పేరు (ఆంగ్లం) | Setty Lakshmi Narasimham |
పేరు (తెలుగు) | సెట్టి లక్ష్మీనరసింహం |
కలం పేరు | సెట్టి మాస్టరు |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1879 |
మరణం | 6/12/1938 |
పుట్టిన ఊరు | గంజాం జిల్లా గోపాలపురం |
విద్యార్హతలు | – |
వృత్తి | ఉపాధ్యాయుడు, న్యాయవాది, |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నరసింహంగారు రుక్మిణీ కళ్యాణం (1905), కీచక వధ (1907), చిత్ర హరిశ్చంద్రీయం (1913), లుబ్ధాగ్రేసర చక్రవర్తి ప్రహసనం ((1914), చిత్ర (1933) మొదలైన నాటకాలను రచించారు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | కవి, పండితుడు, నాటక రచయిత, నాటక సమాజ నిర్మాత, నాటక ప్రయోక్త మరియు నటుడు.సెట్టి లక్ష్మీనరసింహం మొదలైన వారు సభ్యులుగా ఉండి షేక్ ష్పియర్ నాటకాలు, వేణీసంహారం, చంద్రహాస, శ్రీనివాస కళ్యాణం, హరిశ్చంద్ర మొదలైన నాటకాలను అద్భుతంగా ప్రదర్శించేవారు. 1901 సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాలు జగన్మిత్ర సమాజంలో ప్రముఖ బాధ్యతలు వహించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సెట్టి లక్ష్మీనరసింహము |
సంగ్రహ నమూనా రచన | అహల్య(నాటకం ) పాత్రలు పురుషు పాత్రలు : గౌతముడు , నారదుడు , ఇంద్రుడు , బ్రహ్మ , సూర్యుడు, విష్ణువు,ఈశ్వరుడు ,మన్మధుడు ,వాయుదేవుడు . స్త్రీ పాత్రలు : హల్య, అహల్య (స్త్రీరూప ఋక్షవిరజుడు), రతి , సరస్వతి, లక్ష్మి , పార్వతి , అరుంధతి, అంజన, అనసూయ , లోపాముద్ర ,రంభ , మేనక , ఊర్వశి , తిలోత్తమ . |
సెట్టి లక్ష్మి నరసింహము
అహల్య(నాటకం )
పాత్రలు
పురుషు పాత్రలు : గౌతముడు , నారదుడు , ఇంద్రుడు , బ్రహ్మ , సూర్యుడు, విష్ణువు,ఈశ్వరుడు ,మన్మధుడు ,వాయుదేవుడు .
స్త్రీ పాత్రలు : హల్య, అహల్య (స్త్రీరూప ఋక్షవిరజుడు), రతి , సరస్వతి, లక్ష్మి , పార్వతి , అరుంధతి, అంజన, అనసూయ , లోపాముద్ర ,రంభ , మేనక , ఊర్వశి , తిలోత్తమ .
- అంకము
1 వ రంగము –సత్య లోకమునకు బోవు మార్గము
[ఇంద్రుడు , సూర్యుడు ప్రవేశింతురు .]
ఇంద్రుడు : నా ముందర గడు దొందరగా బోవుచున్న యా పురుషు డెవ్వడో ఆకారము , భాతృవర్యుడైనా , సూర్యునిది , ఆ తేజస్సు మాత్రము లేదు . పిలిచి చూచెదను .
సోదరా , సూర్యా !
సూర్యుడు :- ఎవరిది , యీ పిలుపు ? (తిరిగి చూచి ) వైభవని స్తంద్రుడు , మాయన్న
ఇంద్రుడు . అన్నా , నమస్కారము .
ఇంద్రుడు :- శ్రేయోభివృద్ధిరస్తు ! తమ్ముడా , ఎచ్చటికీ నీ ప్రయాణము ?
సూర్యుడు :- పద వధూ పద ధ్వన్యోకమగు సత్య లోకమునకు.
ఇంద్రుడు ;- నాకు దారి సాయము దొరకినది . ఒంటిపయనము కుంటిపయనము వంటిదై పొడుగును .
