కొడాలి ఆంజనేయులు (Kdali Anjaneyulu)

Share
పేరు (ఆంగ్లం)Kdali Anjaneyulu
పేరు (తెలుగు)కొడాలి ఆంజనేయులు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1898
మరణం1/1/1982
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిప్రభుత్వ ఉద్యోగి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅవతార పరివర్తనం నాటకం,
ఖాదీ అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని మహాత్మా గాంధీ రచించగా ఆంజనేయులు తెలుగులోకి అనువదించారు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు1924, ఏప్రిల్ 20న గాంధీజీ ఘంటసాల గ్రామానికి వచ్చినపుడు, ఆయనను కొడాలి గ్రామానికి తీసికొనివచ్చి, స్వాతంత్ర్యపోరాటానికి గ్రామస్థుల నుండి విరాళాలు సేకరించి అందించాడు. అంతేగాక తన 40 ఎకరాల భూమితోపాటు, ఇంటిని సైతం ఉద్యమానికి పణంగా పెట్టిన నిస్వార్ధపరుడు. పోరాటంలో లాఠీదెబ్బలు, జైలు జీవితానికి వెరవలేదు. అనేక పుస్తకాలు గూడా వ్రాసిన ఆయన, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొడాలి ఆంజనేయులు
సంగ్రహ నమూనా రచనకొడాలి ఆంజనేయులు గారు 1897లో కృష్ణాజిల్లా దివి తాలూకాలోని కొడాలి గ్రామంలో జన్మించారు. బందరు హిందూ హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రులు గారి దగ్గర విశ్వనాథ సత్యనారాయణ గారితో కలసి చదువుకున్నారు. తరువాత వీరిద్దరూ ‘సత్యాంజనేయ కవులు’ పేరుతో జంట కవులుగా కొంతకాలం కవిత్వం చెప్పారు. తరువాత ఆంజనేయులు స్వాతంత్య్ర సమరంలోకి దూకగా, విశ్వనాథవారు సాహిత్యరంగంలో నిలదొక్కుకున్నారు.

కొడాలి ఆంజనేయులు

కొడాలి ఆంజనేయులు గారు 1897లో కృష్ణాజిల్లా దివి తాలూకాలోని కొడాలి గ్రామంలో జన్మించారు. బందరు హిందూ హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రులు గారి దగ్గర విశ్వనాథ సత్యనారాయణ గారితో కలసి చదువుకున్నారు. తరువాత వీరిద్దరూ ‘సత్యాంజనేయ కవులు’ పేరుతో జంట కవులుగా కొంతకాలం కవిత్వం చెప్పారు. తరువాత ఆంజనేయులు స్వాతంత్య్ర సమరంలోకి దూకగా, విశ్వనాథవారు సాహిత్యరంగంలో నిలదొక్కుకున్నారు. అనంతర కాలంలో విశ్వనాథవారు తన ‘రామాయణ కల్పవృక్షం’ అవతారికలో కొడాలి వారిని గుర్తుచేసుకుంటూ ‘అతడె తోడు కల్గినను అచ్చముగ కలకండ అచ్చులుం పోతలు పోసియుండెదము పోతనగారి విధాన’ అని కూడా ఉద్ఘాటించారు. అంతేకాదు, తన ‘వేయిపడగలు’లో కొడాలివారిని రాఘవరావు అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేయించారు కూడా. పీకలదాకా స్వాతంత్య్ర సంగ్రామంలో కూరుకుపోయిన ఆంజనేయులు గారు అడపాదడపా రాసిన ఖండకావ్యాల్లో జాతీయోద్యమ సువాసనలు గుబాళించేవి. 1922-25 మధ్యకాలంలో గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేసినందువల్ల ఆంజనేయులు గారు ‘సాహితి’ సంపాదకులుగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యంలో పెద్ద సంచలనం సృష్టించిన చలం కథలను తొలిసారిగా ప్రచురించిన సాహసం, ఘనత కొడాలి వారికే దక్కుతాయి. సాహితిలోనే కాక భారతి, శారద, సఖి, జ్వాల, ప్రతిభ, వీణ, కృష్ణా పత్రికలకు కూడా ఆయన కవితలు రాశారు. అనేక సంకలనాల్లో ఆయన కవితలు స్థానం సంపాదించుకున్నాయి. న్యూయార్క్‌లో ప్రచురితమైన ‘ఇండియా లవ్స్‌ పోయెమ్స్‌’లో కాళిదాసు, భర్తృహరి, క్షేత్రయ్య, అల్లసాని పెద్దన వంటి మహాకవుల కవితలతో పాటు ఆంజనేయులుగారి ఖండకావ్యం ‘పెళ్ళి కూతురు’ కూడా ‘టు ది బ్రైడ్‌’ పేరుతో ప్రచురితమైంది. 27 సంవత్సరాల పాటు స్వాతంత్య్రసమరంలో కష్టాలు భరిస్తూ, ఏడేళ్ళపాటు సి క్లాసు జైలు శిక్షను అనుభవించినా, స్వాతంత్ర్యానంతరం అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నా ఆంజనేయులుగారు జీవితాంతం ఆశాజీవే. ఏ పనిచేసినా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన కర్మయోగి ఆయన.

