలు కాబట్టింది . మొదట దినం 20 రూపాయల వరకు వసూలైంది . క్రమేణ ఆదాయం ఎక్కువైంది . “మర్రిమాన్ పరగణా సుంకం “చుట్టూ రెండా మద వరకూ ప్రసిద్ధి అయిపొయింది . ఇట్లా వారాలు , నెలలు సంవత్సరాలు గడిచినవి . ఒకనాడు సుబేదారు దౌరా వచ్చి గుడారాలు వేయించినాడు . అతని నౌకరు నీటికి పోతే “పైసాలావ్ “ అన్నారు జనానులు . వారు ఉత్త కడవలతో వాపసు పోయి “సర్కార్ ! నల్గురు అరబ్బీ జవానులు పైసా యియ్యంది నీళ్లు తీసుకోనివ్వరు . అరె సుబేదార్ సర్కారు వారికిరా ! అంటే జంబియాలతో పొడిచే దానికే పట్వారీ లిట్లన్నారు .”హుజూర్ ! పదేండ్ల నుండి యీ మర్రిమాన్ పరగణా సుంకం సక్రమంగా వసూలౌతుంది . అందుకు సర్కారు ఫర్మాను వుంది .” “ఉంటే ఉండవచ్చ్సును “ అనుకోని సుబేదారు కూడా పైసలిచ్చి నీరు తెప్పించుకొన్నాడు .
ఒకనాడు దీవాన్ బహద్దర్ గారు అక్కడే డేరా వేయించినాడు . అతనికిన్నీ ఇదే గతి పట్టింది . అరబ్బులు కడవకు పైసా పెట్టండి ఒక మెట్టు కూడా దిగనియ్యరు . దీవానుగారు అంతా వినుకొని యిట్లా నుకొన్నారు . “మా హుజూర్ గారు ఫర్మానిచ్చి నారేమో లేకుంటే నా వద్ద కూడా వసూలు చేసే గుండె ఉందా వీనికి ?” దీవాను గూడా సుంకం చెల్లించుకున్నాడు . ఇక కాపువాన్ని పట్టే పగ్గాలు లేవు . సుబేదారేమిటి దీవాను బహద్దరు కూడా కిక్కురుమన కుండా సుంకం చెల్లించుకొని పోయివుంటే అబ్బా ఏం ‘దబ్దబారా ‘ వీనిది అని జనులు చాటున అనుకునే వారు . ఇట్లా వుండగా నవాబు గారు షికారుకు పోతూ పోతూ పొద్దు పోయిందని రాత్రికి ఆ ఊరులోనే ఠీకానా వేసినారు . నవాబో గివాబో ఇప్పటికి కాపు వానికెవ్వరున్నూ కంటికాగే అట్లు కనబడలేదు . పైసా ఆడపెట్టి బావిలోకి దిగూ అన్నాడు నవాబు నౌకరును . నవాబుకు షికాయతు అయింది . నవాబో గారిట్లా తమలోనే అనుకున్నారు .” మా దివాన్జీ మ ఖజానా భర్తీ చేసేదానికి ఈ హుకం యిచ్చినాడేమో పట్నం పోయిన తర్వాత విచారించుతాను . ఇప్పుడు మాత్రం నేనున్నూ ఖానూనుకు బద్ధున్నై ఉండాల్సిందే “ అని ఆలోచిచుకుని తానున్నూ నీటి సుంకం చెల్లించుకున్నాడు .
ఈపాటికి మర్రిమాన్ పరినగాణలో రెండంతస్తుల బంగ్లా పెరిగింది . గ్రామంలో సగం భూములు కాపు వానివే . 100 ఎద్దుల సేద్యం సాగించినాడు . చుట్టూ 5 ఆమడ దూరం అప్పులిచ్చాడు . నవాబుగారు తమ నగరానికి వేం చేసిన తర్వాత దివాన్జీని పిలిచి “దివాన్ సాబ్ , మీరెందుకు నీటి సుంకం ఏర్పాటు చేసినారు ? ఇది అన్యాయము కాదా ? అని విచారించాడు . అందుకు దీవానుగారిట్లు మనవి చేసుకున్నారు : “బందగానే ఆలీ , హుజూర్ ! నేనున్నూ మీతో అలాగే గుజారిష్ (మనవి ) చేసుకోవాలె అని వుంటిని . నేను కూడా సుంకం చెల్లించుకున్నాను . హుజూర్ గారు ఫర్మానె ముబారక్ జారీ చేసి ఉంటారని నేనున్నూ అనుకున్నాను “. “ అరే నీవూ హుకం ఇయ్యలేదు , నేనూ హుకం ఇయ్యలేదు . మరి ఈ 15 ఏండ్ల నుండి వాడు ఎట్లా వసూలు చేసినాడు ? వాణ్ణి గిరిఫ్తారీ (అరెస్టు )చేయించి తక్షణం పట్టి తెప్పించు “ అని నవాబుగారు ఉరిమినారు .
