అబ్బూరి రామకృష్ణారావు (Abburi Ramakrishnarao)

Share
పేరు (ఆంగ్లం)Abburi Ramakrishnarao
పేరు (తెలుగు)అబ్బూరి రామకృష్ణారావు
కలం పేరు
తల్లిపేరుబాపమ్మ
తండ్రి పేరులక్ష్మీనరసింహశాస్త్రి,
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ5/20/1896
మరణం4/20/1979
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని అనంతవరం గ్రామం
విద్యార్హతలుఅబ్బూరి మైసూరు లోని సంస్కృత కళాశాలలో చదివారు .
వృత్తిప్రముఖ తెలుగు భావకవి, పండితుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఊహాగానము-పూర్వప్రేమ
మల్లికాంబ
నదీసుందరి.
మంగళసూత్రం: ఇది అబ్బూరి వారు రచించిన కథల సంకలనం. 1924లో ప్రచురితమైంది.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅబ్బూరి రామకృష్ణ రావు
సంగ్రహ నమూనా రచనఅబ్బూరి రామకృష్ణారావు
(1896-1979)
ఆంధ్ర చరిత్రలో ఒక ప్రధాన పాత్ర వహించిన కవి అబ్బూరి. స్టేజి స్పెషలిస్ట్ గా, కవిగా తెలిసిన వారు, ఆయన రాజకీయాలు గుర్తెరుగరు. కమ్యూనిస్టుగా జీవితం ఆరంభించిన అబ్బూరి, రాడికల్ హ్యూమనిస్ట్ గా మారి, చివరకు భక్తుడుగా మిగిలారు.

అబ్బూరి రామకృష్ణ రావు

అబ్బూరి రామకృష్ణారావు
(1896-1979)
ఆంధ్ర చరిత్రలో ఒక ప్రధాన పాత్ర వహించిన కవి అబ్బూరి. స్టేజి స్పెషలిస్ట్ గా, కవిగా తెలిసిన వారు, ఆయన రాజకీయాలు గుర్తెరుగరు. కమ్యూనిస్టుగా జీవితం ఆరంభించిన అబ్బూరి, రాడికల్ హ్యూమనిస్ట్ గా మారి, చివరకు భక్తుడుగా మిగిలారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్ గా వుంటూ, స్టేజి గురించి శ్రద్ధ వహించారు. అప్పుడే విద్యార్థిగా ఆయన్ను చూచాను. నాడు వైస్ ఛాన్స లర్ గా వున్న కట్టమంచి రామలింగా రెడ్డికి సన్నిహితుడు అబ్బూరి. అబ్బూరి రామకృష్ణారావు తెనాలి నుండి వచ్చారు. ఆంధ్ర యూనివర్శిటీలో ప్రముఖంగా స్థానం సంపాదించారు.

కాంగ్రెస్ లో రాడికల్ పాత్ర చేబట్టిన ఎం.ఎన్. రాయ్ (మానవేంద్ర నాథరాయ్) పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన్ను ఎం. వి. శాస్త్రి ద్వారా ఆంధ్రకు రప్పించాడు. వైస్ ఛాన్సలర్ కు పరిచయం చేశాడు. ఎం.ఎన్. రాయ్ ను యూనివర్శిటీలో చేరమని సి.ఆర్. రెడ్డి చేసిన ఆహ్వానాన్ని, మర్యాదగా రాయ్ తృణీకరించాడు.