– కొడాలి వేంకటాచలం
(ఆంజనేయులుగారి జన్మస్థలం కొడాలిలో నేడు ఆయన విగ్రహావిష్కరణ)

సన్యాసి
మొగలి రేకుల మృదుల కపోలయుగము
కరకు టెండల వేడిమి కందు వారె
తెలిమోగిలు నెలవంక తెరగు బూని
బూది బూసిన మోము మురువు కరిగె :

కన్నె పూబోణి గాటంపు గౌగిలింత
నవసి వసివాడు ణీ మేని చివురు నేడు
కఠిన హృదయమ్ము లేనియు గరగిపోవ
కటిక రానేల గదుములు కట్టెనకట ;

కావిపుట్టము కటిసీమ కట్టు భాగ్య
భోగ్య రాహిత్యమైన వైరాగ్యమునకు
జాజి పూసౌరభమ్ములు జల్లు విరియు
జవ్వనమ్మున కెంతటి దవ్వు గలదు ?

దివ్య కుసుమాంగి యీ నేలు దీసి యిచ్చు
లే దములపాకుమడుపులు కాదటంచు
హరిణశాబమ్ములకు తృణంకురము లిడగ
మనసు పుట్టెనె ఎంత యమాయికుడవు ?

మధుర దరహాస చంద్రికా సుధా తొరంగు
కామినీ స్నిగ్ధ గండ భాగమ్ములాను
కప్పురపు కమ్మతావుల కావిమోవి
బీటువడ నీకు వైరాగ్య వృత్తి యేల ?

అల్లనల్లన దరిజేరి అలతి సిగ్గు
జాలిచూపుల క్రేగంట మేళవించి
మధుర మందస్వనంబుల మాటలాడు
ప్రణయినీ బాంధవం బెట్లు బాసినావు ?

స్వరము పరిత్యజింపగ జనుమ గాక
పూప జవరాలి పోలయల్క బాపు నాటి
ప్రణయ భావమ్ము స్మరణకు రాక గడవ
జనునె నీకు దీర్ఘ నిశీధ సమయములను ?

నవ్వెద వదేల ? నా మాట నమ్మి నీదు
నెలత కడకేగి , తప్పు మన్నింపు మనుము
కరకు రుద్రాక్షమాల కంఠసీమ
కమ్మ సంపంగి దండలు గౌగిలింప ;
**** *** ****

అడవి పిల్ల
నిండు ప్రాయమ్మునకు తోడు నీడయైన
సిగ్గు సింగార మెరుగని చెలియ నీదు
ముగుద చూపులు మా పూర్వ పుణ్యమునను
అడవి తొలకరి పూవుల యట్లు దొరికె :

ముళ్ళ పూదీవ గుంపుల చాళ్ళనుండి
కన్నెగాడుపు వీచిన కదలు నీదు
వెన్నెల యిగుళ్ళ పయ్యెద వెలితి నుండి
జవ్వనపునీడ లారిన చాలు మాకు :

సడియు చప్పుడు లేని యడవి కోన
అలతి సెలయేటి సొనల యీలలకు లయలు
తెలియజెప్పు ణీ రాగాల తీయదనము
వలన పూల కారుపవళ్లు పులకరించు ;

ఈ మలయపవనమ్ములు ఈ మనోజ్ఞ
యామినులు నీ వనుభవింప నా విరించి
తెరవ ణీ కొక్కతెకు ప్రసాదించెనేమో
వలపువల వంత లెరుగని పడుచుదనము ;

వింటి బద్దల అంబులు విడుచు నీదు
సులువు నేర్పు లలోని నాజూకుదనము
అలరువిలుకాని కేనియు దెలియరామి
బ్రదికి పోయిరి తబసి జవ్వము నిజాము ;
*** *** ***
రాధ
మాసిన చీరతో పొగడ మ్రాకుల రెమ్మల నీడ
దీర్ఘ నిశ్శ్వాసముల న్నిగిడ్చేదవు ,
జంకక నీ చెలి కోసితేర నీ దోసెడు
మొల్ల మొగ్గలను చూసి దళమ్ములు
కుప్పపెట్టె దేలే సుకుమారి : యింత విసుగేటికి

నీ యెల జవ్వనంబునన్
ఈ సుకుమారపు న్నిశల కృష్ణు డొసంగిన
పుష్య రాగపుం బూసల దండ రాపుడుల పూను
కుచాగ్రము లుష్ణ బాష్పపున్ రాసుల
కంగు వారెడు విరాగ మదేటికి ? నిండు
ప్రాయపున్ మోసుల వేళ నిట్టి యిడుముల్ పడ
నిన్ను విరించి చేసెనే :

మోసము చేసి యెచ్చటికో పోయిన
మాధవు గూర్చి యింతగా వేసట చెంది
పుష్ప వన వీధికలన్ వేదుకంగ నేల
నీ వేసగి పూల వెన్నెలలు ప్రేమ కనర్హ ములో
పికాంగనాభ్యాసిత రాగముం బ్రణయ
పాత్రము కాదొ వచింపు మిత్తరిన్ :

చెల్లరె యీ మధూ పవన సీమల
నావులగాచు వానికి పల్లెలనుండి
నాగరిక పద్ధతులేమొ యెరుంగనట్టి
యా గొల్లపడంతు లెల్లరును కోరిన కోరిరిగాక
నీవు నా నల్లని వానినే వలచి నావట
యెంతటి సిగ్గుచేటోకో :

రచన : కొడాలి ఆంజనేయులు
సేకరణ : వైతాళికులు గ్రంధం నుంచి …

———–

You may also like...