సూర్యుడు :-అన్నా ,యొంటిపయన మేల నీకు ?కాలినడక యేటికి ?ఏనుంగుల మేలు బంతి చౌదంతి , సాటిలేని వారువము ఉచ్చై శ్రవము , మఱీ —
ఇంద్రుడు ;- అన్నా , యేవియుబోలేదు: వాహనస్థానము నాకు బలముగానే యున్నది . కాని , కంటి కలకకు దీపకళికలవలె , పయోగములు ; పై పెచ్చు , బాధకములు … అది యటుండ నిచ్చి , నా నందేహ మొక్కటి తీర్పుమూ . స్వీయ శాంతి లేని భూమిని గాంతి మంతయు చేయు నిమిత్తమై నింగిని నిత్యమును నిలిచి యుండుట గదా , విధి నీకు గల్పించిన విధి ? అట్టిది మాని , యాజ్ఞానిమాననమును వలె సమస్త ప్రపంచమును దమోమయము చేసి , నీ విటు రాగలుగుట యెట్లు సంభవించినది ?
సూర్యుడు :- అన్నా , ఇందలికిటుకు నీ వింత వఱకు నెఱుగమి వింతయే . అమావాస్యనాడు సహా యాట విడుపు లేని నా యుద్యోగమున నొక్క సదుపాయము మాత్రము నాకు గలిగినది . వినుగో , పనియో , కలిగినప్పుడు గగనమున నా తేజస్సును దిగ విడిచి నాయిచ్చ నచ్చిన చోటికి సంచారము చేసి వచ్చుటకు నాకు స్వాతంత్ర్యము కలదు . అట్లు నే నాకాశమున విడిచిన నా తేజస్సు జూచి , లోకులు నన్ను గానే భ్రమింతురు. వెలుపటికి వెడలినయజమానుని యుష్ణీషము లోపటి నుండి కనబడుచు , సేవకుల నొక్కొక్క సారి పనుల యందుంచునుగదా ? అది వట్టి వేషమని సూచించుటకై , యప్పటి నా తేజస్సునకు బరి వేషము కలుగును .
ఇంద్రుడు :- ఇప్పుడు తెలిసినది , మీ సూర్య చంద్రుల పయిపోకడ లకు గల వీలు .
సూర్యుడు :- చంద్రునికి గల వీలు వేఱు విధముది. ఒక్క పున్నమ నాడే యతడు పదునైదు కళతోడను మింటి నంటి పెట్టు కొని యుండవలయును . తక్కిన తిధుల యుండట్లుగాక , కళలు కొద్దియో గొప్పయో విదిపడుటయు , విడివడిన కళలతో నతడు తన యిచ్చ వచ్చిన చోటికి బోవుటయు జరుగును. అమావాస్య నాడైనననో పదునైదు కళలతోడను నంచరించుట కతనికి వీలు .
ఇంద్రుడు : తమ్మోడా , షోడశకళాపరిపూర్ణుడు గదా చంద్రుడు ? పదునైదు కళలను గూర్చియే చెప్పితివి . పదునాఱవది యే సూత్రము బట్టి లోపింపజేసితివి ?
సూర్యుడు :– ఆ పదునాఱవకళకు జంద్రునియందు నిత్య లోపము కలిగి , యది నాగ సూత్రమున వ్యోమ కేశుడైన పరమేశుని శిరస్సునందు మందాకినీ ఫేన రేఖ చందమున నందముగా బొందు పడి యున్నది .
ఇంద్రుడు :- తమ్ముడా , భూమ్యాది సమస్త మండలములను సమాకర్షించు శక్తి నీకు గలదని పదార్ధ తత్త్వ వేత్తలు పలుకుదురు . అట్టి నిన్ను సత్యలోకమునకు సమాకర్షించినది , (నవ్వుచు ) యే రామ ? ఏ యత్యం తాభిరామరామ ?
సూర్యుడు :- అన్నగారు పరిహాసమునకు దిగినారు . అభిరామలైన రామలతోడి మహావైభవము తమదిగాని నాది కాదు .
రంభ వంటి యత్యంతాభిరామరామ , యూర్వశి వంటి యత్యం తాభిరామరామ , మేనక వంటి యత్యంతాభిరామరామ , తిలోత్తమ వంటి యత్యంతాభిరామరామ ,-
[తెరలో – రామ రామ , రామరామ , రామారం , రామరామ .]
ఇంద్రుడు :- పలుకురాయి యున్నదా యేమి ఇచ్చట ? నీ కడపటి పలుకులకు బౌనః పున్యము కలుగుచున్నది .
సూర్యుడు :- ప్రతిధ్వని కాదు . ఏదో సంగీతము వీణారవసమేతమై వీనుల విందు గొలుపుచున్నది.
ఇంద్రుడు :- (శ్రవణము నభినయించి ) అది మహతి . సందేహము లేదు . వీణాగాన విశారదుడు నారదుడు సత్యలోకము నుండి వచ్చుచున్నట్లున్నది ……….ఇప్పుడు దృక్పధమునకే వచ్చినాడు .