అబ్బూరి, కమ్యూనిస్టు కాంగ్రేస్ రాజకీయాలకు భిన్నంగా, రాడికల్ డెమొక్రటిక్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహకుడయ్యారు. 1940 నుండీ 1948 వరకూ ఆ బాధ్యతలు నిర్వహించి, ఎం.ఎన్. రాయ్ మానవ వాద కార్యక్రమాలు ఆంధ్రలో ప్రచారం చేశారు. ఆయనకు తోడుగా విజయనగరంలో తాతా దేవకీనందన్, శ్రీకాకుళం నెల్లిమర్లలో పెమ్మరాజు వెంకట్రావు, కాకినాడలో ములుకుట్ల వెంకటశాస్త్రి తెనాలి నుండి ఆవుల గోపాలకృష్ణ మూర్తి, త్రిపురనేని గోపీచంద్, గుత్తి కొండ నరహరి మరెందరో తోడ్పడ్డారు.
కన్యాశుల్కం మొదలు అనేక నాటకాలు స్టేజిపై నిర్దుష్టంగా ప్రదర్శింపజేసిన అబ్బూరి, మంచి కవి, రచయిత. హైదరాబాద్ లో చివరి దశలో స్ధిరపడ్డారు. ఆయన గురువు ఎం.ఎన్. రాయ్ చనిపోయినప్పుడు, 1954లో ఒక గేయం ఇంగ్లీషులో రాసి డెహ్రడూన్ సమాధిలో వుంచారు.
1966 నుండీ నాకు బాగా సన్నిహితంగా అబ్బూరిని చూచే అవకాశం కలిగింది. ఆలపాటి రవీంద్రనాధ్ నేనూ చాలా సార్లు ఆయన్ను ఇంటి నుంచి సికింద్రాబాద్ సైలింగ్ క్లబ్బుకు తీసుకు వచ్చి, రెండు పెగ్గుల అనంతరం, ఆయన కబుర్లు విని ఎంతో సంతోషించేవాళ్లం.
ఆరోగ్యరీత్యా ఆయన డ్రింక్స్ మానేస్తే మంచిదని డాక్టర్ చెప్పారట. ఆయన భార్య యింట్లోనిష్ఠగా ఆహార పానీయాలు కంట్రోల్ చేసింది. అది భరించలేక మాకు ఫోను చేసేవారు వెళ్ళి, ఆయన భార్యకు హామీ యిచ్చి, బయటకు తీసుకెళ్ళేవాళ్ళం. అదొక పెద్ద అనుభవం.
ఆయన చివరిసారిగా పాల్గొన్న హేతువాద సభ హైదరాబాద్ లో 1970 ప్రాంతాల్లో జరిగింది. మహారాష్ట్రలో వాయ్ WAI నుండి తర్క తీర్థ లక్ష్మణ శాస్త్రి జోషి వచ్చినప్పుడు సభ ఏర్పరచి, అబ్బూరిని పిలిచాం. అప్పటికే ఆయనలో బాగా వార్ధక్య లక్షణాలు వచ్చేశాయి. హేతువాదం సన్నగిల్లింది. ఆయన వాయిస్ రికార్టుచేశాం. అనుభవాలు చెప్పించాం. ఆ సమాచారాన్ని అబ్బూరి ఛాయాదేవి (ఆయన కోడలు) వాడారు.

ఒకసారి క్లబ్బులో చెప్పిన మాటలు యిలా వున్నాయి. జాబాలి కథ అబ్బూరి చెబుతూ, చదువు నేర్పమని గురువు దగ్గరకు వెడితే నీది ఏ కులం అని అడిగాడట. మా అమ్మను అడిగి చెబుతానని అతడు వెళ్ళాడట. మరునాడు వచ్చి, మా అమ్మ ఎన్నో యిళ్ళలో పనిచేసిందట. అప్పుడు గర్భం ధరించగా, నేను పుట్టానట. కనుక ఎవరికి పుట్టానో చెప్పజాలను అన్నదట. ఈ విషయం విని, నిజం చెప్పావు గనుక నీవు బ్రాహ్మణుడికే పుట్టి వుంటావని, గురువు చదువు చెప్పాడట. ఇలాంటి వ్యాఖ్యానాలు అబ్బూరి ఎన్నో చెప్పేవాడు.
1940 ప్రాంతాల్లో గాంధీని దుయ్యబడుతూ ఆవుల గోపాలకృష్ణ మూర్తి వ్యాసం రాస్తే, ఘాటైన విమర్శ భరించలేక, అబ్బూరి దానిపై ఎం.ఎన్. రాయ్ కి ఫిర్యాదు చేశాడు. కాని రాయ్ అది చదివి, ఆవులను ఏమీ అనలేక పోయాడు.
అబ్బూరికి వరద రాజేశ్వరరావు, గోపాలకృష్ణ అని యిరువురు కుమారులు. రాయ్ అనుచరులుగా వారూ వుండేవారు. ఒకసారి ఒక విదేశీ పండితుడు ఆంధ్ర యూనివర్శిటీకి వచ్చి, సి.ఆర్. రెడ్డి ఎక్కడ వుంటాడని అబ్బూరిని అడిగాడు. ఆంధ్ర యోని వర్శిటీలో అని నర్మ గర్భంగా జవాబు చెప్పాడట.
రచనలు : అభినవ కవితా ప్రశంస (వ్యాసం), సూర్యరాజు (కథలు), ఊహాగానం, నదీ సుందరి, మంగళ సూత్రం (నవల), త్రిశంకు (కావ్యం), చాటువులు. అనువాదాలు – రవీంద్ర రచనలు.

