పేరు (ఆంగ్లం) | Tallapragada Viswasundaramma |
పేరు (తెలుగు) | తల్లాప్రగడ విశ్వసుందరమ్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | సీతమ్మ |
తండ్రి పేరు | మల్లవరపు శ్రీరాములు |
జీవిత భాగస్వామి పేరు | తల్లాప్రగడ నరసింహశర్మ |
పుట్టినతేదీ | 3/6/1899 |
మరణం | 8/30/1949 |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని ఉండి |
విద్యార్హతలు | ఉభయ భాషా ప్రవీణ, సాహిత్య శిరోమణి పరీక్షలు చదివారు |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | “కవితా కదంబం” అనే పేరిట ఒక సంపుటిగా ప్రచురించారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | 930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని చురుకుగా పాల్గొని, శాసనధిక్కారం చేసి, బహిరంగంగా విదేశ వస్తు దుకాణాల వద్ద పికెటింగులు చేశి 1930లో జైలుకి వెళ్ళి 6 నెలలు శిక్షను అనుభవించారు. 1932లో శాసనోల్లంఘనం రెండవ ఘట్టం సమయంలో ప్రభుత్వం దమననీతిని అవలంబించింది. సభలు, సమావేశాలను నిషేధించింది. ఆజ్నల్ని ఉల్లంఘించి తెనాలిలో మండల కాంగ్రెసు సభను జరిపారు. మరో 6 నెలలు జైలుశిక్షను రాయవెల్లురులో అనుభవించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ప్రభుత్వం ఆనంద నికేతనాశ్రమాన్ని స్వాధీనపరుచుకున్నది. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ కవితలు |
సంగ్రహ నమూనా రచన | ప్రియుడా వచ్చి లాలించేటి ప్రియుడా ; నన్ను మచ్చికల నలరించు ప్రియుడా ; హెచ్చయిన ప్రేమసుధ లిచ్చి నన్ను వగల మరపించేటి ప్రియుడా ; భవ మెంతో భారమై పరుగులెత్తే వేళ శీర్ణమై నా గుండె శిథిల మయ్యే వేళ |
తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ
కవితలు
ప్రియుడా
వచ్చి లాలించేటి ప్రియుడా ;
నన్ను మచ్చికల నలరించు ప్రియుడా ;
హెచ్చయిన ప్రేమసుధ లిచ్చి
నన్ను వగల మరపించేటి ప్రియుడా ;
భవ మెంతో భారమై పరుగులెత్తే వేళ
శీర్ణమై నా గుండె శిథిల మయ్యే వేళ
కన్ను గవలో నొక్క కాంతి పుంజము దాల్చి
చిన్ని నవ్వులు మోము పై చిందు లాడగా
ప్రేమతో మనసిచ్చి ప్రీతితో నను దేర్చి
రమ్య మధురాలప రసము నాపై చిత్కి
నడకలో నొక వింత నాట్య మాడుచునుండ
పలుకులో నొక తీపి పలుకరించుచునుండ
ఇరులు నీ నవ్వుతో విరిసి పోవగాజేసి ,
మాటిమాటికి నాలో మమత పెంపొందించి
వచ్చి లాలించే ప్రియుడా ;
నన్ను మచ్చికల నలరించు ప్రియుడా ;
హెచ్చయిన ప్రేమసుధ లిచ్చి
నన్ను వగల మరపించేటి ప్రియుడా ;
స్నేహరుచి
అరమరలేని మన చిరతర స్నేహరుచుల్
కురిసిన వెన్నెలలా , అరవిరిసిన మల్లియలా ;
మనమున నవ్వగలే మాసెను ,
ఘనమగు నెయ్యము లో
మెరపుల గుంపేమో అది
తరగని వెలుగేమో
దినములు నిముసములై చనియెను
తిన్నని నడకలతో
కన్నుల తళుకేమో , అది
పున్నెపు ప్రోవేమో ;
జీవితమున కంతా అది
చెలువపు నిగ్గేమో ,
పరమ ప్రేమకు చిహ్నమైన తెలి వెన్నెల కాంతుల
సన్నపు తళుకేమో ;
కుపితి విధి
పూల మాలిక లల్లినందుకు
కరకుత్తులె కానుకయెను
తేనె సుధలను చల్లినందుకు
తేటి పోటుల కాటు లాయెను ;
విరహవ్యధలు ; విరహవ్యధలు ;
ఓర్వలేని విరహవ్యధలు ;
అగ్ని మండి గుండెలోన
ఆర దేమి చేతునే ;
మలయాపవనుడు పారి పోయె
మాధవీ మృదు సౌరభము గొని
నిలువ లేని చలువ కానుక
లిచ్చ నాడు గదమ్మ నీకు
గరళమగునో కట్ట కడకు
మురళి సన్నిభ గాన మగునో ;
వేచి యుండుము వేగా పడకా
కాచి యుండుము మాలతీ ;
ఈసు లేనీ లోకమేదో ;
ఎరాగి తెలియుము మాలతీ ;
వెర పెరుంగని లోక మేదో వెదకి తెలియుము మాలతీ ;
అంధకారము
కారు చీకటి పేరు కొనియేను ;
కడలి మ్రోతల మారు మ్రోగెను
దారుణంబగు నంధకారము
దారి తెలియదుగా ;
అచ్చటచ్చట మిణుగురైనను
జొచ్చి వెదకిన లేదు కనగా
హెచ్చు మోదము తోడ నేగేద
వేమి కనుగొనగా ;
భయము గొల్పెడు కారు సంద్రము
బాగుగా గను గొందువా యట
పార మెరుగని ఆ ఎడారిని
భయము పుట్టదుగా ;
చేటెరుంగవు పా టెరుంగవు
చెప్పినాను వినరాదోకో యట
కారు చీకటి భోరుమనియేను
కడలి మ్రోతలతో ;
రచన : తల్లా ప్రగడ విశ్వ సుందరమ్మ
సేకరణ : వైతాళికులు సంకలనం నుంచి ……………
———–