కాపువాడు ఇట్టి ఫర్మాను కొరకై 10 ఏండ్ల నుండి నిరీక్షించుతూనే వున్నాడు . 1000 అష్రఫీలు బంగారు తట్టలో పోసుకొని జర్రీ పనిచేసిన మఖ్మల్ బట్ట పైన మూసుకుని కాపువాడు హుజూరు వారికి నజరానా సమర్పించుకున్నాడు . నజరానా చూచే వరకు నవాబుగారు చల్ల బడ్డారు . “క్యారె నీకీ ఎవ్వర్ నీటి సుంకం హుకం ఇచ్చినార్ ?” అన్నారు నవాబ్ గారు . “హుజూర్ ! గ్యార్ కద్దూ బారా కోత్వాల్ హుకం ఎట్లా ఏర్పడిందో మర్రిమాన్ పరిగానా సుంకం కూడా అట్లే ఏర్పాటైంది అన్నాడు కాపు . “ఏమంటున్నావురా ? నీవనేదేమిన్నీ అర్ధం కాలేదు సరిగా చెప్పు “.
“ నా తప్పులంతా మాఫ్ చేస్తామని సెలవిస్తే అన్నీ మనవి చేసుకుంటాను .”
“సరేలే చెప్పు చూస్తాం “
కాపువాడు తన కథంతా వర్ణించి వర్ణించి చెప్పుకొన్నాడు . హుజూరు వారు అదే పనిగా నవ్వుతూ సాంతం విని “ అరె ! నీవు చాలా హుష్యారు మనిషివి . ణీ తప్పంతా మాఫ్ . ఇక ముందు నీవు మా దేవిడీ వద్ద రాత్రి గంటలు కొట్టూ వుండుము . అదే నీకు శిక్ష “ అని సెలవిచ్చినారు . కాపువానికి కొన్నాళ్ల వరకు తిక్క లేచినట్లుందినది . ఏమిన్నీ ఆదాయం లేదు . అధికారం లేదు అడిగేవారు లేరు . రాత్రులంతా నిద్ర కాయ వలెను . ఒకనాడు నిద్ర మబ్బులో రాత్రి 11 గంటలు కొట్టేది మరచిపోయినాడు . 12 గంటలకు లేచి 12 కొట్టినాడు . ఈ చిన్న పొరపాటుకు దేవిడీ అంతా తలక్రిందయ్యింది .
హుజూరు వారు 8 గంటల నుండి గంట కోక బేగం గారి గదికి పొయ్యేవారు . 11 గంటలు కొట్టలేదు . 11 గంటల బేరం వద్దకు హుజూరు పోలేదు . 11 గంటల బేగంగారు గంటల కాపును పిలిపించి “అరేయ్ ! నా గంట మరచిపోకుండా హుజూర్ ! “ అని కాపువాడు తత్తర పాటు తో అన్నాడు . “ ఈ గంటలో ఏమో రహస్యం ఉందిరా “ అని కాపువానికి స్ఫురించింది . ఒకనాడు 9 తప్పించినాడు . ఒకనాడు 10 తప్పించినాడు . ఒకనాడు 12 తప్పించాడు . ఏ గంట తప్పితే మరునాడే ఆ గంట బేగంగారు జీతం ఏర్పాటు చేసుకున్నది . ఈ విధంగా నెలకు 4000 రూపాయల జీతం ఏర్పాటైంది కాపువానికి .కొన్ని ఏండ్ల తరువాత నవాబుగారి కీసంగతి కూడా తెలిసింది . వీడు చలాకీ వాడు అని మెచ్చుకుని వాడు సుంకం వసూలు చేసిన గ్రామమే వాని కినాముగా ఇచ్చి పంపిం వేసినాడు . చూచినారా సొరకాయ మహిమ ! సొరకాయ నరుకుట అంటే ఇట్లాంటి కథలు చెప్పేదానికే అంటారు .

రచన :సురవరం ప్రతాప రెడ్డి
సేకరణ : మొగలాయి కథలు సంపుటి నుంచి …………

———–

You may also like...