 

పృథివీ ప్రశంస

ఓ విశాలావనీ
శోభాతిపావనీ
ఆరంభపుణ్యక్షణముల నీశుడు విసరిన నాటి
నీ యాది సౌభాగ్య మొటుల వెల్గెనో ? భవదీయశాటి
ఆకుపచ్చని యాకులో
పండు వెల్తురు రేకులో
నిన్ను ప్రశ్నింపగాజాల , నీనాటి ప్రొద్దుటి పూట
గంభీరమైన ప్రవహించె నీదు సౌందర్యంపు పాట
ఓ విశాలావనీ :
శోభాతిపావనీ :
కాంతికల్లోతివీ :
వైభవశాలినీ :
సీతా సతీవేణి నడగి వాడి పోవని పూవు బోతి
దినదినా పూర్వమై పొడుచు , తావకీవిభాత కేళి
ప్రాభాతగానమ్ములా ?
నీ యస్తమానమ్ములా ?

ఏవి సుందరమ్ములొకొ ? యెట్టి గీతా పరీమళము
ఆనంద వీధి నాడించు ణీ హృదయ సరోజ దళము
కాంతి కల్లోలినీ :
వైభవశాలినీ :
ధవళయశోవతీ :
స్నిగ్ధ తేజోవతీ :
పారెడు కాల్వల చెంత వీచెడు గాడ్పుల వినుచు
నీ యుదాత్త లలాట రేఖ వులకలు సూప కన్గొనుచు
త్వత్కా యమానమ్ములై
శ్యామాయమానమ్ములై
దవ్వులనున్న వెదుళ్ళు కలిసి కంఠము లెత్తి పాడ
తల్లి నీ యొడిలోన నడగి యల్ల రిలేక విన్నాడ
ధవళయశోవతీ :
స్నిగ్ధతేజోవతీ :
హే నవమోహినీ :
హే దయా వాహినీ :
చూడ సుందరములై యడరు నా శృంఖలమ్ముల ద్రెంచి
నా మేలి వాకిళ్ళ దాటి విందు నీ మధుర విపంచి
బంగారు తోరమ్ములన్
నా రత్న హారమ్ములన్
గైకొని న కిమ్ము జనని నీ మృత్తి కారేణుకణము
శాద్వ లశ్యామల వీధి వికసించు పచ్చ ప్రాంగణము
హే నవ మోహిని :
హే దయావాహిని :
*** *** ***
వర్షా గమము
రసిక హృదయము లోలలాడే
మసుపు దినములు మరలి వచ్చెను
మిసిమి మబ్బులు వ్రేలు మేలిమి
ముసుగుతో నాకసము విచ్చెను :

తరలి రా ఆషాఢలక్ష్మీ
మెరపు తీవాలు తొలకు రధమున
మురిపెమున దిక్కాంత లలరగ
తరలిరా : మేఘముల పథమున :

పది కెలంకుల నూడ్చి వల్లీ
మదవతులు కానుకల నుంచిరి
మొదటి చినుకుల తోడ మెరసే
పొదుపుతో మోములను వంచిరి :

వేకువలతో శంఖ మొత్తుచు
లోకముల నిక మేలుకొల్పుము
శ్రీకరములగు తరిపివానల
శీకరము వాకిళ్ళ నిల్పుము :

మంగళ స్నానమ్ము లారిచి
చెంగలించెడు నీటి కాలువ
పొంగి పోయె నొసంగు పృథివీ
ప్రాంగణములకు పచ్చ శాలువ :

అడవి కోనల లోన నీకై
యెడరు వేచిన నెమిలి కన్నెల
కడుపు కోతల మాన్పి దాహము
లుడిపి పరుపుము చల్ల వెన్నెల

ఉరుము లురిమెడు గర్జనమ్ముల
మెరుపు తీవల మేలవింపుము
మురిసి యాడెడు వాన చినుకుల
సరసగానము లాలకింపుము :
*** *** ***
కలత
వలపు నిండార విరిసిన పారిజాత
కుసుమములు నేల రాలు వేకువలయందు
ప్రసవయ్యా పథముల నీ పాదయుగళి
కదలెనో నాదుహృదయమే కలత వడెనో ?

కాని పలుమారు నా కందరాని వస్తు
వేదియో దూరమున నుండి యెలుగు లెత్తు
పరిమళ పరీతమైన నీ ప్రణయ వార్త
భూన భోంతరాళమ్ములు పులకరింప :

బహుళ మందార గంధ లోభమున తిరుగు
మధుకరము వోలె హృదయ మున్మత్త మయ్యె
పరవశమ్మైన భావ ప్రపంచమందు
బందినై యెన్నినా ళ్ళుండ వలెనొ యేమో ;
దీపికలు లేని వాకిళ్ళు తెఱచి నాదు
తలపు లొక్కక్కటే నిన్ను దరియ బోయి
తిరిగి వచ్చు నుండు పందిళుల క్రింద
కేళి దిరుగాడు పెండ్లి చుట్టాల రీతి :

రచన :అబ్బూరి రామ కృష్ణ రావు
సేకరణ : అబ్బూరి రామకృష్ణ రావు కవితల నుంచి సేకరణ …..

———–

You may also like...