[“రామ రామ , రామరామ , రామరామ , రామరామ ,” యని పాడుచు నారదుడు ప్రవేశించును .]
ఇంద్రుడు , సూర్యుడు :- నారదమునీంద్రా , నమస్కారము .
నారదుడు :- (మొగమెత్తి ) ఓహో ! దేవేంద్ర దివేంద్రులు. ఆదిత్యులారా , మీకు విజయము కలుగునుగాక !
ఇంద్రుడు :- దేవముని పుంగవా , ‘ రా మ రా మ’ యను క్రొత్త మాటతోడి పాట పాడుచున్నారు . అది మంత్రమా , పేరా , పదమా ? ఏభాష ? శ్రీ సంబోధక మనుకొనుటకు మీరు విషయ విదూరులు .
నారదుడు :-
(తనలో ) ప్రమాదము నంభవించినది. రాబోవు యుగమున లోక విద్రావణు డైన రావనుడను రాక్షసుని సంహరించు నిమిత్తము భగవంతుడు రామా కాంతుడు రాముడై రవి వంశమున నవతరించునని యీ దినమున నాకు మా తండ్రి బ్రహం దేవుడు ప్రసంగ వశమున నేకాంతముగా దెలిపెను . పరమ రహస్య మిది వెల్లడింపరాదని యెఱీగియు , బరమేశ్వరునాకును దారక మంత్రము కానున్న రామ నామమును భక్తి పారవశ్యమున బాటగా బాద జొచ్చితిని . ఇముడకున్న యీ గుట్టు గుట్టకో పుట్టకో తెలిపినచో బాధ లేదు గాని , వీరికి దెలిపిన యెడల రామాయణ కథ ఇప్పుడే ముల్లోకముల నల్లుకొనగలదు .
ఇంద్రుడు :- మునీంద్రా , మాఱు పలుకక మీలో మీరే యేమో యాలోచించుకొనుచున్నారు .
నారదుడు :- (దివ్య దృష్టిని బరిశీలించి , తనలో ) సరిసరి ! ఏక కార్యార్ధులైన యీ యిరువురకును వివాదము కలిగించి , కొంత వినోద మనుభవింపవచ్చును .
సూర్యుడు :- మునీశ్వరా , మీ ప్రత్యుత్తరము వినుటకు గుతూ గుతూహలపడుచున్నారము .
నారదుడు :- ఆదిత్యులారా , నా సంకోచమునకు గారణము ,మీ రహస్యములు వెల్లడియగుణాన్న భయము .
ఇంద్రుడు :-మీ పాటకును మా రహస్యములకును గల సంబంధమేమి ?
నారదుడు : మిమ్ము జూచియే నా పాట యారంభించితిని . మీ హృదయకుహరమున నిప్పుడు మాఱు మ్రోగు చున్నది , ‘రామ రామ ‘, యను శబ్దమగునా , కాదా ?
ఇంద్రుడు :- (తనలో ) ఓహో , కొఱవితో దలగోకుకొని నట్లయినదే !
సూర్యుడు :- (తనలో ) ఈ త్రికాలవేది మద్రహస్య భేది యగుచున్నాడే !
నారదుడు :- ఏమి దేవేంద్రా , మాటాడవు ? త్రిలోకాభిరామయైన రామయ్ కదా నిన్ను సత్య లోకమునకు సమాకర్షించినది .
ఇంద్రుడు :- (శిరము వంచుకొనును)
నారదుడు :- మౌన మర్దాంగీకారమే కాదు ; ఈ విషయమున బూర్ణాంగీ కారమునే సూచించును . దినేంద్రా , నీ మాటయో ?
సూర్యుడు :- మీ రెఱుగనిదే మున్నది ? మీ యుహ సరి యైనదే .
ఇంద్రుడు :- (సూర్యునితో ) అన్నా ! దొంగా , ఇందాక నే నడిగినప్పుడు కాదని బొంకితివి ?
సూర్యుడు :- (ఇంద్రునితో ) అన్నా , తోడి దొంగవై యుండియు , ఇందాక నన్ను బరిహసింప నారంభించితివి ?
ఇంద్రుడు :- తమ్ముడా , మఱదలు ఛాయ యీ సంగతి విన్న యెడల , నే మనునో ?
సూర్యుడు :- అన్నా , వదినె శచీదేవి యీ సంగతి విన్న యెడల , నే మనునో ?
రచయిత :సెట్టి లక్ష్మి నరసింహం
సేకరణ :అహల్య నాటకము నుంచి ……………….
———–